TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

చెన్నైకి చెందిన ప్రముఖ దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోను అప్‌డేట్ చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఇటీవలే కొన్ని కొత్త పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ కోసం దాఖలు చేసింది.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

తాజాగా విడుదలైన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం, కంపెనీ 'TVS Apache RTR 165 RP' (టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 165 ఆర్‌పి) మరియు 'TVS RP Race Performance' (టీవీఎస్ ఆర్‌పి రేస్ పెర్ఫార్మెన్స్) అనే రెండు పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేర్లతో కంపెనీ పూర్తిగా సరికొత్త మోడళ్లను విడుదల చేస్తుందా లేక ప్రస్తుతం ఉన్న మోడళ్లలో స్పెషల్ ఎడిషన్లను ప్రవేశపెడుతుందా అనేది తెలియాల్సి ఉంది.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

కాగా, ఇందులో TVS Apache RTR 165 RP అనే పేరును ఆగస్ట్ 16, 2021వ తేదీన ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేశారు. ప్రస్తుతం ఈ పేరు విచారణ దశలో ఉందని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చెబుతోంది. ఈ పేరును మోటారైజ్డ్ వెహికల్స్, ఆటోమోటివ్ త్రీవీలర్స్ మరియు టూవీలర్స్, మోటార్‌సైకిల్స్, మోపెడ్స్, స్కూటర్స్, స్కూటరెట్స్ మరియు విడిభాగాల విభాగంలో రిజిస్టర్ చేశారు.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న TVS Apache RTR 160 4V యొక్క కొత్త 2021 మోడల్ దాని విభాగంలోనే అత్యంత శక్తివంతమైన మోటార్‌సైకిల్ గా ఉంది. ఈ మోడల్ ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో TVS Apache RTR 165 RP పేరుతో మరింత స్పోర్టియర్ గా ఉండే వేరియంట్ ను ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

ఈ రేస్ పెర్ఫార్మెన్స్ (ఆర్‌పి) వేరియంట్ లో కంపెనీ మరింత ఎక్కువ డిస్‌ప్లేస్‌మెంట్ కలిగిన ఇంజన్ ఉపయోగించవచ్చని సమాచారం. ఇందులో 4-వాల్వ్ 159.7 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ ను రీట్యూన్ చేయటం ద్వారా దాని పవర్ 1 నుండి 1.5 బిహెచ్‌పి వరకూ మరియు టార్క్ 1 న్యూటన్ మీటర్ వరకు పెరిగే అవకాశం ఉంది.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

ప్రస్తుతం, RTR 160 4V లో ఉపయోగిస్తున్న ఈ ఇంజన్ గరిష్టంగా 17.63 బిహెచ్‌పి పవర్ ను మరియు 14.73 న్యూటన్ మీటర్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ నుండి అధిక రెవ్ సీలింగ్ అలాగే వేగవంతమైన థ్రోటల్ రెస్పాన్స్ లభిస్తుంది. కాగా, కొత్తగా రాబోయే రేస్ పెర్ఫార్మెన్స్ అపాచీలో కంపెనీ తమ 2021 TVS Apache RR 310 లో ఆఫర్ చేసిన రేస్ కిట్ వంటి అగ్రెసివ్ గా కనిపించే ఎర్గోనామిక్స్‌ ను కూడా అందించవచ్చని తెలుస్తోంది.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

ఈ కొత్త వేరియంట్ హ్యాండిల్‌బార్లు కొద్దిగా తక్కువగా ఉండవచ్చు మరియు ఫుట్‌పెగ్‌లు కొంచెం ఎక్కువగా వెనుక వైపుకు సెట్‌ చేసినట్లు ఉండొచ్చు. ఫలితంగా, ఇది కార్నర్స్ వద్ద మెరుగైన హ్యాండ్లింగ్ ను కలిగి ఉంటుంది. బెటర్ రోడ్ గ్రిప్ కోసం ఇందులో TVS Remora పెర్ఫార్మెన్స్ టైర్లను ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే, మెరుగైన బ్రేకింగ్ కోసం ఇది డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ని కూడా పొందవచ్చని తెలుస్తోంది.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న TVS Apache RTR 200 4V లో ఆఫర్ చేస్తున్నట్లుగా కాకుండా, ఈ కొత్త వేరియంట్ లో ప్రీలోడెడ్ అడ్జస్టబల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌ లను పొందవచ్చని సమాచారం. కాబట్టి, ఈ ఫీచర్లన్నింటి కారణంగా, కొత్త TVS Apache RTR 165 RP దాని విభాగంలోనే అత్యంత స్పోర్టియెస్ట్ నేక్డ్ మోటార్‌సైకిల్‌ గా ఉండబోతోందని మరియు యువతను ఎక్కువగా ఆకర్షిస్తుందని అంచనా.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

కాగా, TVS Apache RTR 165 RP పేరును మాత్రమే కాకుకండా, కంపెనీ 'TVS RP Race Performace' అనే పేరు కోసం కూడా ట్రేడ్‌మార్క్ ను కూడా దాఖలు చేసింది. ఇది టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క సబ్-బ్రాండ్‌గా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సబ్-బ్రాండ్ క్రింద రాబోయే మొదటి ఉత్పత్తి TVS Apache RTR 165 RP అవుతుందని సమాచారం.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

భారత్‌లో 2021 TVS Apache RR 310 విడుదల..

ఇదిలా ఉంటే, TVS Motor Company తమ సరికొత్త 2021 Apache RR 310 ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కొత్త బైక్ ప్రారంభ ధర రూ. 2.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ బ్రాండ్ యొక్క బిల్డ్-టు-ఆర్డర్ ప్రక్రియ ద్వారా అనేక అప్డేట్స్ మరియు పర్సనలైజేషన్ అప్సన్స్ ను కలిగి ఉంటుంది.

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇదో కొత్త బైకా..?

కంపెనీ ఈ కొత్త స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ ను పరిమిత సంఖ్యలో మాత్రమే విక్రయించనుంది. కొత్త 2021 TVS Apache RR 310 అమ్మకాలను సెప్టెంబర్‌ 2021 నెలలో 100 యూనిట్లు మరియు అక్టోబర్ 2021 నెలలో 150 యూనిట్లకు పరిమితం చేసినట్లు కంపెనీ ప్రకటించింది. - ఈ బైక్ కి సంబంధించిన మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tvs motor company trademarks two new names details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X