పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను పూణేలో విడుదల చేసింది. పూణేలో విడుదలైన ఈ టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.10 లక్షలు (ఆన్-రోడ్). ఈ స్కూటర్ కోసం కస్టమర్లు ఆన్‌లైన్‌లో బ్రాండ్ వెబ్‌సైట్‌లో 5 వేలరూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

కంపెనీ ఈ స్కూటర్ కొనుగోలుపై ఆకర్షణీయమైన ఫైనాన్స్ స్కీమ్స్ కూడా అందిస్తోంది. దీని ప్రకారం మొదట కేవలం రూ. 25 వేల చెల్లించి నెలకు 2,468 రూపాయల ఈఎమ్ఐ కింద 48 నెలల సమయంలో పూర్తిగా చెల్లించవచ్చు.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 4.4 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో పాటు 3 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఒకే ఛార్జ్ (ఎకో మోడ్) పై గరిష్టంగా 75 కి.మీ పరిధిని అందిస్తుంది. దీని అగ్ర వేగం గంటకు 80 కి.మీ వరకు ఉంటుంది. ఈ ఐక్యూబ్ కేవలం 4.2 సెకన్లలో గంటకు 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని కేవలం నాలుగు గంటల్లో 0 నుంచి 75 వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ స్కూటర్ ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉండటమే కాకూండా వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్మార్ట్ కనెక్ట్ ప్లాట్‌ఫాం, అడ్వాన్స్‌డ్ టిఎఫ్‌టి క్లస్టర్ మరియు టివిఎస్ ఐక్యూబ్ యాప్ కలిగి ఉంటుంది. ఈ యాప్ లో జియో-ఫెన్సింగ్, రిమోట్ బ్యాటరీ ఛార్జ్ స్టేటస్, నావిగేషన్ అసిస్ట్, లాస్ట్ పార్క్ ప్లేస్, కాల్, ఎస్ఎమ్ఎస్ వార్ణింగ్ వంటి ఫీచర్స్ ఉన్నాయి.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ క్యూ-పార్క్ అసిస్ట్, మల్టీ-సెలెక్ట్ ఎకానమీ అండ్ పవర్ మోడ్, డే అండ్ నైట్ డిస్ప్లేస్ రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ స్కూటర్ లో ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆల్-ఎల్ఈడీ టెయిల్ లాంప్స్ మరియు ప్రకాశవంతమైన లోగో వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం బెంగళూరు, పూణే, చెన్నై, కోయంబత్తూర్ మరియు ఢిల్లీ వంటి నగరాల్లో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలను దేశవ్యాప్తంగా 20 నగరాలకు విస్తరించడానికి సన్నద్ధమవుతోంది. వీటిలో ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు ఇతర నగరాలు ఉన్నాయి.

పూణేలో విడుదలైన టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌; వివరాలు

ఈ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు పూణేతో సహా ఐదు నగరాల్లో అందుబాటులో ఉంది. టీవీఎస్ తన ఐక్యూబ్ స్కూటర్ ధరను ఫేమ్ 2 సబ్సిడీ ద్వారా తగ్గించడం కూడా జరిగింది. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో ఏథర్ 450 ఎక్స్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ మరియు ఒకినావా స్కూటర్లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tvs Iqube Electric Scooter Launched In Pune. Read in Telugu.
Story first published: Thursday, July 1, 2021, 18:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X