2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ఇప్పుడు కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

ప్రముఖ ద్విచక్ర వాహనతయారీదారు 'టీవీఎస్ మోటార్' కంపెనీ దేశంలో ఇప్పుడు స్టార్ సిటీ ప్లస్ మోటార్‌సైకిల్‌ను కొత్త కలర్ స్కీమ్ తో ప్రారంభించింది. ఈ మోటారుసైకిల్‌ కొత్త బ్లూ అండ్ సిల్వర్ డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్‌తో అందుబాటులో ఉంది. హోలీ పండుగ సందర్భంగా కంపెనీ తన స్టార్ సిటీ ప్లస్ ను కొత్త కలర్ స్కీమ్ తో ప్రవేశపెట్టింది.

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ డిస్క్ మరియు డ్రమ్ అనే రెండు వేరియంట్లలో అందించబడుతుంది. ఈ రెండు వేరియంట్లు కొత్త పెయింట్ స్కీమ్ తో అందుబాటులోకి వచ్చాయి. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ ప్రారంభ ధర రూ. 65,865 కాగా, ఇందులోని టాప్-స్పెక్ ‘డిస్క్' వేరియంట్‌ ధర రూ. 68,465 (ఎక్స్-షోరూమ్,ఢిల్లీ) వరకు ఉంది.

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

టీవీఎస్ యొక్క స్టార్ సిటీ ప్లస్ ఈ కొత్త కలర్ లో మాత్రమే కాకుండా, ఇతర కలర్ స్కీమ్ లలో కూడా లభిస్తుంది. ఇందులో ఉన్న ‘డిస్క్' వేరియంట్‌ను బ్లాక్ రెడ్ పెయింట్ స్కీమ్‌లో అందిస్తున్నారు. మరోవైపు, ‘డ్రమ్' వేరియంట్‌ను బ్లాక్ / బ్లూ, గ్రే / బ్లాక్, రెడ్ / బ్లాక్ మరియు వైట్ / బ్లాక్ కలర్ స్కీమ్‌లలో అందిస్తున్నారు.

MOST READ:యజమానిని రక్షించడానికి రోడ్డుపై వాహనాన్ని ఆపిన కుక్క.. ఇదేంటనుకుంటున్నారా వీడియో చూడండి

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

టీవీఎస్ కంపెనీ ఇటీవలే మోటారుసైకిల్ యొక్క డిస్క్ వేరియంట్‌తో పాటు ఇతర మార్పులను ప్రవేశపెట్టింది. ఇందులో కొత్త రోటో పెటల్ డిస్క్ బ్రేక్‌లు, (ఇటి-ఫై) ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఇంజన్, యుఎస్‌బి ఛార్జింగ్ సాకెట్ మరియు ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్ ఉన్నాయి.

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

ఈ కొత్త ప్యాసింజెర్ మోటార్‌సైకిల్ సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ 109 సిసి ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 7350 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8.08 బిహెచ్‌పి మరియు 4500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్‌ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 4 స్పీడ్ స్టాండర్డ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

MOST READ:కొత్త లగ్జరీ కార్ కొన్న డార్లింగ్ ప్రభాస్; దీని ధర ఎన్ని కొట్లో తెలుసా?

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

ఇది బిఎస్ 4 కంటే 15 శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఉన్న ఫ్యూయెల్ ఇంజెక్షన్ కారణంగా, ఇంజిన్‌పై ఇంధనం సున్నితంగా ఉంటుంది. అన్ని వాతావరణ పరిస్థితులలోనూ ఇంజిన్ను ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

ఈ బైక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇందులో సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, 10-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో సింగిల్-పీస్ సీట్ మరియు సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డిజిటల్ స్క్రీన్ ఫ్యూయెల్ లెవల్ ఇండికేటర్, ఓడో మీటర్ వంటివి ఉన్నాయి.

MOST READ:ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయనున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ; పూర్తి వివరాలు

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

మోటారుసైకిల్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో స్టాండర్డ్ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు 5 టైప్స్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్ ఉన్నాయి. అంతే కాకుండా స్టార్ సిటీ ప్లస్ యొక్క స్టాండర్డ్ వేరియంట్లో ఇరువైపులా డ్రమ్ బ్రేక్‌లతో అందిస్తున్నారు.

2021 టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ కొత్త కలర్‌లో.. అదే ఫీచర్స్.. అదే పర్ఫెమెన్స్

టీవీఎస్ కంపెనీ యొక్క ప్రజాదరణపొందిన బైకులలో స్టార్ సిటీ ప్లస్ ఒకటి. కంపెనీ ఈ బైక్ ని హొలీ పండుగ సందర్భంగా కొత్త కలర్ స్కీమ్ తో అందించడం వల్ల మరింత ఎక్కువ అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ఈ కలర్ మాత్రమే కాకుండా వాహనదారుడు ఇందులో అందుబాటులో ఉన్న ఇతర కలర్ స్కీమ్స్ కూడా ఎంచుకోవచ్చు.

MOST READ:కార్ విండ్‌స్క్రీన్‌ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Most Read Articles

English summary
TVS Star City+ Launched In New Dual-Tone Colour Scheme Celebrating Holi Festival. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X