టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

చెన్నైకి చెందిన ప్రముఖ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ పాపులర్ ఎన్‌టార్క్ 125సిసి స్కూటర్‌లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ పేరిట కంపెనీ ఈ కొత్త స్కూటర్ విడుదల చేసింది. మార్కెట్లో దీని ధర రూ.83,275 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

సరికొత్త ఫీచర్లు మరియు కొత్త టెక్నాలజీతో కంపెనీ ఈ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్‌తో పాటుగా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా, కంపెనీ ఇందులో మెకానికల్ అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. ఇప్పుడు ఈ స్కూటర్ 125సిసి విభాగంలోనే 10 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేసే మొదటి స్కూటర్‌గా మారింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ సాయంతో యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కూటర్‌కు రిమోట్‌గా కనెక్ట్ కావచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ కూడా ఉంటుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ (ఆపిల్) వినియోగదారుల కోసం టీవీఎస్ కనెక్ట్ యాప్‌ను కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా నావిగేషన్ సిస్టమ్‌ను ప్రారంభించడం నుండి రైడింగ్ మోడ్‌ను మార్చడం వరకు 15 వేర్వేరు వాయిస్ కమాండ్స్‌ను ఈ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

స్కూటర్ నడుపుతున్నప్పుడు రైడర్ తన వాయిస్ కమాండ్స్ ద్వారా కొన్ని ఫీచర్లను కంట్రోల్ చేయవచ్చు. నావిగేషన్ ఫంక్షన్‌లో చిరునామాను భద్రపరిచే (అడ్రస్ సేవ్ చేసే) ఫీచర్ కూడా చేర్చబడింది. దీని వలన ఒక్కసారి వెళ్లిన అడ్రస్‌కు తిరిగి పదేపదే వెళ్లాలనుకుంటే, సేవ్ చేసుకున్న అడ్రస్ ఫీచర్ ద్వారా సులువుగా అక్కడికి వెళ్లిపోవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

రైడింగ్ మోడ్, కన్సోల్ బ్రైట్‌నెస్ మరియు డిఎన్‌డి వంటి ఫీచర్లను కూడా టీవీఎస్ అప్లికేషన్ ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఈ స్కూటర్‌లో రెండు రైడ్ మోడ్‌లు ఉన్నాయి. అవి - రేస్ మరియు స్ట్రీట్. ఈ స్కూటర్ రేస్ మోడ్‌లో స్పోర్టియర్ ఉండి, ఎక్కువ శక్తిని అందిస్తుంది, స్ట్రీట్ మోడ్‌లో స్కూటర్ యొక్క పవర్ డెలివరీ సాధారణంగా ఉంటుంది. రేస్ మోడ్‌ను హైవేపై ఎక్కువ పవర్ కోసం ఉపయోగించవచ్చు, స్ట్రీట్ మోడ్‌నను పట్టణాల్లో రోజూవారీ రైడ్ కోసం ఉపయోగించవచ్చు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్టాండర్డ్ వేరియంట్ కన్నా చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తుంది. దీనిని స్టీల్త్ విమానాల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేశారు. ఈ స్కూటర్‌లో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, రేస్ ప్రేరేపిత రంగులు మరియు గ్రాఫిక్స్ మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఈ స్కూటర్‌లోని రెడ్ కలర్ అల్లాయ్ వీల్స్ దాని స్పోర్టి రూపాన్ని మరింత పెంచడంలో సహకరిస్తాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

ఇక ఇంజన్ విషయానికి వస్తే, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్‌లో 125సిసి ఫ్యూయల్ ఇంజెక్ట్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10.8 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. స్ట్రీట్ మోడ్‌లో ఈ స్కూటర్ గరిష్టంగా గంటకు 98 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. స్ట్రీట్ మోడ్‌లో, ఈ స్కూటర్ మెరుగైన మైలేజీతో సున్నితమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

ఈ స్కూటర్‌లోని మెకానికల్ ఫీచర్లను గమనిస్తే, దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అలాగే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇందులోని సైలెన్సర్‌పై మఫ్లర్ కవర్‌ను మ్యాట్ బ్లాక్ మరియు సిల్వర్ కలర్‌లో ఫినిష్ చేశారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 'రేస్ ఎక్స్‌పి' ఎడిషన్‌ స్కూటర్ విడుదల; ధర రూ.83,275

ఈ స్కూటర్‌లోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో T-ఆకారంలో ఉండే హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్స్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఇంజన్ కిల్ స్విచ్ మరియు 5.8 లీటర్ల ఇంధన ట్యాంక్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
TVS Motor Company Launches New Ntroq 125 Race XP Edition; Price, Specs And Features. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X