వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

2021 జూలై నెల ముగియనుంది. వాహన తయారీదారులు ఈ జులై నెలలో దేశీయ మార్కెట్లో అనేక వాహనాలను ఆవిష్కరించారు. అయితే ఈ వాహనాలు 2021 ఆగస్టు నెలలో భారత మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి. ఆగష్టు నెలలో దేశీయ మార్కెట్లో విడుదల కానున్న వాహనాలను గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్:

ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్ గా మారిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ మార్కెట్లో విడుదల కాకముందే అత్యంత ప్రజాదరణ పొందిన వాహనంగా మారింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఈ స్కూటర్ ఆగష్టు నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్స్ భారీ సంఖ్యలో జరుగుతున్నాయి. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 24 గంటల్లో ఏకంగా 1 లక్ష యూనిట్లకు పైగా బుకింగ్స్ నమోదైనట్లు కంపెనీ అధికారికంగా తెలిపింది. ఈ స్కూటర్ యొక్క ధర గురించి కూడా ఇంకా అధికారిక సమాచారం అందుబాటులో లేదు.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

బిఎమ్‌డబ్ల్యూ సి 400 జిటి:

బిఎమ్‌డబ్ల్యూ మోటొరాడ్ తన కొత్త సి 400 జిటి మ్యాక్సీ-స్కూటర్‌ను 2021 ఆగస్టు నెలలో భారత మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మ్యాక్సీ స్కూటర్ టీజర్‌ను కంపెనీ కొంతకాలం క్రితం విడుదల చేసింది. ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే, ఇది ప్రీమియం ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. కావున ఈ స్కూటర్ ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350:

దేశీయ మార్కెట్లో యువకులకు ఎంతగానో ఇష్టమైన బైకులలో ఒకటైన రాయల్ ఎన్ఫీల్డ్ తన క్లాసిక్ 350 బైక్ యొక్క కొత్త వెర్షన్ ని 2021 ఆగస్టులో విడుదల చేయనుంది. టెస్టింగ్ సమయంలో ఈ కొత్త వెర్షన్ బైక్ ఇప్పటికే చాలా సార్లు గుర్తించబడింది. ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా చాలా అప్డేటెడ్ వెర్సన్ కానుంది. ఈ కొత్త మోడల్ కొత్త ఇంజిన్, ఫ్రేమ్, ఫీచర్లు మరియు టెక్నాలజీని పొందే అవకాశం ఉంటుంది.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

సింపుల్ ఎనర్జీ:

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య భారీగా పెరిగిపోతున్న సందర్భంగా అనేక కొత్త కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో ఒకటి సింపుల్ వన్ ఎలక్ట్రిక్. ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను 2021 ఆగస్టు 15 న భారతదేశంలో విడుదల చేయనుంది.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

ప్రస్తుతం, కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి సంబంధించిన ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్ల గురించి ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. కానీ మార్కెట్లోకి ప్రవేశించిన తరువాత, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏథర్ 450 ఎక్స్, టివిఎస్ ఐక్యూబ్ మరియు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ సిగ్నల్స్:

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 కోట వెర్షన్ తో పాటు, కంపెనీ తన కొత్త క్లాసిక్ 350 సిగ్నల్స్ ను కూడా వచ్చే నెల అంటే 2021 ఆగష్టు నెలలో విడుదల చేయనుంది. ఈ బైక్ కొంతకాలం క్రితం టెస్టింగ్ సమయంలో కూడా గుర్తించబడింది. అయితే ఈ బైక్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందివ్వలేదు. దీని గురించి పూర్తి సమాచారం విడుదల సమయంలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది.

వాహన ప్రియులారా.. రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. మీకు నచ్చిన బైక్స్ ఆగష్టులో వచ్చేస్తున్నాయ్

హోండా హార్నెట్ 2.0 అడ్వెంచర్:

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ ఇండియా, తన కొత్త బైక్ హార్నెట్ 2.0 బేస్డ్ అడ్వెంచర్ బైక్‌ను వచ్చే నెలలో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ నివేదికల ద్వారా తెలుస్తుంది. దేశీయ మార్కెట్లో ఈ బైక్ విడుదలైన తరువాత, హోండా యొక్క రెడ్‌వింగ్ లైన్ నుండి విక్రయించబడుతుంది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.20 లక్షల నుండి రూ. 1.50 లక్షల వరకు ఉండే అవకాశం ఉంటుంది.

వాహనం ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ బైక్ దేశీయ మార్కెట్లో విడుదలవ్వడానికి ఇంకా ఎంతో సమయం లేదు. కావున వాహనదారులందరూ రైడింగ్ కి సిద్దమవ్వండి.

Most Read Articles

English summary
Upcoming Two Wheelers Launching In August 2021. Read in Telugu.
Story first published: Friday, July 30, 2021, 17:41 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X