కొత్త TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్, పర్ఫామెన్స్ & వివరాలు

ప్రముఖ డిచక్ర వాహన తయారీ సంస్థ TVS Motor (టీవీఎస్ మోటార్) భారతీయ మార్కెట్లో అప్డేటెడ్ Apache RTR 160 4V సిరీస్ బైకులను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో ఉంటాయి. ఇందులో కొత్త LED డేటైమ్ రన్నింగ్ లైట్లు, హెడ్‌ల్యాంప్‌లు మరియు మూడు విభిన్న రైడింగ్ మోడ్‌లతో పరిచయం చేయబడ్డాయి.

TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

TVS Motor (టీవీఎస్ మోటార్) ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ మోడల్‌ని కూడా ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పుడు నాలుగు వేరియంట్స్ లో ఈ కొత్త బైకులను ప్రయసపెట్టింది. అవి రియర్ డ్రమ్, రియర్ డిస్క్, రియర్ డిస్క్‌ విత్ బ్లూటూత్ మరియు స్పెషల్ ఎడిషన్.

 • TVS అపాచీ RTR 160 4V (రియర్ డ్రమ్): రూ .1,15,265
 • TVS అపాచీ RTR 160 4V (రియర్ డిస్క్): రూ .1,17,350
 • TVS అపాచీ RTR 160 4V (రియర్ డిస్క్‌ విత్ బ్లూటూత్): రూ .1,20,050
 • TVS అపాచీ RTR 160 4V స్పెషల్ ఎడిషన్: రూ 1,21,372 (ఈ ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)
 • TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  TVS అపాచీ RTR 160 4V స్పెషల్ ఎడిషన్‌లో ప్రత్యేకమైన స్పోర్టి బాడీ డెకల్స్ మరియు స్పెషల్ కలర్ థీమ్ వంటివి ఉన్నాయి. ఇది మాట్టే బ్లాక్ కలర్ థీమ్‌తో రెడ్ అల్లాయ్ వీల్స్ కలిగి ఉంది. స్పెషల్ ఎడిషన్ మోడల్ కొత్త సీట్ ప్యాట్రన్, అడ్జస్టబుల్ క్లచ్ మరియు బ్రేక్ లివర్‌తో కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్‌ను కూడా పొందుతుంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అంటే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ మరియు నైట్ బ్లాక్ అనే మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది.

  TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  TVS అపాచీ RTR 160 4V బైక్ 159.7 సిసి సింగిల్ సిలిండర్, ఆయిల్ కూల్డ్, ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజన్ 9,250 ఆర్‌పిఎమ్ వద్ద 17.38 బిహెచ్‌పి పవర్ మరియు 7250 ఆర్‌పిఎమ్ వద్ద 14.73 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

  TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  ఈ కొత్త బైక్ లోని బిఎస్ 6 ఇంజిన్ దాని మునుపటి బిఎస్ 4 ఇంజిన్ కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. కావున మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ రేస్ ట్యూన్డ్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను పొందుతుంది, ఇది మరింత త్రాటల్ రెస్పాన్స్ అందిస్తుంది. ఈ కారణంగా బైక్ రైడర్ల కి మరింత అనుకూలమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

  TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  కంపెనీ ఈ బైక్ లో అందించిన ఇంజిన్ ఈ విభాగంలోని ఇతర బైకులకంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. ట్రాఫిక్‌లో ఈ బైక్ నడపడం మరింత సులభతరం చేయడానికి, TVS దానిలో కొత్త గ్లైట్ త్రూ టెక్నాలజీని అందించింది, దీని కారణంగా ఈ బైక్‌ను ట్రాఫిక్‌లో వేగవంతం చేయకుండా గంటకు 6 నుంచి 7 కిమీ వేగంతో నడపవచ్చు.

  TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  RTR 160 4V ఇప్పుడు మూడు రైడింగ్ మోడ్‌లను కూడా పొందుతుంది. అవి రెయిన్, అర్బన్ మరియు స్పోర్ట్ మోడ్స్. ఇందులో ఎల్‌సిడి డిస్‌ప్లే మరియు రేడియల్ రేర్ టైర్‌పై గేర్ పొజిషన్ ఇండికేటర్ ఆంటీకి కూడా ఉన్నాయి. ఇందులోని టాప్ వేరియంట్ ఇప్పుడు TVS 'SmartXonnect బ్లూటూత్ టెక్నాలజీని పొందుతుంది.

  TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  కొత్త RTR 160 4V బైక్‌లో మంచి బ్రేకింగ్ సిస్టం కూడా అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా బ్రేకింగ్ సిస్టం మెరుగుపరచడానికి ఇందులో సింగిల్ ఛానల్ ఏబీఎస్ కూడా ఇవ్వబడింది. TVS అపాచీ RTR 160 4V డ్యూయల్ పెటల్ డిస్క్ బ్రేక్‌లతో 6-స్పోక్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. ఈ బైక్‌లో, కంపెనీ అపాచీ RTR 4V సిరీస్ యొక్క డబుల్ బారెల్ సైలెన్సర్‌ని ఇచ్చింది. ఈ కారణంగా ఈ బైక్ యొక్క స్టైల్ మరింత దూకుడుగా ఉంటుంది.

  TVS Apache RTR 160 4V బైక్: అప్డేటెడ్ ఫీచర్స్ & పర్ఫామెన్స్

  TVS Motor (టీవీఎస్ మోటార్) కంపెనీ ఇటీవల తన సెప్టెంబర్ 2021 టూ వీలర్ అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ గత నెలలో మొత్తం 3,32,511 యూనిట్ల ద్విచక్ర వాహనాల అమ్మకాలను నమోదు చేసింది. ఈ అమ్మకాలు మునుపటికంటే కూడా దాదాపు 6 శాతం వృద్ధిని నమోదు చేయగలిగింది. గత సంవత్సరం 2020 సెప్టెంబర్ నెలలో కంపెనీ మొత్తం 3,13,332 వాహనాలను విక్రయించింది. కంపెనీ గత నెలలో కొంత వృద్ధిని నమోదు చేయగలిగింది. అయితే ఇప్పుడు పండుగ సీజన్ కావడం వల్ల అమ్మకాలు మరింత జోరుగా సాగే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Tvs apache rtr 160 4v special edition launched new features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X