మరో ప్రముఖ బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

చైనా కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్న ప్రముఖ వాహనాలను కాపీ కొట్టిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. కాపీ కొట్టడంలో చైనాకి సాటి ఏదీ రాదు. అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కార్ మరియు బైక్ డిజైన్లు దొంగలించిన ఆరోపణలు ఉన్నాయి. ప్రసిద్ద మోడల్స్ దొంగిలించి చౌకగా విక్రయించడం చైనా ఒక అభిరుచిగా పెట్టుకుంది.

ఇటీవల కాలంలో కూడా ఒక ప్రముఖ బైక్ ని కాపీ కొట్టి తయారుచేసి మార్కెట్లో విడుదల చేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం.

మరో బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

చైనాకు చెందిన జియాంగ్‌షుయోయి హెవీ మెషినరీ కంపెనీ జెఎస్ఎక్స్ 500 ఐ అనే కొత్త బైక్‌ను తయారు చేసింది. ఇది దాదాపు టివిఎస్ జెప్పెలిన్ కాన్సెప్ట్ బేస్డ్ బైక్ లాగా ఉంది. టీవీఎస్ తన జెప్పెలిన్ కాన్సెప్ట్ మోడల్‌ను తొలిసారిగా 2018 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది.

మరో బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

చైనా కంపెనీ తయారు చేసిన ఈ బైక్ డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపు చూడటానికి టీవీఎస్ జెప్పెలిన్ వలె ఉంది. ఇందులో హెక్సాగోనల్ హెడ్‌ల్యాంప్‌లు, స్టెప్డ్ సీట్లు, రేడియేటర్ గ్రిల్, సైడ్ ప్యానెల్స్, ఇంజిన్ కౌల్ మరియు టెయిల్ సెక్షన్ వంటివి ఉన్నాయి. ఇవి జెప్పెలిన్ బైక్ లో ఉన్నట్లు ఉంటాయి.

మరో బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

జెఎస్ఎక్స్ 500 ఐ బైక్ కూడా USD ఫ్రంట్ ఫోర్క్‌లను పొందుతుంది, కానీ జెప్పెలిన్ కాన్సెప్ట్ బైక్‌పై గోల్డెన్ ఫినిషింగ్ లేదు. అల్లాయ్ వీల్స్ మరియు ఎగ్జాస్ట్ కూడా వేరే డిజైన్ కలిగి ఉంటాయి. అంతే కాకుండా ఇందులో ఆల్-ఎల్‌ఇడి లైటింగ్, ప్రీలోడ్-అడ్జస్టబుల్ మోనోషాక్ మరియు డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. ముందు భాగంలో డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్‌లు.

మరో బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

చైనాకు చెందిన జెఎస్‌ఎక్స్ 500 ఐ బైక్ యొక్క కొలతల విషయానికి వస్తే, ఇది 2,150 మిమీ పొడవు, 890 మిమీ వెడల్పు మరియు 1,180 మిమీ ఎత్తు ఉంటుంది. ఈ బైక్‌లో 1,460 మి.మీ పొడవు గల వీల్‌బేస్ ఉంది. ఇది ఇప్పుడు 17 ఇంచెస్ చక్రాలను పొందుతుంది.

మరో బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

అయితే ఈ బైక్ లో ఇంజిన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. 71 సి, వాటర్-కూల్డ్, ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను కాపీ క్యాట్ జెఎస్‌ఎక్స్ 500 ఐ బైక్‌తో అమర్చారు. ఈ ఇంజన్ 44.87 బిహెచ్‌పి శక్తి మరియు 41 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ జతచేయబడింది. ఈ బైక్ వేగం గంటకు 150 కిలోమీటర్లు.

మరో బైక్ డిజైన్ కాపీ కొట్టిన చైనా కంపెనీ.. అది ఏ బైక్ అంటే?

టీవీఎస్ జెప్పెలిన్ కాన్సెప్ట్ బైక్‌లో 220 సిసి, సింగిల్ సిలిండర్ ఇంజన్ 1.2 కిలోవాట్ల రీజనరేట్ ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. దీనికి 48 వి ఎల్ అయాన్ బ్యాటరీ జతచేయబడి ఉంటుంది. చైనా కంపెనీ ఈ డిజైన్‌ను కాపీ కొట్టినప్పటికీ, దాని పర్ఫామెన్స్, ఫీచర్స్ మొదలైనవన్నీ కూడా కొంత భిన్నంగా ఉంటాయి.

Most Read Articles

English summary
TVS Zeppelin Concept Now Has A Chinese Doppelganger – Meet The Xianglong JSX500i. Read in Telugu.
Story first published: Monday, June 28, 2021, 9:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X