మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరాయంగా పెరిగిపోతుండటంతో కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు. దీంతో, మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ కూడా జోరందుకుంటోంది. ఈ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

తాజాగా, చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ అందిస్తున్న తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఐక్యూబ్'ను మరిన్ని నగరాల్లో విక్రయించేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. వచ్చే మార్చి 2022 నాటికి దేశంలో 1,000 టీవీఎస్ ఐక్యూబ్‌ డీలర్‌షిప్‌లను ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

ఇందుకోసం కంపెనీ సుమారు రూ.1,000 కోట్ల రూపాయల నిధులను కూడా వెచ్చించనుంది. ఈ నిధులతో నెట్‌వర్క్ విస్తరణతో పాటుగా తమిళనాడులోని హోసూర్ వద్ద కంపెనీ ఓ ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్లాంట్‌లో బిఎమ్‌డబ్ల్యూ మరియు టీవీఎస్ ద్విచక్ర వాహనాలు ఉత్పత్తి చేయనున్నారు.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

టీవీఎస్ సంస్థ నుండి రాబోయే ఈ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కర్మాగారం సంవత్సరానికి లక్ష యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని సమాచారం. టీవీఎస్ కేవలం ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌తోనే ఆగిపోకుండా, భవిష్యత్తులో మరిన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తోంది.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఇది బెంగుళూరు మరియు ఢిల్లీ నగరాల్లో మాత్రమే లభ్యమవుతోంది. ఇటీవల ఫేమ్ II సబ్సిడీ సవరణల కారణంగా, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర కూడా భారీగా తగ్గింది. ప్రస్తుతం, ఢిల్లీలో టీవీఎస్ ఐక్యూబ్ ధర రూ.1.01 లక్షలుగా ఉంటే, బెంగుళూరులో రూ.1.10 లక్షలు (రెండు ధరలు ఆయా నగరాల్లో ఆన్-రోడ్ ధరలు)గా ఉన్నాయి.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.4 కిలోవాట్ల హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్‌లో అమర్చిన 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ల సాయంతో ఈ ఎలక్ట్రిక్ మోటార్ పనిచేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. పూర్తి చార్జ్‌పై ఈ స్కూటర్ 80 కిలోమీటర్ల రేంజ్‌ను (ఎకో మోడ్‌లో) ఆఫర్ చేస్తుంది.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 0-40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే ఇందులోని బ్యాటరీలను 0 నుండి 75 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. వీటిని పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయటానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.

మార్చి 2022 నాటికి 1000 డీలర్‌షిప్‌ల ద్వారా టీవీఎస్ ఐక్యూబ్ సేల్స్!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టైయిల్ లైట్స్, పెద్ద టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, క్యూ-పార్క్ అసిస్ట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను జత చేయడానికి బ్రాండ్ యొక్క స్మార్ట్ కనెక్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
TVS To Open 1000 Dealers By March 2022 For Its iQube Electric Scooter. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X