TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారత మార్కెట్లో 125 సిసి విభాగంలో ఇటీవలే తమ సరికొత్త రైడర్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు తమ పాపులర్ స్కూటర్ జూపిటర్ (Jupiter) లో కూడా 125 సిసి వెర్షన్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

మార్కెట్ సమాచారం ప్రకారం, కొత్త టీవీఎస్ జూపిటర్ 125 (TVS Jupiter 125) స్కూటర్ అక్టోబర్ నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ టీవీఎస్ జూపిటర్ కేవలం 110 సిసి ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇందులో ఇప్పుడు కొత్తగా రనున్న 125 సిసి వెర్షన్ పెద్ద ఇంజన్‌తోనే కాకుండా కొత్త డిజైన్ మరియు ఫీచర్లతో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

కొత్త 2021 టీవీఎస్ జూపిటర్ 125 ఈ విభాగంలో నేరుగా హోండా యాక్టివా 125, హీరో మాస్ట్రో ఎడ్జ్ 125, యమహా ఫాసినో 125 మరియు సుజుకి యాక్సెస్ 125 వంటి స్కూటర్లతో పోటీ పడనుంది. కొత్త 2021 TVS Jupiter 125 పూర్తిగా కొత్త డిజైన్‌ని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, దాని ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం ప్రస్తుత Jupiter 110 మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

టీవీఎస్ ప్రస్తుతం విక్రయిస్తున్న 110 సిసి వెర్షన్ జూపిటర్ స్కూటర్‌తో పోలిస్తే, ఈ కొత్త 125 సిసి జూపిటర్ స్కూటర్‌ను భిన్నంగా చూపించేందుకు కంపెనీ ఈ కొత్త మోడల్‌లో కొత్త కలర్ స్కీమ్‌లను కూడా పరిచయం చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా ఈ కొత్త జూపిటర్ 125 స్కూటర్ బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి కొత్త ఫీచర్లను కూడా ఆఫర్ చేయవచ్చని భావిస్తున్నారు.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

ఇంకా ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, స్వింగార్మ్-మౌంటెడ్ రియర్ మోనోషాక్, అల్లాయ్ వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, యూఎస్‌బి ఛార్జర్ మరియు బయట వైపు ఫ్యూయెల్ ఫిల్లింగ్ క్యాప్ వంటి ఫీచర్లను కూడా ఆశించవచ్చు. ప్రస్తుత జూపిటర్‍‌తో పోలిస్తే, కొత్త స్కూటర్ ఎక్కువ అండర్-సీట్ స్టోరేజ్ మరియు పెద్ద ఫ్లాట్ ఫుట్‌బోర్డ్‌తో చాలా ప్రాక్టికల్‌గా ఉంటుందని తెలుస్తోంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

ఇక ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్‌లో కంపెనీ ప్రస్తుతం విక్రయిస్తున్న స్పోర్టీ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ 125 (TVS Ntorq 125) లో ఉపయోగిస్తున్న అదే ఇంజన్‌ను కొనసాగించే అవకాశం ఉంది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 లోని ఇంజన్ రెండు ట్యూనింగ్స్‌లో అందుబాటులో ఉంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

ఇందులోని 124.8 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఎన్‌టార్క్ రేస్ ఎక్స్‌పి వేరియంట్లో గరిష్టంగా 10.2 పిఎస్ శక్తిని మరియు 10.8 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఇతర వేరియంట్లు 9.38 పిఎస్ శక్తిని మరియు 10.5 ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఇంజన్ అప్‌‌డేటెడ్ సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

కొత్త 2021 టీవీఎస్ జూపిటర్ 125 లో ఉపయోగించబోయే ఇంజన్, దాని అధిక బరువు కారణంగా కాస్తంత తక్కువ పవర్, టార్క్ లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఎన్‌టార్క్ స్కూటర్ మాదిరిగా కాకుండా, జూపిటర్ 125 లో మెరుగైన ఇంధన సామర్థ్యం కోసం రేస్ ట్యూన్డ్ ఫ్యూయల్ ఇంజెక్టర్ (RT FI) కి బదులుగా ET ఫ్యూయల్ ఇంజెక్టర్‌ని కలిగి ఉంటుంది. దీని వలన మైలేజ్ పెరుగుతుంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ కంపెనీ యొక్క స్కూటర్ లైనప్‌లో ఐదవ మోడల్ కానుంది. మరియు ఇది ప్రస్తుత జూపిటర్ 110 మరియు ఎన్‌టార్క్ 125 మోడళ్ల మధ్యలోని అంతరాన్ని పూరించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీవీఎస్ భారత మార్కెట్లో స్కూటీ పెప్ ప్లస్, జెస్ట్ 110, జూపిటర్ 110 మరియు ఎన్‌టార్క్ 125 మోడళ్లను విక్రయిస్తోంది.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) బైక్ లాంచ్..

ఇదిలా ఉంటే, టీవీఎస్ ఈ నెల 16వ తేదీన తమ సరికొత్త 125 సిసి మోటార్‌సైకిల్ టీవీఎస్ రైడర్ 125 (TVS Raider 125) ని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో దీని ప్రారంభ ధర రూ. 77,500 (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ప్రస్తుతం ఇది టీవీఎస్ నుండి లభిస్తున్న ఏకైక 125 సిసి మోటార్‌సైకిల్.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

టీవీఎస్ రైడర్ 125 డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్‌తో దీనిని రూపొందించారు. ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఎల్ఈడి హెడ్‌లైట్స్, ఎల్ఈడి టెయిల్ లైట్స్ మరియు హాలోజెన్ టర్న్ ఇండికేటర్స్, 6-స్పోక్ 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్, స్ప్లిట్ సీట్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్ వంటి అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

TVS Jupiter 125 సిసి స్కూటర్ వస్తోంది.. ఆక్టోబర్‌లో విడుదల!

ఇంకా ఇందులో 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజన్ సంప్ గార్డ్, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శారీ గార్డ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్‌తో టిఎఫ్‌టి డిస్‌ప్లే యూనిట్ టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్, కాల్ అండ్ మెసేజ్ నోటిఫికేషన్ అలెర్ట్, హై-స్పీడ్ అలెర్ట్, లో ఫ్యూయెల్ అసిస్టెన్స్ మరియు డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

Most Read Articles

English summary
Tvs plans to launch new jupiter 125 cc scooter in india soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X