కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ అపాచీ సిరీస్‌లో ఓ కొత్త వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ మోడల్‌ను కంపెనీ ఇప్పుడు కొత్త రైడ్ మోడ్స్‌తో విడుదల చేసింది.

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

కొత్త మోడ్స్‌తో ప్రవేశపెట్టిన 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ధర రూ.1.28 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఈ విభాగంలో లభిస్తున్న ఇతర మోటార్‌సైకిళ్లతో పోల్చితే, రైడ్ మోడ్ ఫీచర్‌ను తొలిసారిగా ఈ మోడల్‌లోనే అందిస్తున్నామని టీవీఎస్ పేర్కొంది.

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

టీవీఎస్ ఈ ఫీచర్‌ను ఇప్పటికే టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్లో ఆఫర్ చేస్తోంది. ఈ రైడింగ్ మోడ్స్‌లో స్పోర్ట్, అర్బన్ మరియు రెయిన్ అనే ఆప్షన్లు ఉంటాయి. రైడర్ తాను ప్రయాణించే రోడ్డు లేదా అవసరాన్ని బట్టి ఈ రైడ్ మోడ్‌లను ఎంచుకోవచ్చు. ఈ రైడ్ మోడ్స్‌కి అనుగుణంగా ఇంజన్ పనితీరు మారుతూ ఉంటుంది.

MOST READ:జూనియర్ ఎన్టీఆర్ కొత్త కార్ ఖరీదు 5 కోట్లు.. ఇంతకీ ఆ కార్ ఏదో మీరూ చూడండి

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్‌గా మూడు రైడింగ్ మోడ్స్‌తో వస్తున్న కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్‌లో సర్దుబాటు చేయగల ఫ్రంట్ సస్పెన్షన్, సర్దుబాటు చేయగల బ్రేక్ మరియు క్లచ్ లివర్ మరియు రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

ఇక రైడింగ్ మోడ్స్ విషయానికి వస్తే, ఇందులోని అర్బన్ మోడ్ పేరుకు తగినట్లుగానే రోజువారీ సిటీ రైడ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇంజన్ నుండి గరిష్ట పవర్‌ను గ్రహించేలా మరియు తక్షణమే ఏబిఎస్ రెస్పాండ్ అయ్యేలా ఈ మోడ్‌ను డిజైన్ చేశారు.

MOST READ:త్వరపడండి.. అక్కడ ఒక కేజీ కేక్ కొంటె ఒక లీటర్ పెట్రోల్ ఫ్రీ

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

రెయిన్ మోడ్‌లో, స్ట్రాంగ్ లివర్ పల్సేషన్ అనుభూతిని అందించేందుకు ఇది ఏబిఎస్ నుండి గరిష్ట స్పందనను పొందుతుంది. తడిగా ఉన్న రహదారులపై మరియు వర్షంలో రైడ్ చేసేటప్పుడు ఈ మోడ్ చక్కగా ఉపయోగపడుతుంది. తడి రోడ్లపై ఏబిఎస్ రెస్పాన్స్ మెరుగ్గా ఉంటుంది, ఫలితంగా వాహనం కూడా అదుపులో ఉంటుంది.

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

ఇకపోతే, ఇందులో చివరి మోడ్ అయిన స్పోర్ట్ మోడ్‌ను ట్రాక్ మరియు హైవేల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడినది. ఈ మోడ్ ఇంజన్ నుండి గరిష్ట శక్తిని పొంది, వేగవంతమైన యాక్సిలరేషన్‌ను అందిస్తుంది. ఇది ఏబిఎస్ నుండి తక్కువ అసిస్టెన్స్‌ను పొంది, ల్యాప్ టైమ్‌ను వేగంగా పూర్తి చేసేందుకు స్లిప్ క్లచ్ అసిస్టెన్స్‌ను పొందుతుంది.

MOST READ:మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతకు 5 లీటర్ల పెట్రోల్ గిఫ్ట్‌గా ఇచ్చారు, ఎందుకో తెలుసా!

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

రైడింగ్ మోడ్స్‌తో ప్రవేశపెట్టిన కొత్త టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్ దేశవ్యాప్తంగా ఉన్న అధీకృత టీవీఎస్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది గ్లోసీ బ్లాక్, పెరల్ వైట్ మరియు కొత్త మ్యాట్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

ఈ మోటార్‌సైకిల్‌లో రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, రేస్ ట్యూన్డ్ స్లిప్పర్ క్లచ్, బ్లూటూత్ ఎనేబుల్డ్ టీవీఎస్ స్మార్ట్ఎక్స్ కనెక్ట్, గ్లైడ్ త్రూ టెక్నాలజీ, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ మరియు సింగిల్-ఛానల్ ఏబిఎస్ వంటి అధునాత సాంకేతిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ముందు వైపు 270 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 240 మిమీ డిస్క్ బ్రేక్‌లను ఉపయోగించారు.

MOST READ:బుల్లెట్ ప్రూఫ్ కార్లకు రూ. 6.75 కోట్లు మంజూరు చేసిన జగన్ సర్కార్.. ఈ కార్లు వారికి మాత్రమే

కొత్త రైడ్ మోడ్స్‌తో 2021 టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి విడుదల: ధర, ఫీచర్లు

ఇంజన్ విషయానికి వస్తే, టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి బైక్‌లో 197.75సిసి, సింగిల్ సిలిండర్, 4-వాల్వ్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 20.2 బిహెచ్‌పి పవర్‌ను మరియు 16.8 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

English summary
TVS Apache RTR 200 4V Launched With New Ride Mode; Price And Other Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X