Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

భారతీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది, ఈ నేపథ్యంలో భాగంగానే అనేక కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ విఫణిలోకి విడుదల చేసి మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో కర్ణాటక రాజధాని నగరం బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను మార్కెట్లో విడుదల చేయడానికి తగిన సన్నాహాలను సిద్ధం చేస్తుంది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

ఇప్పటికే భారతదేశంలోని చాలా స్టార్టప్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు సాధారణంగా నెమ్మదిగా మరియు తక్కువ శక్తివంతమైనవిగా అని ఊహిస్తారు, కానీ ఈ ఊహ నిజం కాదని నిరూపించడానికి ఈ సంస్థ పుట్టుకొచ్చింది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు Ultraviolette (అల్ట్రావయోలెట్) ఎలక్ట్రిక్ పెర్ఫార్మెన్స్ బైక్ F77ను పరిచయం చేసింది. ఈ కొత్త పవర్ పుల్ బైక్ సాధారణ బైకులకు ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది. అంటే ఈ బైక్ స్టాండర్డ్ బైక్స్ అందించే పర్ఫామెన్స్ అందిస్తుంది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

కంపెనీ ఈ కొత్త Ultraviolette F77 బైక్ ని వచ్చే ఏడాది మార్చి నుంచి విక్రయించే అవకాశం ఉంది. కావున ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ని కంపెనీ టెస్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. మీరు ఇక్కడ ఆ వీడియో చూడవచ్చు.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

Ultraviolette F77 బైక్ ఒక ప్రోటోటైప్ బైక్ మోడల్. కాతుం ఈ బైక్ మోడల్ యొక్క రూపకల్పన కూడా సాధారణ బైకులకంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయినప్పటికి ఈ బైక్ చూడటానికి ఆకర్షనీయంగా ఉంటుంది. ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలు అందుబాటులో ఉంటాయి.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

Ultraviolette F77 బైక్ యొక్క పర్ఫామెన్స్ విషయానికి వస్తే, ఈ బైక్‌ను గరిష్టంగా గంటకు 140 కిమీ వేగంతో రైడ్ చేయవచ్చు. అంతే కాకూండా ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిమీ / గం వరకు వేగవంతం అవుతుంది. Ultraviolette F77 బైక్ ఒక పూర్తి ఛార్జింగ్‌తో 150 కి.మీల పరిధిని అందిస్తుంది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

ఈ బైక్‌ మరింత పరిధిని అందించడానికి కంపెనీ సన్నాహాలు చేస్తుంది. బైక్ గరిష్టంగా 4.2 కిలోవాట్ సామర్థ్యం కలిగిన త్రీ లిథియం-అయాన్ బ్యాటరీలతో శక్తిని పొందుతుంది. ఈ బైక్ యొక్క ఎలక్ట్రిక్ మోటార్ 2,250 ఆర్‌పిఎమ్ వద్ద 33.5 బిహెచ్‌పి పవర్ మరియు 99 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

Ultraviolette F77 బైక్‌లో స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌ను ఉపయోగించారు, మధ్యలో ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. బైక్ ముందు భాగంలో USD ఫోర్క్ సస్పెన్షన్‌ను ఉపయోగిస్తుండగా, వెనుకవైపు అడ్జస్టబుల్ మోనో షాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంది. ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

ఈ బైక్ లైటింగ్, లేజర్ మరియు షాడో అనే మూడు వేరియంట్‌లలో విడుదల చేయబడింది. మూడు బైక్‌ల ఫీచర్లు ఒకేలా ఉన్నప్పటికీ వాటి డిజైన్‌లో మాత్రం కొంత తేడా ఉంది. బైక్‌లో చాలా తక్కువ బాడీ గ్రాఫిక్స్ ఉపయోగించారు. ఈ బైక్ ఆన్-రోడ్ ధర రూ. 3 లక్షల నుంచి రూ. 3.25 లక్షల(బెంగళూరు) వరకు ఉండే అవకాశం ఉంటుంది.

Ultraviolette F77 బైక్ లో LTE ఇంటిగ్రేటెడ్ e-SIM వంటి స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు అందించబడ్డాయి. టెంపరేచర్ సెన్సార్, యాక్టివ్ ట్రాకింగ్, షాక్ ఇంపాక్ట్ సెన్సార్ మరియు పనితీరు మార్పు వంటి స్మార్ట్ ఫీచర్లు బైక్‌లో అందించబడ్డాయి. Ultraviolette F77 బైక్ భారతదేశపు మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ ఎలక్ట్రిక్ బైక్ కానుంది.

Ultraviolette F77 బైక్ పర్ఫామెన్స్ టెస్టింగ్ వీడియో వచ్చేసింది.. చూసారా..!!

భారతీయ మార్కెట్లో ప్రస్తుతం, ఈ ఫీచర్స్ కలిగిన మరియు ఈ ధరలో మరే ఇతర ఎలక్ట్రిక్ బైక్ అందుబాటులో లేదు. కావున ఈ బైక్ దేశీయ మార్కెట్లో ఒక్కసారి విడుదలైతే తప్పకుండా మంచి ఆదరణ పొందే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నాము. అంతే కాకుండా దేశీయ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతున్న ఇంధన ధరలు సామాన్య మానవులపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి, దీనిపై ప్రభుత్వాలు కూడా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు, కావున భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలే మార్కెట్లో చెలామణి అయ్యే అవకాశం ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 26, 2021, 18:28 [IST]
English summary
Ultraviolette f77 electric bike testing video details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+