పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్, ఇటీవల తమ అన్ని ద్విచక్ర వాహనాల ధరలను పెంచింది. వీటిలో కంపెనీ అందిస్తున్న పాపులర్ 110 సిసి స్కూటర్ 'టీవీఎస్ జూపిటర్' ధరలు కూడా భారీగా పెరిగాయి. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి ఈ స్కూటర్ ధరలు రూ.736 నుండి రూ.2,336 మధ్య పెరిగాయి.

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

ధర పెంపు అనంతరం టీవీఎస్ జూపిటర్ షీట్ మెటల్ వీల్ వేరియంట్ కొత్త ధర రూ.65,673 లు కాగా, స్టాండర్డ్ మోడల్ ధర రూ.67,398 గా ఉంది. అలాగే, ఇందులో టీవీఎస్ జెడ్ఎక్స్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.71,973 గా ఉంటే, జెడ్ఎక్స్ డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర.75,773 గా ఉంది. ఇకపోతే, టీవీఎస్ జూపిటర్ క్లాసిక్ మోడల్ ధర రూ.75,743 లకి చేరుకుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

జూపిటర్ ఇంజన్

టీవీఎస్ జూపిటర్ 110సిసి స్కూట‌ర్‌లో 109.7సిసి ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 7.37 బిహెచ్‌పి పవర్‌ను మరియు 8.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్‌లో ఎకోథ్రస్ట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ (ఈటి-ఎఫ్ఐ) టెక్నాలజీని ఉపయోగించారు. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, దీని వలన మైలేజ్ 15 శాతం మెరుగుపడుతుంది.

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

జూపిటర్ ఫీచర్లు

టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇది స్టీల్ మరియు అల్లాయ్ వీల్స్ ఆప్షన్లతో, 12 ఇంచ్ టైర్లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు డ్రమ్ మరియు డిస్క్ బ్రేక్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

ఈ స్కూటర్‌లో 6-లీటర్ల ఇంధన ట్యాంక్ ఉంటుంది. దీని మొత్తం బరువు 107 కిలోలుగా ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఫ్రంట్ యుటిలిటీ బాక్స్ మరియు మొబైల్ ఛార్జర్ ఆప్షన్‌ను కూడా జోడించారు. ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఎంపిక చేసిన వేరియంట్‌లలో లభిస్తాయి.

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

జూపిటర్‌లో 21-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్ మరియు బయటివైపు నుండి ఫ్యూయెల్ ఫిల్లింగ్ చేసుకునే సౌరర్యం ఉంటుంది. టీవీఎస్ జూపిటర్ జెడ్ఎక్స్ డిస్క్ వేరియంట్ రైడర్‌కు సౌకర్యవంతమైన మరియు పర్యావరణ అనుకూల రైడ్ అనుభవాన్ని అందించడానికి టీవీఎస్ ఇంటెలిగో టెక్నాలజీతో లభిస్తుంది.

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

ఈ టెక్నాలజీ వలన స్కూటర్‌ను ఎక్కువసేపు ఐడిల్‌గా ఉంచినట్లయితే, అది ఆటోమేటిక్‌గా ఇంజన్‌ను ఆపు చేసి, ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ఫలితంగా మైలేజ్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా, కర్భన ఉద్గారాలను కూడా తగ్గిస్తుంది. టీవీఎస్ జూపిటర్ ఈ విభాగంలో హోండా యాక్టివా 6జి మరియు హీరో మాస్ట్రో ఎడ్జ్ 110 వంటి స్కూటర్లకు పోటీగా నిలుస్తుంది.

పెరిగిన టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ధరలు

టీవీఎస్ అపాచీ సిరీస్ ధర కూడా పెరిగింది

టీవీఎస్ ఇటీవల తమ అపాచీ సిరీస్ బైక్‌ల ధరలను కూడా పెంచింది. కంపెనీ ఈ శ్రేణి బైకుల ధరను రూ.3,000 నుండి రూ.5,000 మేర పెంచింది. టీవీఎస్ అపాచీ సిరీస్‌లో ఎంట్రీ లెవల్ బైక్ అయిన అపాచీ ఆర్‌టిఆర్ 160 ధర ఇప్పుడు రూ.3,000 మేర పెరిగి రూ.1,06,365 (ఎక్స్-షోరూమ్) కి చేరుకుంది. ఇదే సమయంలో, ఈ సిరీస్‌లో అత్యంత శక్తివంతమైన బైక్ అయిన అపాచీ ఆర్ఆర్ 310 ధర రూ.5,000 పెరిగి రూ.2,54,990 (ఎక్స్-షోరూమ్) కి చేరుకుంది.

Most Read Articles

English summary
Tvs jupiter price increased new price list details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X