పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

భారత ఆటోమొబైల్ కంపెనీలకు గడచిన దీపావళి పండుగ సీజన్ అంతగా కలిసొచ్చినట్లు లేదు. దాదాపుగా అన్ని ఆటోమొబైల్ కంపెనీలు గత నెలలో ప్రతికూల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా, చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company)నవంబర్ 2021 నెలలో ద్విచక్ర వాహన విక్రయాల గణాంకాలను విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, కంపెనీ గత నెలలో మొత్తం 2,57,863 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

అయితే, ఇవి గడచిన నవంబర్ 2020 నెలలో విక్రయించిన 3,11,519 యూనిట్లతో పోలిస్తే, 17 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఈ మొత్తం విక్రయంలో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు రెండూ కలిసి ఉన్నాయి. నవంబర్ 2021 లో, కంపెనీ దేశీయ అమ్మకాలను గమనిస్తే, అవి 1,75,940 యూనిట్లుగా నమోదయ్యాయి. కాగా, నవంబర్ 2020 నెలలో ఇవే దేశీయ అమ్మకాలు 2,47,789 యూనిట్లుగా నమోదయ్యాయి.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

టీవీఎస్ స్కూటర్ అమ్మకాల విషయానికి వస్తే, నవంబర్ 2020 నెలలో కంపెనీ మొత్తం 1,06,196 స్కూటర్లను విక్రయించగా, గత నెలలో (నవంబర్ 2021 లో) 75,022 స్కూటర్లను మాత్రమే విక్రయించింది. గత నెలలో స్కూటర్ విక్రయాలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇక మొత్తం ఎగుమతుల విషయానికి వస్తే, టీవీఎస్ నవంబర్ 2020లో మొత్తం 74,074 యూనిట్లను ఎగుమతి చేయగా, నవంబర్ 2021 నెలలో 96,000 యూనిట్లను ఎగుమతి 30 శాతం వృద్ధిని నమోదు చేసింది.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

చెన్నై కేంద్రంగా వ్యాపారం సాగిస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ రాబోయే నాలుగేళ్లలో తమిళనాడులో ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలు మరియు ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం సుమారు రూ. 1,200 కోట్ల పెట్టుబడిని వెచ్చించనున్నట్లు ప్రకటించింది. కంపెనీ ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఓ ఒప్పందాన్ని కూడా కుదుర్చుకుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ పెట్టుబడిని ప్రధానంగా డిజైన్, డెవలప్‌మెంట్, కొత్త ఉత్పత్తుల తయారీ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో సామర్థ్య విస్తరణ కోసం కేటాయించనున్నట్లు తెలిపింది.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

కొత్త 2022 Apache RTR 200 4V విడుదల..

ఇదిలా ఉంటే, టీవీఎస్ మోటార్ కంపెనీ తాజాగా భారత మార్కెట్లో తమ సరికొత్త 2022 అపాచీ ఆర్‌టిఆర్ 200 4వి (2022 Apache RTR 200 4V) మోటార్‌సైకిల్ ను విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త అపాచే ప్రారంభ ధర రూ. 1.33 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది. వీటిలో మొదటిది సింగిల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ మరియు రెండవది డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్. వీటి ధరలు ఇలా ఉన్నాయి:

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

కొత్తగా వచ్చిన ఈ 2022 మోడల్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 200 4వి మోటార్‌సైకిల్ కంపెనీ పలు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. ఇందులో ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ తో కూడిన కొత్త హెడ్‌ల్యాంప్ మరియు స్టైలిష్ బాడీ గ్రాఫిక్స్ ఉంటాయి. ఇందులో ఇప్పుడు కొత్తగా స్పోర్ట్, అర్బన్ మరియు రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ను పరిచయం చేశారు. కస్టమర్ ఎంచుకునే రైడింగ్ మోడ్ ని బట్టి బైక్ యొక్క ఇంజన్ పనితీరు మారుతూ ఉంటుంది.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

మెకానికల్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు ప్రీలోడ్-అడ్జస్టబుల్ షోవా ఫ్రంట్ సస్పెన్షన్, షోవా రియర్ మోనో-షాక్ సస్పెన్షన్, టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ బ్లూటూత్ కనెక్టివిటీ మరియు అడ్జస్టబుల్ బ్రేక్ మరియు క్లచ్ లివర్ మొదలైన అంశాలు ఉన్నాయి. ఇంజన్ పరంగా మాత్రం ఇందులో ఎలాంటి మార్పు చేయలేదు. ఈ బైక్ లోని అధునాతన 197.75 సిసి, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, 4 వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.82 పిఎస్ పవర్ ను మరియు 7,800 ఆర్‌పిఎమ్ వద్ద 17.25 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం రూ. 1,000 కోట్లు పెట్టుబడి..

టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న సంప్రదాయ వాహనాలతో పాటుగా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ధి కోసం కూడా సుమారు రూ. 1,000 కోట్లు పెట్టుబడిని వెచ్చించింది. రాబోయే కొద్ది నెలల్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క అప్‌గ్రేడ్ మోడల్‌ ను కూడా ప్రవేశపెట్టాలని కంపెనీ యోచిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న టీవీఎస్ ఐక్యూబ్ 4.4 kW లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 75 కిమీ రేంజ్ ని అందిస్తుంది.

పేలని దీపావళి ఆఫర్ బాంబులు.. నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ మోటార్ అమ్మకాలు..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది మరియు కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

Most Read Articles

English summary
Tvs bike sales november 257863 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X