Just In
- 9 hrs ago
బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 ఎస్-డ్రైవ్ 20డి రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!
- 11 hrs ago
విడుదలకు ముందే యమహా FZ-X స్పెసిఫికేషన్స్ లీక్
- 13 hrs ago
భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు
- 14 hrs ago
మిస్టర్ మస్క్.. భారత్‌లో త్వరగా టెస్లా కార్లను ఉత్పత్తి చేయండి: నితిన్ గడ్కరీ
Don't Miss
- News
వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం
- Sports
PBKS vs CSK: 'సూపర్' జడేజా! కళ్లుచెదిరే రనౌట్.. స్టన్నింగ్ క్యాచ్!వీడియోలు
- Movies
పవన్ కల్యాణ్‌కు కరోనా పాజిటివ్.. ఫ్యాన్స్‌ను రెచ్చగొట్టిన రాంగోపాల్ వర్మ.. కోవిడ్ 19 హీరో అంటూ..
- Finance
మళ్లీ బంగారం ర్యాలీ ప్రారంభమైందా? 15 రోజుల్లో 6% జంప్
- Lifestyle
Happy Ramadan 2021: ఈద్-ముబారక్ ప్రత్యేక సందేశాలను మీకిష్టమైన వారితో పంచుకోండి...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫిబ్రవరిలో టీవీఎస్ అమ్మకాల హవా.. మళ్ళీ పెరిగిన అమ్మకాలు
భారత మార్కెట్లో ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీదారు టివిఎస్ మోటార్ కంపెనీ ఇటీవల తన ఫిబ్రవరి 2021 అమ్మకాల గణాంకాలను లో విడుదల చేసింది. ద్విచక్ర వాహన విభాగంలో టీవీఎస్ కంపెనీ దాదాపు 21% వృద్ధిని సాధించింది. నివేదికల ప్రకారం ఫిబ్రవరి 2021 లో కంపెనీ 2,84,581 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు తెలిసింది.

ఇదే సమయంలో, గత ఏడాది ఫిబ్రవరి నెలలో కంపెనీ 2,35,891 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో మొత్తం 1,95,145 యూనిట్ల వాహనాలను విక్రయించి 15 శాతం వృద్ధిని సాధించింది.

గత ఏడాది ఇదే సమయంలో కంపెనీ ఫిబ్రవరిలో దేశీయ మార్కెట్లో మొత్తం 1,69,684 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కంపెనీ మోటార్‌సైకిల్ విభాగం గత నెలలో కంపెనీ 1,37,259 మోటార్‌సైకిళ్లను విక్రయించగా, 2020 ఫిబ్రవరిలో కంపెనీ మొత్తం 1,18,514 యూనిట్ల బైక్‌లను విక్రయించింది.
MOST READ:స్కూల్ బస్సులు యెల్లో కలర్లో ఉండటానికి కారణం ఏంటో తెలుసా.. అయితే ఇది చూడండి

ఈ ఏడాది కంపెనీ మోటార్‌సైకిల్ విభాగం దాదాపు 16 శాతం పెరిగింది. టీవీఎస్ స్కూటర్ విభాగం, ఫిబ్రవరి 2021 లో కంపెనీ అమ్మకాలు 56 శాతం పెరిగాయి మరియు టీవీఎస్ మొత్తం 95,525 యూనిట్ల స్కూటర్లను విక్రయించినట్లు అధికారికంగా ప్రకటించింది.

టీవీఎస్ మోటార్ కంపెనీ గత ఏడాది ఫిబ్రవరిలో 60,633 యూనిట్ల స్కూటర్లను విక్రయించింది. కంపెనీ త్రీ-వీలర్ సెగ్మెంట్ అమ్మకాలను చూస్తే, ఫిబ్రవరి 2020 తో పోలిస్తే కంపెనీ 2021 ఫిబ్రవరిలో 24.02 శాతం తక్కువ నమోదు చేసింది. గతేడాది ఫిబ్రవరిలో కంపెనీ 17,370 యూనిట్ల త్రీ వీలర్లను విక్రయించగా, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో కంపెనీ 13,166 యూనిట్ల త్రీ వీలర్లను విక్రయించింది.
MOST READ:డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ బైక్ డెలివరీ షురూ చేసిన ఆటమ్మొబైల్; వివరాలు

2020 ఫిబ్రవరిలో కంపెనీ ఎగుమతుల విషయానికి వస్తే, టివిఎస్ మొత్తం 1,01,789 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో టీవీఎస్ మోటార్ మొత్తం 82,877 యూనిట్ల వాహనాలను ఎగుమతి చేసింది. ఈ ఏడాది కంపెనీ ఎగుమతులు మునుపటికంటే 23 శాతం పెరిగాయి. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2021 ఫిబ్రవరిలో ద్విచక్ర వాహనాల ఎగుమతులు ఏకంగా 35 శాతం పెరిగాయి.

గత నెలలో కంపెనీ మొత్తం 89,436 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. కంపెనీ యొక్క ఎగుమతులు కూడా బాగా ఉన్నాయని టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది. ఫిబ్రవరి 2021 లో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం అమ్మకాల విషయానికి వస్తే, కంపెనీ గత నెలలో మొత్తం 2,97,747 యూనిట్ల వాహనాలను విక్రయించగా, గత ఏడాది ఇదే నెలలో కంపెనీ మొత్తం 2,53,261 యూనిట్ల వాహనాలను విక్రయించింది. గత ఏడాది కంపెనీ మొత్తం అమ్మకాలు 18 శాతం పెరిగాయి.
MOST READ:ట్రాఫిక్ ఫైన్ అడిగితే మంగళ సూత్రం ఇచ్చిన మహిళ.. ఇది ఎక్కడో కాదు, మన బెంగళూరులోనే