మీకు తెలుసా.. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 సేల్స్ 1 లక్ష యూనిట్లు దాటేశాయ్
ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ తన ఎన్‌టార్క్ 125 స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో 1 లక్ష యూనిట్ల అమ్మకాలను జరిపినట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ బ్లూటూత్ కనెక్ట్ ఫీచర్‌తో ఎన్‌టార్క్ 125 స్కూటర్ యొక్క బిఎస్-6 మోడల్‌ను విక్రయిస్తోంది.

టీవీఎస్ మోటార్స్ ప్రస్తుతం దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ మరియు ఆసియాన్ దేశాలతో సహా మొత్తం 19 కి పైగా దేశాలలో తన బ్రాండ్ యొక్క ఎన్‌టార్క్ 125 స్కూటర్లను విక్రయిస్తోంది. ఈ టీవీఎస్ కంపెనీ ఎన్‌టార్క్ 125 స్కూటర్ ని 2018 లో విడుదల చేసింది.

విడుదలయినప్పటినుంచి క్రమంగా ఈ స్కూటర్‌ను అనేక ఆధునిక లక్షణాలతో కంపెనీ అప్‌డేట్ చేసింది. టీవీఎస్ కంపెనీ యొక్క ఎన్‌టార్క్ 125 స్కూటర్ మంచి పనితీరుపై మరియు ఆకర్షణీయమైన డిజైన్ కి ప్రసిద్ది చెందింది. ఈ స్కూటర్ చూడటానికి చాలా సింపుల్ గా మరియు స్టైలిష్ గా ఉంటుంది.

టీవీ యొక్క ఎన్‌టార్క్ 125 స్కూటర్ మంచి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలను సాగించగలిగిందని టివిఎస్ మోటార్ కంపెనీ డైరెక్టర్ మరియు సిఇఒ కె.ఎన్. రాధాకృష్ణన్ తెలిపారు. టీవీఎస్ యొక్క ఎన్‌టార్క్ 125 స్కూటర్ ఎట్టకేలకు 1 లక్ష యూనిట్ల అమ్మకాలను చేరింది.

ఈ స్కూటర్ ప్రపంచవ్యాప్తంగా యువ వినియోగదారులను ఆకర్శించడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఎక్కువమంది వాహనప్రియులు ఇష్టపడుతున్న స్కూటర్లలో ఎన్‌టార్క్ ఒకటిగా ఉంది. ఈ స్కూటర్ చాలా మంచి స్టైలిష్ డిజైన్ కలిగి, కనెక్టెడ్ టెక్నాలజీతో ఉన్నతమైన పనితీరు అందిస్తుంది.

టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, 12-ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, పెటల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, స్ప్లిట్ గ్రాబ్ రైల్, యుఎస్‌బి ఛార్జర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, బ్లూటూత్ కనెక్టివిటీ మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ యొక్క 3 డి లోగో ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇందులో 124.8 సిసి ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంది, ఇది 9.25 బిహెచ్‌పి పవర్ మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో హైడ్రాలిక్ సస్పెన్షన్ ఉన్నాయి.

టీవీఎస్ ఎన్‌టార్క్ అనేది యువతను ఎక్కువగా ఆకర్షించడానికి రూపొందించిన ప్రీమియం స్పోర్ట్ ఎడిషన్ స్కూటర్. టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ తో పాటు మార్కెట్లో యమహా రే జెడ్ఆర్, ఎప్రిలియా స్టార్మ్ 125 మరియు హీరో మాస్ట్రో ఎడ్జ్ వంటి స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి.

భారతదేశంలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిస్క్ మరియు డ్రమ్ అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎన్‌టార్క్ 125 డ్రమ్ వేరియంట్ రూ. 71,095 కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 75,395 వరకు ఉంటుంది. అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ప్రాతిపదికన నిర్ణయించడం జరిగింది. ఏది ఏమైనా టీవీఎస్ యొక్క ఎన్‌టార్క్ 1 లక్ష యూనిట్లు అమ్ముడై గొప్ప రికార్డుని సృష్టించింది.


Click it and Unblock the Notifications








