TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

దేశీయ టూవీలర్ బ్రాండ్ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) 125 సిసి మోటార్‌సైకిల్ విభాగంలో ఓ కొత్త కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కంపెనీ తమ సోషల్ మీడియా ఛానెల్‌ లో ఓ టీజర్ ను కూడా విడుదల చేసింది. ఈ టీజర్‌లో కంపెనీ తమ సరికొత్త మోటార్‌సైకిల్ ను సెప్టెంబర్ 16వ తేదీన మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెలిపింది.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

టీవీఎస్ నుండి రానున్న ఈ కొత్త 125 సిసి మోటార్‌సైకిల్ ను టీవీఎస్ రైడర్ (TVS Raider) అని పిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం, టీవీఎస్ బ్రాండ్ నుండి 125 సిసి విభాగంలో ఓ స్కూటర్ (TVS Ntorq) మాత్రమే అందుబాటులో ఉంది. మోటార్‌సైకిల్ విభాగంలో ఎలాంటి ఉత్పత్తి అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, కొత్తగా వస్తున్న 125 సిసి టీవీఎస్ రైడర్ మోటార్‌సైకిల్ పై మార్కెట్లో భారీ అంచనాలు ఉన్నాయి.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

వాస్తవానికి, టీవీఎస్ మోటార్ కంపెనీ 125 సిసి విభాగంలో స్టార్ సిటీ 125 మరియు విక్టర్ 125 మోడళ్లను భారతదేశంలో తయారు చేస్తున్నప్పటికీ, కంపెనీ వాటిని కేవలం ఎగుమతి మార్కెట్లకు మాత్రమే పరిమితం చేసింది. అయితే, భారత టూవీలర్ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కమ్యూటర్ మోటార్‌సైకిళ్లలో 125 సిసి మోడళ్లు కూడా ఎక్కువగా ఉన్నాయి.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

ఈ నేపథ్యంలో, 125 సిసి విభాగంలోని అవకాశాలను క్యాష్ చేసుకునేందుకు చెన్నైకి చెందిన ఈ టూవీలర్ బ్రాండ్ తమ సరికొత్త రైడర్ 125 బైక్ ను సిద్ధం చేసింది. ఈ మోటార్‌సైకిల్ 125 సిసి ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ ను పొందే అవకాశం ఉంది. ఇది ఈ విభాగంలో ఆదిపత్యం చలాయిస్తున్న బజాజ్ పల్సర్ 125 (Bajaj Pulsar 125) మరియు హోండా సిబి షైన్ ఎస్‌పి (Honda CB Shine SP) వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుందని అంచనా.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

ప్రస్తుతానికి, ఈ కొత్త టీవీఎస్ 125 సిసి మోటార్‌సైకిల్ కు సంబంధించిన వివరాలు చాలా పరిమితంగా ఉన్నాయి. మాకు అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కంపెనీ ఈ కమ్యూటర్ మోటార్‌సైకిల్ ను పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌ పై తయారు చేసే అవకాశా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త బైక్ కోసం కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో కొన్ని డిజైన్ డీటేలింగ్స్ అస్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఈ టీజర్ సూచించిన వివరాల ప్రకారం, కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ ముందు భాగంలో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, త్రీ పాడ్ హెడ్‌లైట్ క్లస్టర్, తక్కువ హైట్ తో కూడిన సీట్, అల్లాయ్ వీల్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, మోనో-షాక్ రియర్ సస్పెన్షన్ సెటప్ మరియు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

ఓవరాల్ గా చూస్తే ఈ బైక్ చాలా మోడ్రన్ డిజైన్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ లో మరింత ఆధునిక ఆకర్షణను అందించడానికి, టీజర్‌లో చూపిన విధంగా ఇది పూర్తిగా డిజిటల్ రివర్స్ డిస్‌ప్లేను కూడా పొందే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఇంధన ట్యాంక్‌పై కేంద్రంగా ఉంచబడిన బ్లాక్ స్ట్రిప్ కూడా చూడొచ్చు. ఇది చాలా స్పోర్టీ అప్పీల్ ను ఇశ్తుంది.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

ఇంజన్ విషయానికి వస్తే, టీవీఎస్ ఇప్పటికే ఎగుమతి మార్కెట్ల కోసం ఉపయోగిస్తున్న 125 సిసి ఇంజన్ నే కంపెనీ ఈ కొత్త కమ్యూటర్ మోటార్‌సైకిల్ లో కూడా ఉపయోగించవచ్చని సమాచారం. ఈ ఇంజన్ గరిష్టంగా 10 బిహెచ్‌పి పవర్ ను మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ (1-డౌన్ మరియు 4-అప్‌) తో జతచేయబడే అవకాశం ఉంది.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

టీవీఎస్ రైడర్ 125 సిసి బైక్ విడుదల సమయంలో ఈ కొత్త మోటార్‌సైకిల్ కు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. సెప్టెంబర్ 16న ఇది మార్కెట్లోకి రానుంది. మార్కెట్ అంచనా ప్రకారం, ఈ కొత్త మోటార్‌సైకిల్ ధరలు సుమారు రూ. 80,000 నుండి రూ. 90,000 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

TVS Raider 125cc బైక్ వస్తోంది.. సెప్టెంబర్ 16న విడుదల!

TVS Apache RTR 165 RP పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు..

ఇదిలా ఉంటే, టీవీఎస్ ఇటీవల ఓ కొత్త 160 సిసి బైక్ కోసం ఓ కొత్త పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. కంపెనీ అత్యంత పాపులర్ అయిన అపాచీ సిరీస్ లో 'TVS Apache RTR 165 RP' (టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 165 ఆర్‌పి) మరియు 'TVS RP Race Performance' (టీవీఎస్ ఆర్‌పి రేస్ పెర్ఫార్మెన్స్) అనే పేర్లను కంపెనీ ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరుతో కంపెనీ సరికొత్త పెర్ఫార్మెన్స్ వెర్షన్ అపాచీ విడుదల చేయవచ్చని సమాచారం. - దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tvs teases new 125cc motorcycle raider all the details you need to know
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X