టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

తమిళనాడుకు చెందిన ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) గత ఏడాది (2020) ప్రారంభంలో ప్రముఖ బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ నార్టన్ (Norton) ను కొనుగోలు చేసిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, టీవీఎస్ మోటార్ కంపెనీ కొన్ని నెలల క్రితమే, ఈ ఏడాది చివరి నాటికి UK లో నిర్మాణంలో ఉన్న కొత్త ఫ్యాక్టరీలో మోటార్‌సైకిళ్ల ఉత్పత్తిని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

యూకే లోని కౌంటీకి సమీపంలోని సోలిహుల్‌ లో నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీలో టీవీఎస్ యాజమాన్యంలో ఉన్న నార్టన్ తమ కొత్త మోటార్‌సైకిళ్లను తయారు చేయనుంది. ప్రపంచంలోనే పురాతనమైన మోటార్‌సైకిల్ బ్రాండ్‌ లలో ఒకటైన నార్టన్‌ ను టీవీఎస్ 16 మిలియన్లకు కొనుగోలు చేసింది. హోసూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద కొనుగోలు ఇదే.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

నార్టన్ బ్రాండ్ ను టీవీఎస్ స్వాధీనం చేసుకున్న తర్వాత, అంతర్జాతీయ మార్కెట్లలో నార్టన్ కార్యకలాపాలు పుంజుకోవడం ప్రారంభించాయి. నార్టన్ ఇప్పుడు తన సప్లై చైన్‌ను సరికొత్త రూపంతో బలోపేతం చేస్తోంది మరియు అదే సమయంలో కొన్ని కొత్త మోటార్‌సైకిళ్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈలోగా నార్టన్ వి4 (Norton V4) బైక్‌ల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కంపెనీ నిర్ణయించింది.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

అయితే, దాని కన్నా ముందుగా ఈ బ్రిటిష్ టూవీలర్ బ్రాండ్ కొత్త నార్టన్ వి4ఎస్‌వి (Norton V4SV) అనే కొత్త ఓ మోటార్‌సైకిల్‌ ను రూపొందించింది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త సూపర్ బైక్ ను అధికారికంగా ఆవిష్కరించింది. నార్టన్ ఇదివరకు విక్రయిస్తూ వచ్చిన వి4ఎస్ఎస్ (Norton V4SS) మోడల్‌కు కొత్త నార్టన్ వి4ఎస్‌ ప్రత్యామ్నాయంగా ఉంటుంది మరియు V4SS బైక్ లో ఉపయోగించిన కొన్ని రకాల పరికరాలు మరియు విడిభాగాలను ఇది పంచుకుంటుంది.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

నార్టన్ వి4ఎస్‌ పూర్తిగా కార్బన్ ఫైబర్ ప్యానెళ్లతో తయారు చేయబడింది, వీటిలో బ్లాక్ ఫ్రంట్ విండ్‌షీల్డ్‌లు, రెడ్ పెయింటెడ్ అల్లాయ్ వీల్స్, స్థూలంగా కనిపించే పెట్రోల్ ట్యాంక్, సైడ్ మౌంటెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్, దృఢమైన సీట్లు, డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్ మరియు వెనుకవైపు యూనియన్ జాక్ ఫ్లాగ్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ బైక్ ను పూర్తిగా చేతితో రూపొందించిన అల్యూమినియం ట్యూబ్ ఫ్రేమ్‌పై తయారు చేశారు.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

ఈ కొత్త నార్టన్ బైక్‌ లో సస్పెన్షన్ కోసం ప్రింబో మోనోబ్లాక్ కాలిపర్ లు అందించబడ్డాయి మరియు వెనుక భాగంలో హోలిన్స్ సెటప్ అందించబడింది. కానీ ఇది పనితీరు కోసం సాధారణ వి4 ఇంజన్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 185 బిహెచ్‌పి పవర్ ను జనరటే చేస్తుంది. అయితే, ఇది మునుపటి కంటే 15 బిహెచ్‌పిలు తక్కువగా ఉంటుంది. అలాగే ఈ ఇంజన్ అందించే టార్క్ కెపాసిటీని కూడా గణనీయంగా తగ్గించారు. కానీ, ఈసారి 10,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్ట టార్క్‌ ను అందించడానికి ఈ ఇంజన్ ను రీట్యూన్ చేశారు.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

