లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ TVS Motor (టీవీఎస్ మోటార్) కంపెనీ భారతీయ మార్కెట్ కోసం BMW Motorrad (బీఎండబ్ల్యూ మోటరోరాడ్) మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ ఇటీవల ఈ బీఎండబ్ల్యూ మోటరోరాడ్ 310సిసి సిరీస్ మోటార్ సైకిళ్ల యొక్క 1,00,000 యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసి వాటిని ప్లాంట్ నుండి బయటకు తెచ్చినట్లు ప్రకటించింది.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

BMW Motorrad 310సిసి సిరీస్ 1,00,000 వ మోటార్‌సైకిల్‌ను TVS మోటార్ కంపెనీ డైరెక్టర్ మరియు CEO అయిన కెఎన్ రాధాకృష్ణన్ మరియు 1, 2-సిలిండర్ మరియు అర్బన్ మొబిలిటీ, బిఎమ్‌డబ్ల్యూ మోటార్‌రాడ్ ప్రొడక్ట్స్ హెడ్ రైనర్ బౌమెల్ ఈ మోటార్‌సైకిల్‌ను విడుదల చేశారు. ఈ మోటార్ సైకిల్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

TVS మోటార్ కంపెనీ మరియు BMW మోటరోరాడ్ గ్లోబల్ మార్కెట్ కోసం సబ్ -500 సీసీ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేయడానికి మరియు ఉత్పత్తి చేయడానికి సహకార ఒప్పందంపై 2013 సంవత్సరంలో సంతకం చేశాయి. ఈ భాగస్వామ్యం కొత్త ఉత్పతులకు శ్రీకారం చుట్టింది.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

కంపెనీ నుండి విడుదల చేసిన ఈ కొత్త 100,000 వ బైక్ BMW G 310 GS ఫోటో కూడా మీరు ఈ ఆర్టికల్ లో చూడవచ్చు. ఈ BMW G 310 GS విడుదల సందర్భంలో టీవీఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ & సిఇఒ కెఎన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, "ఈ రోజు బిఎమ్‌డబ్ల్యూ మోటరోరాడ్‌తో మా ప్రయాణంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని సాధించినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయం మా ఎనిమిది సంవత్సరాల భాగస్వామ్య విజయానికి బలమైన సాక్ష్యంగా చెప్పవచ్చు. గ్లోబల్ మార్కెట్ కోసం తయారు చేసిన ఉత్పత్తులను రూపొందించడానికి మా భాగస్వామ్యం నిజంగా అసాధారణమైనదిని తెలిపారు.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

BMW మోటరోరాడ్ హెడ్ మార్కస్ ష్రామ్ మాట్లాడుతూ, TVS మోటార్ కంపెనీతో మా భాగస్వామ్యం సబ్-500 సీసీ విభాగంలో ఆకట్టుకునే వాహనాలను అభివృద్ధి చేయడానికి దోహదపడింది. కంపెనీ యొక్క BMW G 310 R మరియు BMW G 310 GS సింగిల్-సిలిండర్ మోడల్స్ రెండూ కూడా ప్రారంభం నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయన్నారు.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

కంపెనీ తన 2022 వెర్షన్‌ని త్వరలో ప్రారంభించబోతోంది, అయితే ఈ కొత్త మోడల్ ప్రారంభించడానికి ముందుగానే, కంపెనీ దీనిని సెప్టెంబర్ ప్రారంభంలో బుకింగ్ చేయడం ప్రారంభించింది. కావున కస్టమర్లు దీనిని బుక్ చేసుకోవచ్చు.

కొత్త 2022 BMW G 310 కొన్ని కొత్త కాస్మెటిక్ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. ఈ అడ్వెంచర్ బైక్ ఇప్పుడు కొత్త పెయింట్ స్కీమ్‌తో లాంచ్ చేయబడుతుంది, కావున ఈ బైక్ ట్రిపుల్ బ్లాక్ కలర్‌లో ఉంటుంది. ఈ కలర్ ఆప్సన్ ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉంది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

ఈ కొత్త బైక్ లో లేటెస్ట్ పెయింట్ స్కీమ్ కాకుండా, ఇతర మార్పులు జరగలేదు. అయితే ఇది ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది, కావున రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

2022 G310 GS బైక్ లో 313 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇవ్వబడుతుంది, ఇది 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇంద్దులో డ్యూయల్-ఛానల్ ABS కూడా అందుబాటులో ఉంటుంది.

లక్ష యూనిట్ BMW 310cc మోటార్‌సైకిల్‌ విడుదల చేసిన TVS మోటార్ కంపెనీ

TVS మోటార్ కంపెనీ కస్టమర్‌ల విశ్వాసానికి ప్రతీకగా ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ 70 దేశాలలోని మా టచ్ పాయింట్‌లను కలిగి ఉంది. ఈ టచ్ పాయింట్‌లన్నింటిలోనూ అత్యున్నత కస్టమర్ అనుభవాన్ని అందించడానికి కంపెనీ కృషి చేస్తోంది. కంపెనీ అత్యుత్తమ డెమింగ్ బహుమతిని అందుకున్న ఏకైక ద్విచక్ర వాహన సంస్థ కూడా.

టీవీఎస్ మోటార్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సంస్థ, ఈ కంపెనీ దేశీయ విపణిలో ప్రారంభమైనప్పయినుంచి కూడా మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తుంది. ఇటీవల కంపెనీ టీవీఎస్ అపాచీ అప్డేటెడ్ బైక్ మరియు టీవీఎస్ జుపీటర్ కొత్త బైక్ కూడా విడుదల్ చేసింది, ఈ పండుగ సీజన్లో ఈ కొత్త వాహనాలు మంచి అమ్మకాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Tvs motor company rolls out 1 lakh bikes of bmw 310cc series details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X