రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుడంటే..

ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తున్నది మరియు కనిపిస్తున్నది ఎలక్ట్రిక్ టూవీలర్స్ మరియు ఎలక్ట్రిక్ కార్స్. ఎంతకూ దిగిరాని పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో, ఇటు ప్రజలు మరియు అటు వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపుతున్నారు.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

ఇప్పటికే, దేశంలో అనేక కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్లు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని లో-స్పీడ్ సిటీ రైడ్ ఎలక్ట్రిక్ టూవీలర్లు కాగా, మరికొన్ని హై-స్పీడ్ హైవే రైడ్ కోసం డిజైన్ చేయబడినవి. అలాగే, కొన్ని లాస్ట్-మైల్ కనెక్టివిటీ కోసం మరియు కార్గో డెలివరీ కోసం తయారు చేయబడ్డాయి.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

అయితే, మనదేశంలో పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఇప్పటి వరకూ ఎలాంటి మోడల్ అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో, ఈ విభాగంలోకి కొత్త ప్రవేశించబోతోంది బెంగుళూరుకి చెందిన ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ (Ultraviolette Automotive) సంస్థ.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) సహకారంతో, ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ సంస్థ రూపొందించిన మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ 'ఆల్ట్రావైలెట్ ఎఫ్77' (Ultraviolette F77) ను కంపెనీ తాజాగా ఆవిష్కరించింది. మరి దీని విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

Ultraviolette F77 భారతదేశంలోనే మొట్టమొదటి పెర్ఫార్మెన్స్ ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ గరిష్ట వేగం (టాప్ స్పీడ్) గంటకు 147 కిలోమీటర్లుగా ఉంటుంది మరియు కేవలం 7.5 సెకన్లలో గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

ఈ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ ఫ్లాష్, షాడో మరియు లేజర్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎయిర్-కూల్డ్, బ్రష్ లెస్ డిఎమ్ ఎలక్ట్రిక్ మోటార్ ను ఉపయోగించారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి శక్తిని మరియు 450 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 మోటార్‌సైకిల్ లో ఎకో, స్పోర్ట్ మరియు ఇన్‌సేన్ అనే మూడు రైడింగ్ మోడ్‌ లు ఉంటాయి. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, స్టాండర్డ్ ఛార్జర్ ద్వారా దీనిని పూర్తిగా చార్జ్ చేయటానికి 5 గంటల సమయం పడుతుంది. అదే ఫాస్ట్ చార్జర్ ద్వారా అయితే, కేవలం 50 నిమిషాల్లో 80 శాతం వరకు మరియు 90 నిమిషాల్లో 100 శాతం వరకూ ఛార్జ్ చేసుకోవచ్చు.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

అలాగే, రేంజ్ విషయానికి వస్తే, Ultraviolette F77 పూర్తి చార్జ్ పై గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకూ రేంజ్ ను ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో రైడ్ డయాగ్నోస్టిక్స్‌తో పాటు ఓవర్ ది ఎయిర్ అప్‌గ్రేడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు బైక్ లైవ్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన పూర్తి టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ ఉంటుంది. స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడిన Ultraviolette F77 ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ ప్రీలోడెడ్ అడ్జస్టబల్ మోనో షాక్‌ అబ్జార్వర్ ఉంటాయి.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు 420 పిస్టన్ కాలిపర్ మరియు వెనుక బాగంలో 230 మిమీ డిస్క్ మరియు పిస్టన్ కాలిపర్‌ లు ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్ కాబట్టి, ఇది స్టీల్-బ్రాండెడ్ బ్రేక్ లైన్లు మరియు 110/70 R17 ఫ్రంట్ టైర్ మరియు 150/60 R17 రియర్ టైర్ ను కలిగి ఉంటుంది.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

సాధారణంగా ఇలాంటి కాన్ఫిగరేషన్లు ఈ కేటగిరీలో అందుబాటులో పెట్రోలె వెర్షన్ స్పోర్ట్స్ బైక్ లలో కనిపిస్తుంటాయి. ఈ రెండు డిస్క్ బ్రేక్ లు కూడా స్టాండర్డ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ను కలిగి ఉంటాయి. ఇక ధర విషయానికి వస్తే, మార్కెట్లో దీని ధర సుమారు రూ.3 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

Ultraviolette F77 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ మార్చి 2022 లో మార్కెట్లోకి వస్తుందని కంపెనీ ప్రకటించింది. అయితే, దీని ఉత్పత్తి మాత్రం వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలోనే ప్రారంభం కానుంది. అలాగే, F77 కోసం ప్రీ-ఆర్డర్లు కూడా ఈ ఏడాది చివరిలో ప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

TVS - ఆధారిత ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ తయారీదారు అయిన Ultraviolette, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఉత్పత్తి కోసం బెంగళూరు నగరంలోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో సుమారు 70,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక తయారీ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

మొదటి సంవత్సరంలో, ఈ ప్లాంట్ 15,000 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయగలదు మరియు సకాలంలో సదుపాయాల సామర్థ్యాన్ని విస్తరించుకోవటం ద్వారా ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 1.20 లక్షల యూనిట్లకు పెంచుతామని కంపెనీ తెలిపింది.

రయ్‌ని దూసుకుంటూ వస్తున్న Ultraviolette F77.. ఇండియా లాంచ్ ఎప్పుండంటే..

ఈ విషయంపై Ultraviolette Automotive వ్యవస్థాపకుడు మరియు సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం మాట్లాడుతూ.. F77 బైక్ బ్యాటరీ ప్యాక్‌తో సహా ఇందులో ఉపయోగించే 90 శాతం భాగాలను స్థానికంగానే గ్రహిస్తామని తెలిపారు. ఈ ప్లాంట్ వలన సుమారు 500 మందికి పైగా ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.

Most Read Articles

English summary
Ultraviolette f77 performance electric motorcycle india launch timeline revealed details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X