సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) గడచిన సెప్టెంబర్ 2021 నెల మోడల్ వారీ విక్రయాల వివరాలను వెల్లడి చేసింది. ఆశ్చర్యకరంగా గత నెలలో టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ (TVS XL SUper) అమ్మకాల పరంగా మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో జూపిటర్, అపాచీ, ఎన్‌టార్క్, రేడియాన్ మరియు స్పోర్ట్ మోడళ్లు ఉన్నాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

గత నెలలో కొన్ని మోడళ్ల విక్రయాల్లో క్షీణత ఉన్నప్పటికీ, చాలా మోడళ్ల అమ్మకాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఈ సమయంలో, టీవీఎస్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ (iQube) బాగా అమ్ముడవుతోంది. టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ అమ్మకాల విషయానికి వస్తే, గడచిన సెప్టెంబర్ 2021 నెలలో ఈ మోడల్ అమ్మకాలు 61,664 యూనిట్లుగా నమోదై, బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

గతేడాది ఇదే సమయంలో (సెప్టెంబర్ 2020 లో) టీవీఎస్ ఎక్స్ఎల్ సూపర్ అమ్మకాలు 68,929 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఈ మోపెడ్ అమ్మకాలు 11 శాతం క్షీణతను నమోదు చేశాయి. అయినప్పటికీ, ఇది గత నెలలో మొదటి స్థానంలో ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ కొంతకాలం క్రితమే ఇందులో అప్‌డేటెడ్ మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ కొత్త మోడల్ రాతో దీని అమ్మకాలు కూడా మెరుగ్గా ఉన్నాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

ఎక్స్ఎల్ సూపర్ తర్వాత కంపెనీ నుండి అత్యధికంగా అమ్ముడైన రెండవ మోడల్ టీవీఎస్ జూపిటర్ (TVS Jupiter). హోండా యాక్టివా కు ప్రధాన పోటీదారుగా ఉండే ఈ స్కూటర్, గత నెలలో 56,339 యూనిట్లను విక్రయాలను నమోదు చేసింది. గతేడాది ఇదే సమయంలో ఈ స్కూటర్ అమ్మకాలు 56,085 యూనిట్లుగా ఉన్నాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

ఇంతకు ముందు వరకూ టీవీఎస్ జూపిటర్ స్కూటర్ కేవలం 110 సిసి ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే లభ్యమయ్యేది. కాగా, కంపెనీ ఇందులో ఇటీవలే ఓ కొత్త 125 సిసి వెర్షన్‌ను కూడా మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 125 సిసి టీవీఎస్ జూపిటర్ మోడల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత, దాని అమ్మకాలు మరింత పెరుగుతాయని భావిస్తున్నారు. మరి రానున్న నెలల్లో ఇవి ఎంత వరకు పెరుగుతాయో చూడాలి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

అమ్మకాల పరంగా, జూపిటర్ తర్వాత మూడవ స్థానంలో ఉన్నది టీవీఎస్ అపాచే సిరీస్ మోటార్‌సైకిళ్లు. గత సెప్టెంబర్ నెలలో కంపెనీ మొత్తం 40,661 యూనిట్ల టీవీఎస్ అపాచే మోటార్‌సైకిళ్లను విక్రయించింది, ఇది గత సంవత్సరం ఇదే నెలలో (సెప్టెంబర్ 2020లో) విక్రయించిన 37,788 యూనిట్లతో పోలిస్తే 8 శాతం పెరిగింది.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

గత నెలలో విక్రయాలలో టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్ అమ్మకాలు 29,452 యూనిట్లు గా నమోదయ్యాయి. ఇవి గత సంవత్సరం కంటే 13 శాతం ఎక్కువ. సెప్టెంబర్ నెలలో టీవీఎస్ స్పోర్ట్ అమ్మకాలు 14,650 యూనిట్లుగా ఉన్నాయి. ఇవి గత ఏడాది సెప్టెంబర్‌ లో విక్రయించిన 14,142 యూనిట్లతో పోలిస్తే 4 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

గత నెలలో టీవీఎస్ రేడియాన్ అమ్మకాలు 13,296 యూనిట్లుగా ఉన్నాయి. గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన 12,859 యూనిట్ల కంటే ఇవి 3 శాతం ఎక్కువ. అలాగే, గత నెలలో స్టార్ సిటీ 8766 యూనిట్లు, టీవీఎస్ పెప్+ 7259 యూనిట్ల మరియు రైడర్ 7057 యూనిట్ల అమ్మకాలను నమోదు చేశాయి. వీటి తర్వాత టీవీఎస్ జెస్ట్ స్కూటర్ సెప్టెంబర్ నెలలో 3837 యూనిట్లను విక్రయించింది.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

ఇక చివరిగా, కంపెనీ యొక్క ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్, టీవీఎస్ ఐక్యూబ్ గత నెలలో 766 యూనిట్ల విక్రయాలను నమోదు చేసింది. ఇవి గత సంవత్సరం ఇదే సమయంలో విక్రయించిన 7 యూనిట్ల కంటే మెరుగ్గా ఉన్నాయి. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 (TVS Apache RR 310) స్పోర్ట్స్ బైక్ అమ్మకాలు గత నెలలో 337 యూనిట్లుగా ఉన్నాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

మొత్తంగా చూసుకుంటే, గడచిన సెప్టెంబర్ 2021 నెలలో టీవీఎస్ మోటార్ కంపెనీ మొత్తం టూ వీలర్ అమ్మకాలు 3,32,511 యూనిట్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 2020 నెలలో ఇవి 3,13,332 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాలు 6 శాతం వృద్ధిని నమోదు చేశాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

ఈ సమయంలో టీవీఎస్ దేశీయ విక్రయాలను గమనిస్తే, కంపెనీ సెప్టెంబర్ 2021లో దేశీయ మార్కెట్లో 2,44,084 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది సెప్టెంబర్‌ 2020లో ఇవి 2,41,762 యూనిట్ల బైక్‌లు మరియు స్కూటర్‌లు విక్రయించబడ్డాయి. ఇక ఎగుమతుల విషయానికి వస్తే, గత నెలలో కంపెనీ 1,02,259 యూనిట్లను ఎగుమతి చేయగా, సెప్టెంబర్ 2020 లో ఇవి 85,163 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో ఎగుమతులు 20 శా వృద్ధిని నమోదు చేశాయి.

సెప్టెంబర్ 2021 నెల అమ్మకాలలో సత్తా చాటిన 'మన ఊరి బండి' TVS XL

కొత్త TVS Jupiter 125 విడుదల, ధర రూ. 73,400

ఇదిలా ఉంటే, టీవీఎస్ దేశీయ మార్కెట్లో తమ కొత్త Jupiter 125 స్కూటర్ విడుదల చేసింది. భారత మార్కెట్లో విడుదలైన కొత్త TVS Jupiter 125 ధర రూ. 73,400 (ఎక్స్-షోరూమ్) గా ఉంది. కంపెనీ ఈ కొత్త స్కూటర్ ని ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో రూపొందించింది. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tvs xl super tops in september sales model wise sales report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X