నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

చెన్నైకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న సక్సెస్‌ఫుల్ 125సిసి స్కూటర్ 'టీవీఎస్ ఎన్‌టార్క్ 125' మన పొరుగు దేశమైన నేపాల్ మార్కెట్లో కూడా విజయవంతంగా కొనసాగుతోంది. నేపాల్ మార్కెట్లో ఇది అమ్మకాల పరంగా కొత్త మైలురాయిని చేరుకుంది.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

నేపాల్ మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ విడుదలైనప్పటికీ నుండి ఇప్పటి వరకూ 50,000 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. గడచిన 2018లో ఈ స్కూటర్‌ను నేపాల్ మార్కెట్లో విడుదల చేశారు. ఈ మూడేళ్ల కాలంలో ఎన్‌టార్క్ 125 స్కూటర్ సెగ్మెంట్లోని ఇతర మోడళ్ల కన్నా ముందంజలో ఉంది.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

ఈ సందర్భంగా టీవీఎస్ మోటార్ కంపెనీ ఇంటర్నేషనల్ బిజినెస్ ప్రెసిడెంట్ ఆర్ దిలీప్ మాట్లాడుతూ.. నేపాల్ మార్కెట్లో తమ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్మార్ట్ స్కూటర్ 50,000 యూనిట్ల అమ్మకాల మైలురాయిని సాధించినందుకు సంతోషంగా ఉందని, ఇందులో భాగమైన నేపాల్‌లోని తమ వినియోగదారులకీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

మెరుగైన మౌలిక సదుపాయాలు, మల్టీ యుటిలిటీ వాహనాల అవసరం మరియు సురక్షితమైన వ్యక్తిగత మొబిలిటీ కోసం పెరుగుతున్న డిమాండ్ కారణంగా స్కూటర్లు దేశంలో ప్రముఖ ఎంపికగా మారుతున్నాయి. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 యొక్క అద్భుతమైన డిజైన్, లేటెస్ట్ కనెక్టింగ్ టెక్నాలజీ మరియు అత్యుత్తమ పనితీరు వంటి లక్షణాలు మార్కెట్లో దాని విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

నేపాల్ మార్కెట్లో కంపెనీ ఇటీవలే తమ లేటెస్ట్ బిఎస్6 వెర్షన్ మరియు బ్లూటూత్ కనెక్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త 2021 మోడల్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మోడల్‌ను కూడా ప్రవేశపెట్టింది. అక్కడి మార్కెట్లో ఈ స్కూటర్ యొక్క మొత్తం ఐదు వేరియంట్లలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

వీటిలో టీవీఎస్ ఎన్‌టార్క్ 125 డిస్క్, డ్రమ్, రేస్ ఎడిషన్, రేస్ ఎడిషన్ ఎఫ్ఐ మరియు సూపర్ స్క్వాడ్ ఎడిషన్‌లు ఉన్నాయి. ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 124.8సిసి సింగిల్ సిలిండర్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 9.1 బిహెచ్‌పి శక్తిని మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో అతి ముఖ్యమైన ఫీచర్ దాని స్మార్ట్ ఎక్స్ కనెక్ట్ సిస్టమ్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ. ఈ ఫీచర్లను నిర్వహించడానికి TVS Connect అనే ప్రత్యేక యాప్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ యాప్ సాయంతో రైడర్లు తమ స్మార్ట్‌ను స్కూటర్‌తో అనుసంధానం చేసుకోవచ్చు.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

ఈ ఫీచర్ ద్వారా రైడర్ తన స్కూటర్‌పై టర్న్ బై టర్న్ నావిగేషన్ వివరాలను, కాల్, ఎస్ఎమ్ఎస్ మరియు వాట్సాప్ అలెర్ట్‌లను పొందవచ్చు. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్ మ్యాట్ రెడ్, మెటాలిక్ గ్రే, మెటాలిక్ రెడ్ మరియు మెటాలిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీని రేస్ ఎడిషన్ మాత్రం ఎరుపు-నలుపు మరియు పసుపు-నలుపు రంగులలో లభిస్తుంది.

నేపాల్ మార్కెట్లో రికార్డ్స్ బ్రేక్ చేసిన టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్..

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 నేపాల్‌లోనే కాకుండా భారతదేశంలో కూడా మంచి ఆదరణ పొందిన స్కూటర్. దేశీయ విపణిలో 125సిసి విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఇది కూడా ఒకటి. టీవీఎస్ ఈ స్కూటర్‌ను కేవలం నేపాల్‌కు మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 19 దేశాలకు ఎగుమతి చేస్తుంది. వీటిలో దక్షిణ ఆసియా, లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం మరియు ఆసియా దేశాలు ఉన్నాయి.

Most Read Articles

English summary
Tvs ntorq 125 sales crossed 50000 units mark in nepal details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X