అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్ మరియు స్కూటర్ తయారీ కంపెనీలలో TVS Motor (టీవీఎస్ మోటార్) కంపెనీ ఒకటి. టీవీఎస్ కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ స్కూటర్స్ భారతీయ మార్కెట్లో ఎక్కువ ప్రజాదరణ పొందటంలో విజయం సాధిస్తున్నాయి. ఇందులో భాగంగానే TVS Motor కంపెనీ ఈ స్కూటర్ శ్రేణిలో రెండు స్కూటర్లను ప్రవేశపెట్టింది. ఇందులో ఒకటి TVS Scooty Pep Plus (టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్) కాగా మరొకటి TVS Scooty Zest 110 టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS కంపెనీ యొక్క ఈ రెండు మోడల్స్ కూడా దేశీయ విఫణిలో ఎంతో ఆదరణ పొందుతున్నాయి. ఈ కారణంగానే ఇప్పుడు టీవీఎస్ మోటార్ కంపెనీ తన టీవీఎస్ స్కూటీ శ్రేణిలో 50 లక్షల యూనిట్ల విక్రయాన్ని పూర్తి చేసినట్లు అధికారికంగా తెలియజేసింది. ఇది నిజంగా హర్షించదగ్గ విషయం.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

భారతీయ మార్కెట్లో ఏకంగా మూడు దశాబ్దాలకు పైగా టీవీఎస్ స్కూటీ శ్రేణి భారతదేశంలో మహిళలకు మంచి ఎంపికగా నిలిచింది. ఎక్కువ మహిళా రైడర్స్ వినియోగించే స్కూటీలలో ఈ TVS శ్రేణి ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికి కూడా మహిళల యొక్క మొదటి ఆప్సన్ ఈ TVS రేంజ్ స్కూటర్లు.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS స్కూటీ శ్రేణి భారతీయ మార్కెట్లో ప్రారంభించినప్పటి నుంచి కూడా మహిళల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడంలో చాలా సహాయపడుతుంది. కావున ఎక్కువగా మార్కెట్లో అమ్మకాలను జరపడంలో విజయం సాధిస్తున్నాయి. టీవీఎస్ కంపెనీ యొక్క ఈ స్కూటీలు మహిళా రైడర్స్ కి చాలా అనుకూలంగా ఉంటాయి.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS Motor కంపెనీ తన TVS Scooty Pep Plus స్కూటీని రెండు వేరియంట్లలో విక్రయిస్తుందో. ఇందులో ఒకటి టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ గ్లోసీ వేరియంట్‌ కాగా మరొకటి స్కూటీ పెప్ ప్లస్ మ్యాట్ ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ. 52,915 (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 54,735 (ఎక్స్-షోరూమ్).

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS Scooty Pep Plus మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది, ఇందులో ఆప్రాన్-మౌంటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్, హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు ఈజీ-సెంటర్ స్టాండ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది దేశీయ మార్కెట్లో ఏకంగా 7 కలర్ అప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి నీరో బ్లూ, ఫ్రాస్టెడ్ బ్లాక్, ప్రిన్సెస్ పింక్, రెవివింగ్ రెడ్, గ్లిట్టరింగ్ గోల్డ్, ఆక్వా మ్యాట్ మరియు కోరల్ మ్యాట్ కలర్స్.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS స్కూటీ పెప్ ప్లస్‌ అద్భుతమైన ఇంజిన్ కలిగి ఉంటుంది. దీనికోసం కంపెనీ ఇందులో 87.8 సిసి ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌ అమర్చింది. ఇది బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 5.43 బిహెచ్‌పి పవర్ మరియు 3,500 ఆర్‌పిఎమ్ వద్ద 6.5 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

ఇక TVS కంపెనీ యొక్క ప్రజాదరణ పొందిన మరొక స్కూటీ 'టీవీఎస్ స్కూటీ జెస్ట్ 110'. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ స్కూటర్‌ కూడా రెండు వేరియంట్లలో విక్రయించబడుతుంది. అవి స్కూటీ జెస్ట్ 110 యొక్క మ్యాట్ సిరీస్ మరియు జెస్ట్ 110 గ్లోసీ సిరీస్. వీటి ధరలు వరుసగా రూ. 65,366 (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 66,627 (ఎక్స్-షోరూమ్).

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS Scooty Zest 110 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. అంతే కాకుండా ఇది మంచి డిజైన్ పొందుతుంది. ఈ స్కూటీలో 3డి లోగో, లేత గోధుమరంగు ఇంటీరియర్ ప్యానెల్, డ్యూయల్ టోన్ సీట్, ఎల్‌ఇడి డిఆర్‌ఎల్ మరియు అండర్ సీట్ స్టోరేజ్ లైట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతే కాకుండా ఇది అప్రాన్-మౌంటెడ్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ వంటి వాటితో పాటు 19-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ మరియు డ్యూయల్ లగేజ్ హుక్స్‌ను కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

TVS Scooty Zest 110 కూడా మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇందులో ఎకో-థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీ కలిగిన మరియు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఉండే 110 సిసి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 7.81 బిహెచ్‌పి పవర్ మరియు 8.8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది.

అమ్మకాల్లో TVS Scooty Pep Plus విజయ దుందుభి: ఏకంగా 5 మిలియన్ క్రాస్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఈ రెండు స్కూటర్లు అత్యంత ఆదరణ పొందటానికి ప్రధాన కారణం, దాని ఫీచర్స్ మరియు మహిళలను ఆకర్శించే వాటి డిజైన్. అంతే కాకుండా ఇవి మంచి పనితీరుని కూడా అందిస్తాయి. కావున మార్కెట్లో ఈ రోజుకి కూడా ఎదురు లేకుండా మనగలుగుతున్నాయి. అంతే కాకుండా ఇప్పటికి 50 లక్షల యూనిట్లను విక్రయించగలిగాయి.

Most Read Articles

English summary
Tvs motor company crosses 50 lakh units milestone for scooty range details
Story first published: Wednesday, October 27, 2021, 9:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X