హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

ప్రముఖ వాహనతయారీదారు అయిన టీవీఎస్ కంపెనీ యొక్క అత్యంత ప్రాచుర్యం పొందిన బైకులలో టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ ఒకటి ఇది పట్టన ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. సాధారణంగా ఈ మోపెడ్ ఎక్కువ బరువును మరియు పరికరాలను తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు. కావున గ్రామాల్లో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది.

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

ప్రపంచవ్యాప్తంగా అత్యంత లగ్జరీ మరియు అత్యంత ఖరీదైన బైకులతో హార్లే-డేవిడ్సన్ ఒకటి. ఈ బైక్స్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. హార్లే-డేవిడ్సన్ కంపెనీ బైక్‌లు చాలా ఖరీదైనవి. కావున బాగా డబ్బున్న వారు తప్ప సామాన్యుడు వీటిని కొనలేడు, కావున ఇటీవల ఒక వ్యక్తి తన టివిఎస్ ఎక్స్ఎల్ మోపెడ్ ని ఏకంగా హార్లే-డేవిడ్సన్ 48 బైక్ గా మార్చారు.

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

సుడస్ కస్టమ్స్ అనేది వాహనాలను మాడిఫై చేయడానికి ప్రసిద్ధి చెందింది. ఈ సుడస్ కస్టమ్స్ ఇప్పటికే జీప్ మరియు ఫోక్స్‌వ్యాగన్ కార్లను మాడిఫై చేసింది. అయితే ఇదే నేపథ్యంలో ఇటీవల సుడస్ కస్టమ్స్ సాధారణ టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్‌ను హార్లే-డేవిడ్సన్ 48 బైక్‌గా మాడిఫై చేసింది.

MOST READ:కోట్ల విలువ చేసే కారు నడి రోడ్డులో కాలిపోయింది.. కారణం ఏమంటే?

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సుడస్ కస్టమ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ హార్లే-డేవిడ్సన్ 48 బైక్ కంటే చిన్నదిగా ఉంటుంది. అయితే ఈ ఎక్స్‌ఎల్ మోపెడ్‌లో చేర్చబడిన చాలా యాక్ససరీస్ చేతితో తయారు చేసినవి. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంది.

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ మాడిఫైడ్ బైక్ లో ఎల్లో పెట్రోల్ ట్యాంక్ హార్లే-డేవిడ్సన్ 48 బైక్ ఎటువంటి ఇంజిన్ సహాయం లేకుండా రూపొందించబడింది. కావున ఈ పెట్రోల్ ట్యాంక్‌ను సులభంగా విడదీయవచ్చు మరియు తిరిగి కలపవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం మొత్తం ఈ వీడియోలో చెప్పబడింది.

MOST READ:మీకు తెలుసా.. అంతర్రాష్ట్ర ప్రయాణానికి ఈ టెస్ట్ అవసరం లేదు

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ బైక్ యొక్క రెండు వైపులా సైడ్ బాక్స్ అమర్చబడి ఉంటుంది. ఇవి కూడా కస్టమైజ్ చేయబడ్డాయి. అంతే కాకుండా ఇందులో కస్టమ్ రియర్ ఫెండర్ మరియు ఫ్రంట్ మడ్‌గార్డ్ కూడా కస్టమైజ్ చేయబడ్డాయి. ఈ బైక్‌లో ఒకరు మాత్రమే కూర్చోవడానికి అనుకూలంగా మాడిఫై చేయబడింది.

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ విధంగా మాడిఫై చేయడం వల్ల ఇందులో ఉన్న వెనుక సీట్ తొలగించబడింది. ఈ బైక్ లో ముఖ్యంగా ఇంజిన్ భాగం చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్‌లో ఇంజన్ ఫైబర్ పూతతో ఉంటుంది. హార్లే-డేవిడ్సన్ బైక్‌ల మాదిరిగానే, ఈ మాడిఫైడ్ బైక్ యొక్క ఇంజిన్ భాగానికి వి డ్యూయల్ షేప్ ఇవ్వబడుతుంది.

MOST READ:మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఇప్పుడు 22 ఇంచెస్ అల్లాయ్ వీల్‌తో

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

ఈ ఆకారం ఉండటం వల్ల నిజంగా చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మాడిఫైడ్ ఎక్స్‌ఎల్ మోపెడ్‌లో రెండు ఎగ్జాస్ట్ పైప్స్ ఇవ్వబడ్డాయి. కావున చూడటానికి హార్లే-డేవిడ్సన్ బైక్ లాగా ఉంటుంది. ఇందులో ఏర్పాటు చేయబడిన ఈ రెండు ఎగ్జాస్ట్ పైప్స్ లో ఒకటి మాత్రమే పనిచేస్తుంది. ఇంకొకటి పనిచేయదు. అంటే ఇది డమ్మీ అన్నమాట.

ఈ బైక్‌పై రెట్రో లుక్ కోసం టీవీఎస్ 100 బైక్‌లపై అందించే సింగిల్ ప్యాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించబడింది. ఈ బైక్ వెనుక భాగంలో ప్రస్తుతం స్టాప్ లైట్ లేదు. ఈ బైక్‌లో త్వరలో స్టాప్ లైట్ అమర్చనున్నట్లు వీడియోలో పేర్కొన్నారు.

MOST READ:కరోనా రోగుల కోసం కార్లనే మొబైల్ హాస్పిటల్స్‌గా మార్చిన యువకులు

హార్లే-డేవిడ్సన్ బైక్‌గా మారిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. నమ్మకపోతే వీడియో చూడండి

టీవీఎస్ ఎక్స్‌ఎల్ మోపెడ్ బైక్ ని హార్లే-డేవిడ్సన్ బైక్‌ను తయారు చేయడానికి ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. కానీ మోపెడ్ యజమాని ఈ మోపెడ్ తయారీకి ఎంత డబ్బు ఖర్చు చేశారో అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పలేదు. ఏది ఏమైనా ఈ మాడిఫైడ్ బైక్ చాలా అద్భుతంగా అచ్చం హార్లే-డేవిడ్సన్ బైక్‌ లాగా ఉంది.

Image Courtesy: sudus custom

Most Read Articles

English summary
TVS XL Moped Modified Like Harley Davidson 48 Bike. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X