పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

ఈ ఏడాది ఆరంభంలో కరోనా కారణంగా ముడిసరుకుల ధరలు పెరిగాయని చెప్పి వాహనాల ధరలు పెంచిన ఆటోమొబైల్ కంపెనీలు, ఇప్పుడు మరోసారి అదే కారణం చెప్పి ధరలను పెంచేందుకు రెడీ అవుతున్నాయి.

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి కంపెనీలు ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 2021) నుండి ధరలు పెరుగుతాయని ప్రకటించగా, తాజాగా టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఇదే కోవలో తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ స్కూటర్ లైనప్‌లో ఆఫర్ చేస్తున్న జూపిటర్, స్కూటీ పెప్ ప్లస్, జెస్ట్ మరియు ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు తెలిపింది. కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్‌ను బట్టి ఈ స్కూటర్ల ధరలు రూ.540 నుండి రూ.2,535 మధ్యలో పెరిగాయి.

MOST READ:మీ పాత వాహనాలను ఇలా చేసి, రెనో కార్లపై భారీ తగ్గింపును పొందండి

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

టీవీఎస్ నుండి లభిస్తున్న చౌకైన స్కూటర్ స్కూటీ పెప్ ప్లస్ ధరను గరిష్టంగా రూ.2,535 మేర పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ స్కూటర్ ప్రారంభ ధర రూ.56,009 లుగా ఉండగా, స్కూటీ పెప్ ప్లస్ మ్యాట్ ఎడిషన్ ధర రూ.58,759 గా ఉంటుంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110 గ్లోస్, జెస్ట్ మ్యాట్ ఎడిషన్ ధరలను రూ.1,635 మేర పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత జెస్ట్ 110 గ్లోస్ రూ.62,980 మరియు జెస్ట్ 110 మ్యాట్ ధర రూ.64,980 గా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

టీవీఎస్ నుండి లభిస్తున్న పాపులర్ స్కూటర్ జూపిటర్‌లో వివిధ వేరియంట్ల ధరలను రూ.940 నుండి రూ.1,390 మధ్యలో పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత కొత్త టీవీఎస్ జూపిటర్ ప్రారంభ ధర రూ.64,437 గా ఉండగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ జూపిటర్ క్లాసిక్ ధర రూ.73,707 గా ఉంది (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

టీవీఎస్ అందిస్తున్న స్పోర్టీ స్కూటర్ ఎన్‌టార్క్ 125 విషయానికి వస్తే ఈ స్కూటర్ ధరను రూ.540 నుంచి రూ.1,540 మధ్యలో పెంచారు. తాజా ధరల పెంపు తర్వాత టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రారంభ ధర రూ.71,095 (ఎక్స్-షోరూమ్) కాగా, ఎన్‌టోర్క్ 125 టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.81,075 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

ఇదిలా ఉంటే హోలీ సందర్భంగా టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బిఎస్6 మోడల్‌లో కంపెనీ ఓ కొత్త డ్యూయల్ టోన్ కలర్ వేరియంట్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ వేరియంట్ ధరను రూ.65,865 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

గడచిన మార్చి నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం 3,07,437 యూనిట్ల వాహనాలను విక్రయించిందని. మార్చి 2020లో కంపెనీ 1,33,988 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు 130 శాతం వృద్ధి చెందాయి. మోటార్‌సైకిల్ విభాగంలో 136 శాతం, స్కూటర్ విభాగంలో 206 శాతం పెరుగుదల నమోదైంది.

MOST READ:స్టైలిష్ స్టార్ బర్త్ డే స్పెషల్; అల్లు అర్జున్ స్పెషల్ లగ్జరీ కార్స్, ఎలా ఉన్నాయో చూసారా..!

పెరిగిన టీవీఎస్ జూపిటర్, జెస్ట్, స్కూటీ పెప్, ఎన్‌టార్క్ 125 స్కూటర్ల ధరలు

ఇదిలా ఉంటే, టీవీఎస్ అందిస్తున్న అపాచీ ఆర్ఆర్ 310 మోడల్‌ను కంపెనీ త్వరలో కొత్త అవతార్‌లో విడుదల చేయవచ్చని సమాచారం. టీవీఎస్ నుండి రానున్న ఈ కొత్త 300 సిసి బైక్ ఇప్పుడు సరికొత్త ఫీచర్లు మరియు మెరుగైన పనితీరుతో రానుంది. ఇందుకు సంబంధించి కంపెనీ ఇటీవల ఓ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

Most Read Articles

English summary
TVS Jupiter, Zest, Scooty Pep Plus, Ntorq 125 Prices Increased. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X