కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో కొత్త 2021 Apache RR 310 ని విడుదల చేసింది. ఈ బైక్ భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటి నుంచి కూడా అద్భుతమైన స్పందనను పొందుతుంది. 2021 Apache RR 310 బైక్స్ యొక్క మొదటి బ్యాచ్ బుకింగ్స్ అప్పుడే పూర్తయినట్లు కంపెనీ తెలిపింది. 2021 Apache RR 310 యొక్క సెకండ్ బ్యాచ్ అక్టోబర్ 01 నుంచి ప్రారంభం కానుంది.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

TVS 'బిల్డ్ టు ఆర్డర్' ప్లాట్‌ఫామ్ ద్వారా బైక్ కొనుగోలు చేసే ముందు మార్పులు చేసే అవకాశాన్ని అందిస్తుందని ఇదివరకే తెలుసుకున్నాం. కావున కొనుగోలుదారులు కంపెనీ అందించే డైనమిక్ మరియు రేస్ అనే రెండు కస్టమైజేషన్ ప్యాక్‌లను ఎంచుకోవచ్చు. ఇవి బైక్ యొక్క గ్రాఫిక్స్, రిమ్ కలర్, యాక్సెసరీస్ మరియు రేస్ బేస్డ్ నంబర్ స్టిక్కర్ వంటివి ఎంచుకోవడానికి అవకాశాన్ని ఇస్తుంది.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

TVS 'బిల్డ్ టు ఆర్డర్' ప్లాట్‌ఫారమ్‌లో బైక్ ఆర్డర్ చేయడానికి, వినియోగదారులు TVS ARIVE మొబైల్ అప్లికేషన్ (యాప్) ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ అందుబాటులో ఉన్న ఎంపికల ప్రకారం బైక్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాట్‌ఫారమ్‌లో బైక్‌లో సాంకేతికతకు సంబంధించిన మార్పులు చేయడానికి అవకాశం లేదు.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న 2021 Apache RR310 ధర రూ .2.59 లక్షలు(ఎక్స్-షోరూమ్). కొత్త Apache RR310 బైక్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఈ బైక్ పై కంపెనీ అందిస్తున్న కస్టమైజేషన్ ఫ్యాక్స్ వల్ల కలర్ మరియు బాడీ గ్రాఫిక్ వంటి వాటిని కొనుగోలుదారులు ఏంచ్చుకోవచ్చు.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

2021 Apache RR 310 బైక్ 312 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 9,700 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 7,700 ఆర్‌పిఎమ్ వద్ద 27.3 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ స్లిప్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

కొత్త 2021 Apache RR310 బైక్ నాలుగు రైడింగ్ మోడ్‌లను కలిగి ఉంది. అవి ట్రాక్ మోడ్, స్పోర్ట్ మోడ్, అర్బన్ మోడ్ మరియు రెయిన్ మోడ్. ఇవి వాహనదారుడి రైడింగ్ కి చాలా బాగా ఉపయోగపడతాయి, కావున అద్భుతమైన రైడింగ్ అనుభవాన్ని పొందవచ్చు.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

Apache RR 310 యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో USD ఫోర్క్‌లు మరియు వెనుకవైపు మోనో-షాక్ సెటప్ ఉంటాయి. అదేవిధంగా ఇది మంచి బ్రేకింగ్ సిస్టం కూడా కలిగి ఉంటుంది, కావున ఈ బైక్ రెండు వైపులా డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. దీనితోపాటు డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్ గా లభిస్తుంది. మొత్తానికి ఈ బైక్ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి పర్ఫామెన్స్ కూడా అందిస్తాయి.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

కొత్త అApache RR310 ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టైలైట్ మరియు టర్న్ ఇండికేటర్స్ వంటి వాటిని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ మరియు గ్లైడ్-త్రూ టెక్నాలజీతో కూడిన 5 ఇంచెస్ TFT కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

TVS Motor కంపెనీ ఇటీవల దేశీయ మార్కెట్లో కొత్త Raider 125 సీసీ మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది. ఈ ధర భారత మార్కెట్లో రూ. 77,500 (ఎక్స్-షోరూమ్). కొత్త Raider 125 బైక్ డెలివరీలు కూడా ఇప్పటికే ప్రారంభించబడ్డాయి. ఈ కొత్త ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్ మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

ఈ బైక్ లో 10 లీటర్ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బైక్ ని చాల ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

కొత్త Apache RR310 కి డిమాండ్ మామూలుగా లేదుగా.. అప్పుడే ఫస్ట్ బ్యాచ్ బుకింగ్ ఫినిష్

TVS Raider బైక్ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 124.8 సీసీ ఇంజిన్‌తో 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.ఇంజిన్‌ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

More from DriveSpark

Article Published On: Saturday, September 25, 2021, 10:54 [IST]
English summary
Tvs apache rr 310 first batch completely booked details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+