భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ TVS Motor దేశీయ మార్కెట్లో కొత్త Raider 125 సీసీ మోటార్‌సైకిల్‌ని విడుదల చేసింది. ఈ కొత్త TVS Raider ప్రారంభ ధర రూ. 77,500 (ఎక్స్-షోరూమ్). కొత్త ప్రీమియం కమ్యూటర్ మోటార్‌సైకిల్ ఎక్స్ వేరియంట్‌లలో అందించబడింది. కంపెనీ యొక్క టాప్ ట్రిమ్‌తో బ్రాండ్ యొక్క స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ ఉంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

TVS Raider నాలుగు కలర్ ఆప్సన్స్ లో లభిస్తుంది.

అవి:

  • ఫైరీ ఎల్లో
  • స్ట్రైకింగ్ రెడ్
  • వికెడ్ బ్లాక్
  • బ్లేజింగ్ బ్లూ కలర్స్
  • భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    TVS Raider అద్భుతమైన డిజైన్ లో చాలా స్టైలిష్ గా ఉంటుంది. కంపెనీ ఈ బైక్ ని యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని విడుదల చేసింది. ఈ మోటార్‌సైకిల్ ముందు భాగంలో డిస్‌క్టివ్ హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంది, ఇందులో LED లైటింగ్ మరియు స్ప్లిట్ LED DRL లు ఉన్నాయి. మోటార్‌సైకిల్ వెనుక భాగంలో స్ప్లిట్ LED టెయిల్‌ల్యాంప్ కూడా ఉంది.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    ఈ బైక్ లో 10 లీటర్ డ్యూయల్ టోన్ ఫ్యూయల్ ట్యాంక్, సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, డ్యూయల్ టోన్ ఫ్రంట్ మడ్‌గార్డ్, క్రాష్ ప్రొటెక్టర్లు, ఇంజిన్ సంప్ గార్డ్, స్ప్లిట్-సీట్లు, అప్-స్వీప్డ్ ఎగ్జాస్ట్, శ్యారీ గార్డ్, 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ మరియు హాలోజన్ టర్న్-సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా బైక్ ని చాల ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    TVS Raider 125 సీసీ కమ్యూటర్ మోటార్‌సైకిల్‌గా పరిగణించి కంపెనీ అనేక టెక్నాలజీలు నిక్షిప్తం చేసింది. ఇందులో రైడర్ కి కావాల్సిన అని ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్-స్పెక్ వేరియంట్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 5 ఇంచెస్ TFT స్క్రీన్‌ను కలిగి ఉంది, ఇది బ్రాండ్ యొక్క SmartXConnect కనెక్ట్ టెక్నాలజీని కలిగి ఉంది. అయితే ఇందులోని లో వేరియంట్ నెగిటీవ్ LCD యూనిట్‌తో అందించబడుతుంది.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    కంపెనీ యొక్క రెండు యూనిట్లు రైడర్‌కు తగినంత మొత్తంలో సమాచారాన్ని అందిస్తాయి. కావున ఇందులో మల్టిపుల్ ట్రిప్ మీటర్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, ఇంజిన్ సైడ్-స్టాండ్ కట్-ఆఫ్ ఇండికేటర్, టైమ్, టాకోమీటర్, యావరేజ్ ఫ్యూయెల్ ఎఫిషియన్సీ మరియు ఫ్యూయెల్ రేంజ్ వంటివి ప్రదర్శిస్తుంది.

    ఇందులో TFT డిస్‌ప్లే వంటి మరింత సమాచారాన్ని అందించడానికి TVS నుండి అప్లికేషన్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అవుతుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, వాయిస్ అసిస్ట్, కాల్ మేనేజ్మెంట్, మెసేజ్ నోటిఫికేషన్ అలెర్ట్, హై-స్పీడ్ అలెర్ట్, లో ఫ్యూయెల్ అసిస్టెన్స్ మరియు డిజిటల్ డాక్యుమెంట్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    TFT డిస్‌ప్లే సౌలభ్యం కోసం డే అండ్ నైట్ మోడ్‌లతో పాటు ఆటో-బ్రైట్‌నెస్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంది.అంతే కాకుండా TVS రైడర్లు వారి విలువైన వస్తువులను భద్రపరచడానికి పిలియన్ సీటు కింద మంచి మొత్తంలో స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంటుంది. ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    TVS Raider బైక్ ఎయిర్ అండ్ ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ 124.8 సీసీ ఇంజిన్‌తో ఐదు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఇంజిన్ ఒక టచ్ స్టార్ట్ ఎనేబుల్ చేయడానికి స్టార్టర్ జెనరేటర్ మరియు మెరుగైన ఇంధన సామర్ధ్యం కోసం ఐడిల్ స్టాప్/స్టార్ట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది. ఇది రెండు రైడింగ్ మోడ్స్ కలిగి ఉంది. అవి ఎకో మరియు స్పోర్ట్స్ మోడ్స్.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    TVS Raider బైక్ లోని ఇంజిన్‌ 7,500 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 11.2 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 11.2 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ కి జత చేయబడి ఉంటుంది. ఇది కేవలం 5.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గంటకు 99 కిమీ.

    TVS Raider అద్భుతమైన సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది, ఈ బైక్ ముందుభాగంలో 30 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోశాక్ విత్ 5 స్టెప్ ప్రీ లోడ్ అడ్జస్ట్ ఉంటుంది.

    భారత్‌లో విడుదలైన కొత్త TVS Raider; ధర, ఫీచర్స్ మరియు వివరాలు

    ఇక బ్రేకింగ్ విషయంలోకి వస్తే, ఈ బైక్ ముందు భాగంలో 240 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఉన్నాయి. ఇవి చాల అద్భుతంగా పనిచేస్తాయి.

    TVS Raider భారతదేశంలో లాంచ్ చేయబడిన అత్యంత అధునాతన 125 సిసి మోటార్‌సైకిళ్లలో ఒకటి. దేశంలో యువ కొనుగోలుదారులను ఆకర్షించడానికి కంపెనీ కొత్త 125 సీసీ మోటార్‌సైకిల్ ని ప్రీమియం స్టైలింగ్, ఫీచర్లు మరియు ఆధునిక టెక్నాలజీని వంటి వాటితో లాంచ్ చేసింది. ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, September 16, 2021, 11:42 [IST]
English summary
Tvs raider launched in india price specs engine connected technology more details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+