1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

ఈ ఫ్యూచరిస్టిక్ బైక్‌ను చూశారా? ఇలాంటి బైక్‌ను ట్రాన్ అనే ఆంగ్ల చిత్రంలో చూసినట్లుగా అనిపిస్తుంది కదూ. ఈ అద్భుతమైన మోటార్‌సైకిల్‌ను డిజైన్ చేసింది ప్రముఖ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ సంస్థ షియోమికి చెందిన నైన్‌బాట్ సంస్థ.

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

ఈ బైక్‌ను 'సెగ్‌వే అపెక్స్ హెచ్2' అని పిలుస్తారు. ఈ మోటార్‌సైకిల్ హైడ్రోజన్ పవర్‌తో పనిచేస్తుంది. ఇది 1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కిలోమీటర్ ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. షియోమి యాజమాన్యంలో ఉన్న సెగ్వే-నైన్‌బోట్ సంస్థ ఈ మొట్టమొదటి హైడ్రోజన్-ఎలక్ట్రిక్ హైబ్రిడ్ మోటార్‌సైకిల్‌ను తయారు చేసింది.

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

షియోమి తన సొంత దేశమైన చైనాలో ఈ బైక్‌ను ఆవిష్కరించింది. ఈ బైక్‌ను ప్రదర్శించిన మొదటి రోజునే, 99 మంది ఈ బైక్ కోసం ముందస్తు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇది ఇంకా కాన్సెప్ట్ దశలోనే ఉంది, ఉత్పత్తి దశకు చేరుకోవటానికి మరికొన్నేళ్ల సమయం పట్టవచ్చు.

చైనా మార్కెట్లో ఈ హైబ్రిడ్ టూవీలర్‌ను 69,999 యువాన్ల ధరకు విక్రయించనున్నారు. మనదేశ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.7.84 లక్షలుగా ఉంటుంది. ఈ బైక్ దాని ధరకు తగినట్లుగానే అధిక సాంకేతిక పరిజ్ఞానం మరియు పనితీరును కలిగి ఉంటుంది. ప్రత్యేకించి ఇది నీటితో నడుస్తుంది.

MOST READ:మహీంద్రా నుంచి రానున్న కొత్త ఎస్‌యూవీ XUV700; వివరాలు

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

సెగ్‌వే-నైన్‌బాట్ ఈ బైక్‌ను 2023లో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ బైక్ ఉత్పత్తి దశకు చేరుకునే అవకాశం ఉంది. హైడ్రోజన్ మరియు బ్యాటరీ పవర్‌తో పనిచేసే ఇలాంటి హైబ్రిడ్ బైక్‌లు ఇప్పటి వరకూ మార్కెట్లో అందుబాటులోకి రాలేదు. అందరికన్నా ముందుగా అపెక్స్ హెచ్2 మార్కెట్లోకి వస్తే, ఆ ఘనత దానికే దక్కుతుంది.

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

అపెక్స్ హెచ్2లో ఉపయోగించిన హైబ్రిడ్ ఇంజన్ గరిష్టంగా 81.5 పిఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అంతేకాదు, దాని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

MOST READ:భారత్‌లో మళ్ళీ మొదలైన కరోనా లాక్‌డౌన్; లెక్కకు మించి వాహనాలు జప్తు, ఎక్కడంటే?

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

వాస్తవానికి హైడ్రోజన్ వాయువు చాలా ప్రమాదకరమైనది. దీని నిల్వ చేసే కంటైనర్లలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ బైక్‌లో హైడ్రోజన్ నిల్వ కోసం పెద్ద ఐరన్ సిలిండర్లను అమర్చారు. ఇవి హైడ్రోజన్‌ను సురక్షితంగా నిల్వ చేయడానికి మరియు ఉపయోగించడానికి సహాయపడతాయి.

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం అపెక్స్ హెచ్2 బైక్ 1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఈ బైక్‌లో హైడ్రోజన్‌ను నింపడం కూడా చాలా సులభం. ఈ బైక్ మంచి ఫ్యూచరిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది రియాలిటికీ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ, చూడటానికి మాత్రం చాలా స్టన్నింగ్‌గా కనిపిస్తుంది.

MOST READ:ఉద్యోగం నుంచి తీసేశారని బీభత్సం సృష్టించిన మాజీ ఉద్యోగి.. ఇంతకీ ఏం చేసాడో తెలుసా?

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

ఇందులో ఇరు వైపులా హబ్ మౌంటెడ్ వీల్స్ మరియు వాటిపై పెద్ద చక్రాలు ఉంటాయి. తేలికపాటి కార్బన్ ఫైబర్ పదార్థాలతో దీని బాడీ ప్యానెళ్లను డిజైన్ చేశారు. ముందు వైపు ఇన్‌వెర్టెడ్ ఫోర్కులు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్ మొదలైనవి ఉంటాయి. బైక్ బ్యాలెన్సింగ్ కోసం దీని ఇంజన్ సెంటర్లో అమర్చారు.

ఇంకా ఇందులో 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, పూర్తి ఎల్ఈడి లైట్లు వంటి అనేక ప్రీమియం ఫీచర్లను ఇందులో జోడించారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎలక్ట్రిక్ టూవీలర్లతో పోల్చుకుంటే, ఈ కొత్త అపెక్స్ హెచ్2 బైక్ విభిన్నమైన పవర్‌ట్రెయిన్‌తోనే కాకుండా మరిన్ని విశిష్టమైన ఫీచర్లతో కూడా అందుబాటులోకి రానుంది.

1 గ్రాము హైడ్రోజన్‌తో 1 కి.మీ ప్రయాణించే 'షియోమీ' హైబ్రిడ్ బైక్!!

సెల్‌ఫోన్ల తయారీలో పేరుగాంచిన షియోమి సంస్థ ఇటీవలే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసినదే. ఇందుకోసం షియోమి చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ కంపెనీ తయారీ కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని ప్లాన్ చేస్తోంది. సరమైన ఫోన్లతో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను షేక్ చేసిన షియోమీ ఇప్పుడు సరమైన ఎలక్ట్రిక్ వాహనాలతో ఆ పరిశ్రమను కూడా షేక్ చేయాలని భావిస్తోంది.

MOST READ:విమానాలపై పక్షులు ఎందుకు దాడి చేస్తాయి.. వాటిని ఎలా నివారిస్తారు..మీకు తెలుసా?

Most Read Articles

English summary
Xiaomi Unveils Hydrogen-Electric Hybrid Bike Concept In China. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X