TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) త్వరలోనే భారత మార్కెట్లో మరో సరికొత్త ప్రీమియం బైక్ ను విడుదల చేయబోతోంది. ఈ దేశీయ టూవీలర్ బ్రాండ్ తాజాగా టీవీఎస్ అపాచే 165 ఆర్‌పి (TVS Apache 165 RP)పేరుతో ఓ టీజర్ ను విడుదల చేసింది. కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఈ బైక్ యొక్క రేస్ పెర్ఫార్మెన్స్ (ఆర్‌పి) వెర్షన్‌ను ట్రేడ్‌మార్క్ చేసింది, కాగా ఇప్పుడు ఇది త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

టీవీఎస్ ఇండియా ప్రస్తుతం విక్రయిస్తున్న టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) మోడల్ ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త టీవీఎస్ అపాచే 165 ఆర్‌పి మోడల్ ను అభివృద్ధి చేసింది. ఈ బైక్ పేరులో ఆర్‌పి (RP) అంటే రేసింగ్ పెర్ఫార్మెన్స్ (Racing Performance) అని అర్థం. భవిష్యత్తులో మరిన్ని Apache మోడళ్లలో RP వెర్షన్లను తీసుకురావాలని టీవీఎస్ ప్లాన్ చేస్తోంది. ఇందులో మొదటి మోడల్‌ గా Apache 165 RP.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

ఈ RP సిరీస్ బైక్‌లు పేరుకు తగినట్లుగానే ఉత్తమ పెర్ఫర్మానెస్స్ ను కలిగి ఉంటాయి మరియు స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే ఇందులో చాలా మార్పులు కనిపిస్తాయి. అపాచే ఆర్టీఆర్ 1604వి RTR 160 4Vలో వినియోగిస్తున్న ఈ బైక్‌లో 159.7 సిసి, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉపయోగించబడే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొత్త Apache 310 కనిపించినట్లే ఇందులో కూడా కొన్ని కొత్త కిట్‌లను చూడవచ్చు. ఈ కిట్‌లు కస్టమర్లు తమ బైక్‌లను వారి అవసరాలకు అనుగుణంగా ట్యూన్ చేసుకోవడానికి సహాయపడతాయి.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

ప్రస్తుతం, ఈ బిఎస్6 ఇంజన్ 17.63 బిహెచ్‌పి పవర్ మరియు 14.73 న్యూటన్ మీటర్ల టార్క్‌ను అందిస్తుంది. కాగా, కొత్త RP వెర్షన్ లో ఉపయోగించబోయే ఇదే మరింత శక్తివంతమైనదిగా ఉంటుందని సమాచారం. అయితే, దీని పవర్ టార్క్ గణంగాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది, అలాగే గేర్ నిష్పత్తిని కూడా మార్చడానికి కంపెనీ ఇందులో స్వల్ప మార్పు చేసే అవకాశం ఉంది. అదే సమయంలో, దాని రూపాన్ని కూడా మార్చవచ్చు, ఇది ఈ బైక్‌కు మరింత స్టైలిష్ మరియు స్పోర్టీ రూపాన్ని అందించడంలో సహకరిస్తుంది.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

ఈ రేస్ పెర్ఫార్మెన్స్ వెర్షన్ లో చిన్నపాటి మెకానికల్ అప్‌గ్రేడ్స్ తో పాటుగా పలు కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ ను కూడా ఆశించవచ్చు. ఈ మార్పులు బైక్ కు మరింత అగ్రెసివ్ లుక్ ని జోడించడంలో సహకరిస్తాయి. ఈ బైక్ లోని సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఇదే సెటప్ ను కొత్త టీవీఎస్ అపాచే 165 ఆర్‌పిలో కూడా చూడొచ్చు.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ఇరు చక్రాలపై డిస్క్ బ్రేకులు ఉంటాయి. ఇవి రెండూ డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ను సపోర్ట్ చేస్తాయి. ఈ ఫీచర్ కొత్త బైక్‌ను మరింత సురక్షితంగా చేయడంలో సహకరిస్తుంది. ఇందులో లభించే ఫీచర్ల విషయానికి వస్తే, ఈ బైక్ లో ఎల్ఈడి హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, గ్లైడ్ త్రూ ట్రాఫిక్, వన్ టచ్ స్టార్ట్, SmartXNect మొదలైన వాటిని ఇందులో ఆశించవచ్చు.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

నవంబర్ నెలలో తగ్గిన టీవీఎస్ సేల్స్

టీవీఎస్ మోటార్ కంపెనీ నవంబర్ 2021 నెల అమ్మకాలను గమనిస్తే, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే టీవీఎస్ అమ్మకాలు సుమారు 17 శాతం తగ్గాయి. కంపెనీ విడుదల చేసిన డేటా ప్రకారం, కంపెనీ గత నవంబర్ నెలలో టీవీఎస్ మొత్తం 2,57,863 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇవి నవంబర్ 2020లో విక్రయించిన 3,11,519 యూనిట్ల కంటే 17 శాతం తక్కువ. ఈ మొత్తం అమ్మకాలలో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు రెండూ కలిసి ఉన్నాయి.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

నవంబర్ 2021 నెలలో టీవీఎస్ దేశీయ మార్కెట్లో 1,75,940 యూనిట్లను విక్రయించగా, గత ఏడాది నవంబర్‌ 2020 నెలలో 2,47,789 యూనిట్లను విక్రయించింది. స్కూటర్ విక్రయాల విషయానికొస్తే, కంపెనీ నవంబర్ 2020 నెలలో మొత్తం 1,06,196 యూనిట్లను విక్రయించగా, గత నెలలో 75,022 యూనిట్లను మాత్రమే విక్రయించింది. గత నెలలో స్కూటర్ విక్రయాలు కూడా బాగా తగ్గాయి. ఎగుమతుల పరంగా చూస్తే, టీవీఎస్ నవంబర్ 2020 నెలలో 74,074 యూనిట్ల నుండి నవంబర్ 2021 నెలలో 96,000 యూనిట్లకు పెరిగాయి. ఈ సమయంలో ఎగుమతులు మాత్రం 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

TVS Apache 165 RP టీజర్ లాంచ్; త్వరలోనే భారత మార్కెట్లో విడుదల!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

టీవీఎస్ నుండి కొత్తగా రాబోయే అపాచే 165 ఆర్‌పి (TVS Apache 165 RP) మోడల్ దాని స్టాండర్డ్ మోడల్ కన్నా మరింత స్పోర్టీగా ఉండబోతోందని తెలుస్తోంది. కంపెనీ దీనిని స్పోర్టీ డిజైన్ మరియు ఆధునిక ఫీచర్లతో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ బైక్ లాంచ్ గురించి రాబోయే రోజుల్లో పూర్తి సమాచారం వెల్లడి కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Wednesday, December 22, 2021, 13:23 [IST]
English summary
Tvs motor company teases new apache 165 rp india launch expected soon details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+