ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

క్యాబ్ సర్వీస్ ప్రొవైడర్ ప్రసిద్ధి గాంచిన ప్రముఖ సంస్థ ఓలా, ఇప్పుడు తమ మొట్టమొదటి స్కూటర్‌తో ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి ప్రవేశించబోతోంది. ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఆవిష్కరించిన ఓలా, త్వరలోనే వాటిని మార్కెట్లో విడుదల చేయేబోతోంది. ఈ మేరకు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభించింది.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

అంతేకాకుండా, త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ తమ డీలర్‌షిప్ భాగస్వాముల కోసం ధరఖాస్తులను కూడా ఆహ్వానించే అవకాశం ఉంది. ఆసక్తిగల అభ్యర్థులు తమ నగరంలో ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కేంద్రాలను ఓపెన్ చేసుకోవచ్చు. మరి ఈ డీలర్‌షిప్ కోసం ధరఖాస్తు చేసుకోవడం ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

ప్రస్తుతం ఓలా సంస్థకు ఎలాంటి డీలర్‌షిప్ నెట్‌వర్క్ లేదు. అయితే, మనదేశంలో ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుండి, దీనిపై భారీ హైప్ నెలకొంది. ఇందుకు ఓలా సంస్థ తమిళనాడులో నిర్మిస్తున్న ప్రపంచంలో కెల్లా అతిపెద్ద టూవీలర్ ప్లాంటే కారణం. భారీ ఉత్పత్తి సామర్థ్యంతో, ఎంతటి హై డిమాండ్‌నైనా తీర్చగలిగేలా కోట్ల రూపాయల పెట్టుబడులను వెచ్చించి ఓలా ఈ ప్లాంట్‌ను రూపొందిస్తుంది.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

ఈ నేపథ్యంలో, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ తీసుకోవాలనుకునే వారు ఎక్కువయ్యారు. ఒకవేళ మీరు కూడా మీ నగరంలో ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీని ఓపెన్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

ఓలా ఎలక్ట్రిక్ మొదట తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేస్తుందని, ఆ తర్వాతనే దాని డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ గురించి అధికారిక సమాచారాన్ని విడుదల చేస్తుందని నమ్ముతారు. కానీ, తామే స్వయంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డీలర్‌షిప్‌ను తీసుకోవాలనుకునే వారు ఈ సంస్థను సంప్రదించవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ తీసుకోవటానికి ఇష్టపడే వ్యక్తులు సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ www.olaelectric.com ని సందర్శించడం ద్వారా కంపెనీకి ఇ-మెయిల్ చేసి, తమ వివరాలను పొందుపరచడం ద్వారా డీలర్‌షిప్ లేదా ఫ్రాంచైజీ పట్ల ఆసక్తిని తెలియజేయవచ్చు. ఇందుకోసం మీరు ఈ వెబ్‌సైట్‌పై ఓ కన్నేసి ఉంచాలి.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

త్వరలోనే ఓలా ఎలక్ట్రిక్ తన అధికారిక డీలర్‌షిప్ మరియు ఫ్రాంచైజీ సమాచారాన్ని తమ వెబ్‌సైట్‌లోనే విడుదల చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఈ వెబ్‌సైట్‌లోని 'సబ్‌స్క్రైబ్' ఆప్షన్ ద్వారా మీరు మీ ఇ-మెయిల్‌ను రిజిస్టర్ చేసుకోవడం వలన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు మరియు డీలర్‌షిప్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్‌లను నేరుగా మీ ఈ-మెయిల్‌కే పొందవచ్చు.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

ఇక ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఈ స్కూటర్‌ను కొనాలనుకునే కస్టమర్లు ప్రస్తుతం సంస్థ యొక్క అధికారిక వెబ్‌సైట్ నుండి 499 రూపాయల ముందస్తు చెల్లింపు చేయడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. కంపెనీ ఇంకా ఈ స్కూటర్ ధరలను వెల్లడి చేయలేదు.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ట్విన్ పాడ్ ఎల్‌ఈడి హెడ్‌లైట్, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్ లైట్, ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, సింగిల్ డిస్క్ బ్రేక్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కూటర్‌లో అతిపెద్ద బూట్ స్పేస్ కూడా లభిస్తుంది. ఇందులో 50 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది.

ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ కోసం ఎలా అప్లయ్ చేయాలంటే..?

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ గరిష్టంగా 150 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 18 నిమిషాల ఛార్జ్‌తో 75 కిలోమీటర్ల రేంజ్‌ను ఆఫర్ చేయగలదని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్‌లో స్వాప్ (మార్పిడి) చేయగల బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందించే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Want To Become A Ola Electric Scooter Dealer, Here Is How To Apply.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X