నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టివిఎస్ మోటార్ తన బిఎస్ 6 ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను ఇప్పుడు నేపాల్‌లో విడుదల చేసింది. కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్125 స్కూటర్ ఐదు వేరియంట్లలో విడుదలైంది. అవి డ్రమ్, డిస్క్, రేస్ ఎడిషన్, రేస్ ఎడిషన్ బిఎస్ 6 ఎఫ్‌ఐ మరియు సూపర్‌స్క్వాడ్ ఎడిషన్ వేరియంట్లు.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

టీవీఎస్ ఎన్‌టార్క్125 స్కూటర్ కనెక్టివిటీ ఫీచర్ల వంటి లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ విధమైన అధునాతన ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల టీవీఎస్ ఎన్‌టార్క్125 స్కూటర్ అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించగలిగింది. టీవీఎస్ ఎన్‌టార్క్125 స్కూటర్ ఒక్క భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా వంటి దేశాలలో కూడా బాగా విస్తరించి ఉంది.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

కొత్త బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్125 స్కూటర్ రేస్-ట్యూన్డ్ మరియు ఫ్యూయెల్ ఇంజెక్షన్ 124.8 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 9.1 బిహెచ్‌పి పవర్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 10.5 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ సివిటి యూనిట్‌తో జత చేయబడింది.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

నేపాల్‌లో ప్రారంభించిన టివిఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో 5.8 లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయెల్ ట్యాంక్ ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 నేపాల్‌లో విడుదలైన బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్‌తో కూడిన మొదటి స్కూటర్. ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కలిగి ఉంది.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

ఇప్పుడు మార్కెట్లో రేస్ ఎడిషన్ కూడా కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది స్టాండర్డ్ మోడల్‌పై అనేక కాస్మొటిక్ మరియు ప్రీమియం ఫీచర్స్ కొంత నవీకరణలను పొందింది.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

బిఎస్-6 టివిఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను బీఎస్-6 కాలుష్య నియమానికి అనుగుణంగా అప్‌గ్రేడ్ చేసిన తర్వాత కొంత బరువు పెరగడం జరిగింది. బిఎస్-6 ఎన్‌టార్క్ 125 స్కూటర్ బరువు 1.9 కిలోల కంటే ఎక్కువ పెరిగింది. మొత్తం బరువు ఇప్పుడు 118 కిలోలు.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

ఈ స్కూటర్ కంపెనీ యొక్క స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ కనెక్టివిటీ టెక్నాలజీకి మద్దతు ఇస్తుంది. స్మార్ట్ ఎక్స్ కనెక్టివిటీ ఫీచర్ స్మార్ట్‌ఫోన్‌ను బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేయగలదు . అంతే కాకుండా ఇందులో క్లస్టర్ నావిగేషన్ అసిస్ట్, టాప్ స్పీడ్ రికార్డర్, అంతర్నిర్మిత ల్యాప్-టైమర్, ఫోన్-బ్యాటరీ కెపాసిటీ మరియు ​​సర్వీస్ రిమైండర్ వంటివి ఉన్నాయి. ఇందులో ఉన్న ట్రిప్ మీటర్ స్ట్రీట్ మరియు స్పోర్ట్ వంటి మల్టీ-రైడ్ స్టాటిస్టికల్ మోడ్‌లను ప్రదర్శిస్తుంది.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

ఈ కొత్త స్కూటర్ యొక్క రేస్ ఎడిషన్‌లోని ఆకర్షణీయమైన మార్పు ఇందులోని ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌తో ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్‌. రేస్ ఎడిషన్ ఎన్‌టార్క్ స్కూటర్ యొక్క అమ్మకాలను పెంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాహనప్రియులకు అన్నివిధాలుగా చాలా అనుకూలంగా ఉండే బైక్ ఈ ఎన్‌టార్క్ రేస్ ఎడిషన్.

నేపాల్‌లో విడుదలైన బిఎస్ 6 టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌; వివరాలు

ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అనేక కాస్మొటిక్ ఉపాదాట్లు కలిగి ఉండి, అనేక అప్డేటెడ్ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ తొమ్మిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఎడిషన్ మాట్టే రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్, మెటాలిక్ బ్లూ కలర్స్ లో లభిస్తుంది.

రేస్ ఎడిషన్ (బిఎస్ 6 ఎఫ్‌ఐతో సహా) రెడ్-బ్లాక్ మరియు ఎల్లో-బ్లాక్‌లో లభిస్తుంది. అయితే సూపర్ స్క్వాడ్ ఎడిషన్ స్కూటర్ మాత్రం కంబాట్ బ్లూ, ఇన్ విజిబుల్ రెడ్ మరియు స్టీల్త్ బ్లాక్ అనే మూడు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
TVS Motor Company launches BS-VI TVS NTORQ 125 In Nepal. Read in Telugu.
Story first published: Tuesday, July 27, 2021, 10:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X