కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

ప్రముఖ బైక్ మరియు స్కూటర్ తయారీ సంస్థ TVS Motor ఇటీవల దేశీయ మార్కెట్లో కొత్త TVS Raider అనే కమ్యూటర్ బైక్ విడుదల చేసింది. మార్కెట్లో విడుదలైన కొత్త TVS Raider బైక్ ప్రారంభ ధర రూ. 77,500. ఈ బైక్ విడుదల వెంటనే కంపెనీ బుకింగ్స్ కూడా స్వీకరించడం ప్రారంభించింది. ఇప్పుడు కంపెనీ ఈ బైక్ డెలివరీలు కూడా ప్రారంభించింది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

కంపెనీ ఇటీవల TVS Raider యొక్క మొదటి యూనిట్ ని ఘజియాబాద్‌లో ఒక యోగా మాస్టర్ కి డెలివరీ చేసినట్లు తెలిపింది. ఈ బైక్ ప్రస్తుతం రెండు వేరియంట్లలో విడుదలైంది. ఇందులో ఒకటి డ్రమ్ వేరియంట్ కాగా మరొకటి డిస్క్ వేరియంట్. డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 77,500 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

TVS Raider భారతదేశంలో 125 సిసి సెగ్మెంట్‌లో కంపెనీకి ఉన్న ఏకైక బైక్. కంపెనీ ఈ కొత్త TVS Raider బైక్ ని నాలు కలర్ ఆప్సన్ లో అందించింది. అవి ఫైరీ ఎల్లో, స్ట్రైకింగ్ రెడ్, బ్లేజింగ్ బ్లూ మరియు వికెడ్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి. ఈ బైక్‌లో కంపెనీ ఎకో మరియు పవర్ అనే రెండు రైడ్ మోడ్‌లను అందించింది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

TVS Raider అద్భుతమైన డిజైన్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ ని యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది, ఇందులో LED లైటింగ్ మరియు స్ప్లిట్ LED DRL లు ఉన్నాయి. మోటార్‌సైకిల్ వెనుక భాగంలో స్ప్లిట్ LED టెయిల్‌ల్యాంప్ కూడా ఉంది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

ఈ బైక్ లో 10 లీటర్ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బైక్ ని చాల ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

TVS Raider 125 సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా పరిగణించి కంపెనీ అనేక టెక్నాలజీలు నిక్షిప్తం చేసింది. ఇందులో రైడర్ కి కావాల్సిన అని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్-స్పెక్ వేరియంట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచెస్ TFT స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది బ్రాండ్ యొక్క SmartXConnect కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. అయితే ఇందులోని లో వేరియంట్ నెగిటీవ్ LCD యూనిట్‌తో అందించబడుతుంది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

కంపెనీ యొక్క రెండు యూనిట్లు రైడర్‌కు తగినంత మొత్తంలో సమాచారాన్ని అందిస్తాయి. కావున ఇందులో మల్టిపుల్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంజిన్ సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఇండికేటర్, టైమ్, టాకోమీటర్, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ మరియు ఫ్యూయెల్ రేంజ్ వంటివి ప్రదర్శిస్తుంది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

ఇందులో TFT డిస్‌ప్లే వంటి మరింత సమాచారాన్ని అందించడానికి TVS నుండి అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్, కాల్ మేనేజ్మెంట్, మెసేజ్ నోటిఫికేషన్ అలెర్ట్, హై-స్పీడ్ అలెర్ట్, లో ఫ్యూయెల్ అసిస్టెన్స్ మరియు డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

TVS Raider బైక్ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 124.8 సీసీ ఇంజిన్‌తో ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇంజిన్ ఒక టచ్ స్టార్ట్ ఎనేబుల్ చేయడానికి స్టార్టర్ జెనరేటర్ మరియు మెరుగైన ఇంధన సామర్ధ్యం కోసం ఐడిల్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది రెండు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంది. అవి ఎకో మరియు స్పోర్ట్స్ మోడ్స్.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

TVS Raider బైక్ లోని ఇంజిన్‌ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

కొత్త Raider బైక్ డెలివరీలు షురూ చేసిన TVS Motor

TVS Raider అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందుభాగంలో 30 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోశాక్ విత్ 5 స్టెప్ ప్రీ లోడ్ అడ్జస్ట్ ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయంలోకి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇవి చాల అద్భుతంగా పనిచేస్తాయి.

Most Read Articles

English summary
Tvs raider 125 delivery starts first unit delivered in ghaziabad details
Story first published: Saturday, September 18, 2021, 19:41 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X