TVS కంపెనీ కొత్త మోడల్ Jupiter 125: రివ్యూ వీడియో

భారత మార్కెట్లో పరిచయం అవసరంలేని టూ వీలర్ బ్రాండ్ TVS యొక్క 'Jupiter'. ఎందుకంటే అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్లలో Jupiter ఒకటి. అంతే కాకూండా దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడయ్యే రెండవ స్కూటర్ కూడా ఈ 'Jupiter' అనటంలో అతిశయోక్తి లేదు. ఈ Jupiter స్కూటర్ 110 సిసి స్కూటర్ విభాగంలో TVS యొక్క ముఖ్యమైన మోడల్.

TVS Motor (టీవీఎస్ మోటార్) కంపెనీ దేశీయ మార్కెట్లో కొత్త Jupiter 125 స్కూటర్ విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125 ధర రూ. 73,400. ఈ కొత్త స్కూటర్ యొక్క ఫీచర్స్ ఏంటి, దాని ఇంజిన్ స్పెసిఫికేషన్స్ ఏంటి అనే మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి మేము ఈ కొత్త Jupiter 125 సిసి స్కూటర్ రైడ్ చేసాము. దీనికి సంబందించిన మరింత సమాచారం కోసం ఈ కింది వీడియోను చూడండి.

కొత్త TVS Jupiter 125 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి డ్రమ్, డ్రమ్ అల్లాయ్ మరియు డిస్క్ వేరియంట్లు. ఈ కొత్త స్కూటర్ 125 సిసి ఇంజిన్, మొబైల్ ఛార్జర్, 33-లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ కెపాసిటీ, TVS IntelliGo టెక్నాలజీ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంది.

ఈ స్కూటర్ ముందు భాగంలో మొబైల్ ఛార్జర్ మరియు ఫ్యూయెల్ ఫిల్లర్ వంటివి ఉన్నాయి. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్ కి సైడ్ స్టాండ్ ఇండికేటర్ మరియు ఇంజిన్ ఇన్హిబిటర్ ఇవ్వబడింది. దీనితో పాటు, ముందు మంచి లెగ్ స్పేస్ ఇవ్వబడింది.

Jupiter 125 స్కూటర్ లోని ఇన్స్ట్రుమెంటేషన్ డిజిటల్-అనలాగ్ క్లస్టర్ ద్వారా నిర్వహించబడుతుంది. స్క్రీన్ ఎడమ వైపున స్పీడోమీటర్, కుడి వైపు ఎల్‌సిడి స్క్రీన్ ఉంటుంది. ఇందులో ఎల్‌సిడి ఓడోమీటర్, ట్రిప్ మీటర్లు, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ, ఇన్స్టంట్ ఫ్యూయెల్ కెపాసిటీ మరియు డిస్టెన్స్ టు ఎంప్టీ వంటి సమాచారం వీటి ద్వారా పొందవచ్చు.

కొత్త Jupiter 125 రివ్యూ వీడియో

TVS Jupiter 125 స్కూటర్ కొత్త కొత్త 125 సీసీ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 8.1 బిహెచ్‌పి పవర్ అందిస్తుంది. ఇది దాని Ntorq కన్నా 1.1 బిహెచ్‌పి తక్కువ. అయితే 10.5 ఎన్ఎమ్ టార్క్ మాత్రం ఒకేలా ఉంటుంది.

TVS Jupiter 125 అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ మరియు బ్రేకింగ్ సెటప్ కలిగి ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటూ, మంచి సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. TVS Jupiter 125 గురించి మరింత్ సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tvs jupiter 125 review video segment first features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X