వారంటీ & సర్వీస్ టైమ్ పొడిగించిన టీవీఎస్.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని వాహనతయారీ సంస్థలన్నీ దాదాపుగా వాహన వినియోగదారుల సౌకర్యార్థం వారంటీ మరియు సర్వీస్ వంటి వాటిని మరింత పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ కంపెనీ కూడా వారంటీ మరియు సర్వీస్ వ్యవధిని పొడిగించింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

రోజురోజుకి కరోనా చాలా ఎక్కువగా విస్తరించడం వల్ల, కరోనా సంక్రమణను నివారించడానికి అనేక రాష్ట్రాలు కరోనా లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ కారణంగా వాహనదారులు వాహనాలకు అవసరమైన సర్వీసులను సకాలంలో పొందటానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. దీన్ని నివారించడానికి కంపెనీ వ్యవధిని పెంచుతూ ఉత్తర్వులను జారీచేసింది.

కంపెనీ అందించిన నివేదికల ప్రకారం 2021 జూన్ 30 వరకు లాక్ డౌన్ వ్యవధి కారణంగా ఉచిత సేవ మరియు వారెంటీలను పొడిగించాలని టీవీఎస్ మోటార్ డీలర్షిప్ భాగస్వాములను ఆదేశించింది. ఇది కాకుండా రెగ్యులర్ సర్వీస్ చొరవతో కంపెనీ వినియోగదారులకు మద్దతు ఇస్తోంది.

కరోనావైరస్ సంక్రమణ కారణంగా, అన్ని డీలర్‌షిప్‌లలో కూడా సురక్షితమైన సర్వీస్ అందించబడుతుందని కంపెనీ తెలియజేసింది. అన్ని టీవీఎస్ మోటార్ డీలర్‌షిప్‌లలో అధికారులు నిర్దేశించిన కరోనావైరస్ ప్రోటోకాల్‌లు అనుసరించబడతాయి. కావున వాహనదారులు ఈ సర్వీసులను నిరాఘాటంగా పొందవచ్చు.

కరోనా మహమ్మారి సమయంలో కస్టమర్లకు తగిన సౌకర్యాన్ని అందించడానికి టీవీఎస్ మోటార్ అన్నివిధాలా కృషి చేస్తుంది. తన నెట్‌వర్క్ భాగస్వాముల యొక్క బాధ్యతాయుతమైన భాగస్వామిగా, అసోసియేట్‌ల భద్రతను దృష్టిలో ఉంచుకుని వినియోగదారుల తక్షణ అవసరాలను తీర్చడానికి కంపెనీ ఈ సమయంలో కూడా సిద్ధంగా ఉంది.

దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రభుత్వాలు చేస్తున్న చర్యలకు మద్దతుగా ఆటో మొబైల్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఇందులో టీవీఎస్ మోటార్ కంపెనీ కూడా ఇందులో ఉంది. టీవీఎస్ కంపెనీ ఇటీవల రూ. 40 కోట్ల నిధులను విరాళంగా ఇవ్వడానికి ఆమోదం కూడా తెలిపింది.

భారతదేశంలో పెరుగుతున్న రోగులకు సరైన వసతులు లేదు. కావున ఆక్సిజన్ సిలిండర్లు, పిపిఇ కిట్లు, మందులు మరియు వైద్య పరికరాలు వంటి ప్రాణాలను రక్షించడానికి ఈ డబ్బు ఉపయోగించబడుతుంది. ఇందులో భాగంగా కంపెనీ తమిళనాడు, కర్ణాటక మరియు హిమాచల్ ప్రదేశ్ లలో హాస్పిటల్స్ మరియు ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ఉద్యోగులకు రోజుకు 20,000 కి పైగా భోజన ప్యాకెట్లను అందించింది.


Click it and Unblock the Notifications








