అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

చెన్నైకి చెందిన టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ గతేడాది జనవరి నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'టీవీఎస్ ఐక్యూబ్', అమ్మకాల పరంగా ఓ కొత్త మైలురాయిని చేరుకున్నట్లు ప్రకటించింది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

భారత మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకూ దీని అమ్మకాలు 1000 యూనిట్లను దాటినట్లు కంపెనీ ప్రకటించింది. గడచిన మార్చి నెలలోనే ఈ స్కూటర్ అమ్మకాలు 355 యూనిట్లుగా నమోదయ్యాయని కంపెనీ వివరించింది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

ప్రస్తుతం టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం బెంగుళూరు మరియు ఢిల్లీ మార్కెట్లలో మాత్రమే అమ్ముడవుతోంది. కాగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను దేశంలోని మరిన్ని ఇతర మార్కెట్లలో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఢిల్లీ మార్కెట్లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆన్-రోడ్ ధర రూ.1.08 లక్షలుగా ఉంది.

MOST READ:రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేసే కస్టమర్లు ఫేమ్ 2 పథకం క్రింద ఎలక్ట్రిక్ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చు. ఈ స్కూటర్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు ఆన్‌లైన్‌లో కానీ లేదా డీలర్‌షిప్‌లలో కానీ రూ.5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

ఇటీవలి కాలంలో భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల డిమాండ్ గణనీయంగా పెరగడంతో టీవీఎస్ ఐక్యూబ్ అమ్మకాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్, ఈ విభాగంలో బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు ఏథర్ 450ఎక్స్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇందులో అమర్చిన 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లతో ఈ ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. ఈ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. పూర్తి ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ కనెక్ట్ టెక్నాలజీతో లభిస్తుంది. దీని సాయంతో స్కూటర్‌కు సంబంధించిన అనేక విషయాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోవటం మరియు కంట్రోల్ చేయటం చేయవచ్చు.

అమ్మకాల్లో కొత్త మైలురాయిని చేరుకున్న టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్!

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడీ టెయిల్ లైట్లు, పెద్ద టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

Most Read Articles

English summary
TVS iQube Electric Scooter Sales Crossed 1,000 Units Milestone. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X