Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

గత నెలలో ఇటలీలోని మిలాన్‌లో జరిగిన 2021 అంతర్జాతీయ మోటార్‌సైకిల్ షో (2021 EICMA) లో చైనా-ఆస్ట్రేలియన్ కంపెనీ అయిన 'విమోటో సోకో' (Vmoto Soco) తమ అధునాతన ఎలక్ట్రిక్ బైక్ 'విమోటో స్టాష్' (Vmoto Stash) ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, కంపెనీ ఇప్పుడు ఓ సరికొత్త స్కూటర్ కాన్సెప్ట్ ను ఆవిష్కరించి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

ఈ ఫొటోలలో కనిపిస్తున్న ఇ-స్కూటర్ కాన్సెప్ట్ మోడల్ ను ఆస్ట్రేలియాలోని బెర్తాలో ఉన్న విమోటో మరియు చైనాకు చెందిన సూపర్ సోకో సంయుక్తంగా అభివృద్ధి చేసింది. ఇరు కంపెనీలు కలిసి రూపొందించిన ఈ కొత్త కాన్సెప్ట్ మోడల్ ఇ-స్కూటర్ కు 'ఫ్లీట్ కాన్సెప్ట్ ఎఫ్01' (Fleet Concept F01) అనే పేరు పెట్టాయి. విమోటో సోకో తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని యోచిస్తోంది.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

విమోటో సోకో ఫ్లీట్ కాన్సెప్ట్ ఎఫ్01 ఎలక్ట్రిక్ స్కూటర్ ను వ్యక్తిగత ఉపయోగం కోసం కాకుండా, కేవలం వాణిజ్య వినియోగం కోసం మాత్రమే రూపొందించారు. వాణిజ్య ద్విచక్ర వాహన విభాగంలో సరుకు రవాణాను దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేశారు. ఈ ద్విచక్ర వాహనం వెనుక భాగంలో ఇచ్చిన పెద్ద లగేజ్ క్యారియర్ విభాగమే దీనికి నిదర్శనం. కార్గో మరియు సామాను లోడ్ చేయడానికి ఈ క్యారియర్ ద్విచక్ర వాహనంపై అందించబడుతుంది.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ వాహనంలో పిలియన్ రైడర్ కోసం కూడా సౌకర్యవంతమైన సీటు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా, ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం నడుస్తోంది. ఆటోమొబైల్ కంపెనీలు దశల వారీగా తమ పెట్రోల్ వాహనాలను నిలిపివేయడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం కంపెనీలు ప్రకటనలు కూడా జారీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విమోటో సోకో గ్రూప్ కొత్త ఫ్లీట్ కాన్సెప్ట్ ఎఫ్01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ మోడల్‌ను పరిచయం చేసింది.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

విమోటో సోకో ఆవిష్కరించిన ఈ సరికొత్త ఫ్లీట్ కాన్సెప్ట్ ఎఫ్01 ఎలక్ట్రిక్ స్కూటర్ ను అతి త్వరలో విక్రయానికి తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఈ స్కూటర్ వెనుక వైపు మాత్రమే కాకుండా ముందు భాగంలో కూడా గణనీయమైన లగేజ్ సామర్థ్యం ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 90 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ వాహనం 2000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌తో పనిచేస్తుంది. అయితే, దీని గరిష్ట వేగం గంటకు 45 కిమీ మాత్రమే.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

అలాగే, ఈ ఎలక్ట్రిక్ వాహనాన్ని పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తుతానికి కంపెనీ ఎలాంంటి వివరాలను విడుదల చేయలేదు. సస్పెన్షన్‌ విషయానికి వస్తే, ముందు భాగంలో సంప్రదాయ టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక బాగంలో స్వింగ్‌ఆర్మ్ సస్పెన్షన్ సెటప్ ఉన్నాయి. అదనంగా, ఉత్తమ బ్రేకింగ్ అనుభవం కోసం ఇది సిబిఎస్ (కాంబీ బ్రేకింగ్ సిస్టమ్) తో లభిస్తుంది. విమోటో ఫ్లీట్ కాన్సెప్ట్ ఎఫ్01 ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్న ఆకర్షణీయమైన ఫీచర్లు చాలానే ఉన్నాయి.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

ఇందులో సొగసైన హెడ్‌ల్యాంప్, ప్రత్యేకమైన U - ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు ప్రత్యేకంగా కనిపించే హ్యాండిల్‌బార్ ఉన్నాయి. ఇంకా ఈ బైక్‌పై పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా అందించబడుతుంది. ఫ్లీట్ కాన్సెప్ట్ F01 ఇ-స్కూటర్‌లో అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతి కోసం ముందువైపు 16-అంగుళాల చక్రాలు మరియు వెనుకవైపు 14-అంగుళాల వీల్స్ ఉపయోగించారు. వీటిపై పట్టణ రహదారులను తట్టుకోగల సామర్థ్యం కలిగిన టైర్లను అమర్చారు.

Vmoto Fleet Concept F01 ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ ఆవిష్కరణ, వివరాలు

విమోటో సోకో గ్రూప్ భారత మార్కెట్‌లో ఇంకా తమ వ్యాపారాన్ని ప్రారంభించలేదు. బర్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీతో కంపెనీ తన ఉత్పత్తులను భారతదేశంలో మార్కెట్ చేయడానికి ఒక కూటమిని ఏర్పరుచుకున్నట్లు నివేదించబడింది. దీని ఆధారంగా, సంస్థ యొక్క ద్విచక్ర వాహనాలు బర్డ్ బ్రాండ్ క్రింద అతి త్వరలో విడుదల కానున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Vmoto fleet concept f01 electric scooter reveled features range and other details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X