ఫీచర్ల విషయానికి వస్తే ఈ కొత్త 2022 నార్టన్ వి4ఎస్‌వి బైక్‌లో కొత్త నార్టన్ వి4ఎస్‌వి కీలెస్ ఇగ్నిషన్, వెనుకవైపు కెమెరాతో కూడిన 6 ఇంచ్ టిఎఫ్‌టి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. ట్విన్-స్పార్ అల్యూమినియం ఫ్రేమ్ వంటి బైక్‌ లోని ఇతర కీలక భాగాలు అలాగే ఉంచబడ్డాయి మరియు ఇది సర్దుబాటు చేయగల రేక్ యాంగిల్, స్టీరింగ్ ఆఫ్‌సెట్ మరియు స్వింగ్‌ఆర్మ్ పివోట్‌ ను యధావిధిగా కొనసాగిస్తుంది.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

ఇంకా ఇందులో సిక్స్-యాక్సిస్ ఇనర్షియల్ మెజర్‌మెంట్ యూనిట్ (IMU), మూడు రైడింగ్ మోడ్‌లు, అప్/డౌన్ క్విక్‌షిఫ్టర్ మరియు ఎల్ఈడి లైటింగ్ వంటి ఫీచర్లను కూడా కలిగి ఉంంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 330 మిమీ డిస్క్‌లతో కూడిన బ్రెంబో మోనోబ్లాక్ కాలిపర్‌లు ఉంటాయి. ఇది కార్నరింగ్ ఏబిఎస్ ను సపోర్ట్ చేయదు. ఇందులో ఓహ్లిన్స్ సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. కార్బన్ ఫైబర్ బాడీవర్క్ కారణంగా బైక్ మొత్తం బరువు 179 కిలోల నుంచి 193 కిలోలకు పెరిగింది.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

నార్టన్ వి4ఎస్‌వి బైక్ రెండు వేరియంట్‌ లలో అందుబాటులోకి వస్తుంది అవి - రెడ్ అండ్ బ్లాక్ పిన్‌స్ట్రిపింగ్ మరియు రెడ్ అల్యూమినియం వీల్స్‌తో కూడిన మ్యాంక్స్ సిల్వర్, మరియు కార్బన్ ట్రిమ్. ఈ రెండు ట్రిమ్‌లు కూడా NIX30 ఫోర్క్‌లు మరియు TTXGP షాక్‌ తో ఒకే విధమైన యాంత్రికంగా సర్దుబాటు చేయగల ఓహ్లిన్స్ సస్పెన్షన్‌ ను పొందగా, తక్కువ-స్పెక్ ట్రిమ్ అల్యూమినియం OZ వీల్స్‌ను పొందుతుంది, ఇవి అధిక-స్పెక్ ట్రిమ్‌ లో కార్బన్ ఫైబర్ వీల్స్‌ తో భర్తీ చేయబడతాయి.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

టీవీఎస్ ఈ కొత్త నార్టన్ బైక్‌ ను భారత మార్కెట్లోకి తీసుకువస్తుందో లేదో ఇంకా తెలియరాలేదు. ఎందుకంటే, కొత్త నార్టన్ బైక్‌ లను కంపెనీ భారత మార్కెట్లో మొదట పూర్తిగా పరీక్షించిన తర్వాతనే ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, గడచిన మే 2021 నెలలో నార్టన్ నాలుగు పేర్లను నమోదు చేసింది. అవి: కమాండో, అట్లాస్, ఫాస్ట్‌బ్యాక్ మరియు మాంక్స్. నార్టన్ కమాండో మోడల్ ఇప్పటికే భారతదేశంలో అమ్మకానికి ఉంది.

టీవీఎస్‌కి చెందిన Norton V4SV సూపర్‌బైక్ ఆవిష్కరణ; V4SS కి రీప్లేస్‌మెంట్!

నార్టన్ కమాండో 961 సిసి, ట్విన్ సిలిండర్ ఇంజన్ తో వస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 80 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేయగలదు. ఇక నార్టన్ అట్లాస్ విషయానికి వస్తే, పురాతన స్క్రాంబ్లర్ బైక్‌ల వలె కనిపించేలా రూపొందించబడిన ఈ బైక్ డ్యూయల్ యూజ్ టైర్‌ లతో కూడిన ఆఫ్-రోడ్ మోటార్‌సైకిల్‌ గా రూపొందించబడింది. ఈ ఇంజన్ గరిష్టంగా 84 బిహెచ్‌పి పవర్ మరియు 64 ఎన్ఎమ్ టార్క్‌ ను ఉత్పత్తి చేయగలదని అంచనా.

Most Read Articles

English summary
Tvs owned norton motorcycles unveils v4sv superbike will be replaced with v4ss
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X