Just In
- 27 min ago
కారు విలువ 10 లక్షలు.. రిపేర్ ఫీజు 20 లక్షలు; ఇదేంటనుకుంటున్నారా.. ఇది చూడండి
- 2 hrs ago
కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?
- 3 hrs ago
కొత్త తరం మెర్సిడెస్ జిఎల్ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!
- 3 hrs ago
కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?
Don't Miss
- News
వైసీపీ నేత పీవీపీ షాకింగ్ ట్వీట్..లంగా డ్యాన్సులేసే సార్లకు 50 కోట్లు,లాజిక్ తో కొట్టిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్
- Finance
Gold prices today: బంగారం ధరలు మరింత తగ్గాయి, రూ.48,000 దిగువకు
- Lifestyle
చికెన్ చాప్స్
- Sports
అతినితో అతనికే సమస్య: గవాస్కర్ ఆగ్రహానికి గురైన సంజు శాంసన్: టీమిండియాలో చోటు దక్కదంటూ ఫైర్
- Movies
త్రివిక్రమ్ - మహేష్ కాంబో.. అభిమానులకు చిరాకు తెప్పిస్తున్న మరో సెలక్షన్?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఎలక్ట్రిక్ వాహనాలను తయారుచేయనున్న ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ; పూర్తి వివరాలు
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. పర్యావరణ అనుకూలమైన వాహనాలను వినియోగించాలనే కారణంగా చాలా దేశాలు ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. నార్వేతో సహా అనేక యూరోపియన్ దేశాలు 2030 నాటికి దాదాపు పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను అధిక సంఖ్యలో వినియోగించడానికి చాలా ప్రణాళికలు ఉన్నాయి.

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ఫేమ్ 2 వంటి ప్రణాళికలు అమలు చేయబడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుదారులకు రాయితీలు కూడా ఇస్తుండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరిగేకొద్దీ దాదాపు అన్ని వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి గ్రీన్ సిగ్నెల్ ఇస్తున్నారు. ప్రస్తుతం వాహన తయారీ కంపెనీలు మాత్రమే కాదు, సెల్ ఫోన్ తయారీదారులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడానికి శ్రీకారం చుట్టారు.
MOST READ:భార్య పుట్టినరోజుకి కోటి రూపాయల కార్ గిఫ్ట్‌గా ఇచ్చిన భర్త.. ఎవరో తెలుసా?

మనం ఇది వరకు అనుకున్నట్టుగానే ఆపిల్, ఫాక్స్కాన్ మరియు హువావే వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిలో ముందుకు వెళ్తున్నాయి, ఇదే దిశలో ఇప్పుడు ప్రముఖ మొబైల్ ఫోన్ తయారీ సంస్థ షియోమి కూడా ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి సన్నద్ధమైంది.

కొన్ని రోజులుగా చిన్న ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడుతున్న ఈ సంస్థ ఇప్పుడు పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి యోచిస్తున్నట్లు సమాచారం. షియోమి ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి కోసం గ్రేట్ వాల్ మోటార్ కంపెనీ ఆటో ప్రొడక్షన్ ప్లాంట్‌ను ఉపయోగించనుంది. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను సొంత బ్రాండ్ పేరుతో ఉత్పత్తి చేయాలని కంపెనీ నిర్ణయించింది.
MOST READ:దుమ్మురేపుతున్న హోండా CB500X ఫస్ట్ రైడ్ రివ్యూ వీడియో

షియోమి ప్రపంచంలోనే అతిపెద్ద సెల్ ఫోన్ తయారీదారులలో ఒకటి. సెల్‌ఫోన్‌ల మాదిరిగానే పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉత్పత్తి చేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది. ఈ వార్త కంపెనీ యొక్క అభిమానులలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిచింది. కంపెనీ హై-ఎండ్ హ్యాండ్‌సెట్లను తక్కువ ధరకు విక్రయిస్తుంది.

కంపెనీ తమ ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకు విక్రయించాలని భావిస్తోంది. ఈ కారణంగా షియోమి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కార్యకలాపాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సంస్థ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2023 లో లాంచ్ చేయాలని సన్నాహాలను సిద్ధం చేస్తోంది.
MOST READ: కార్ విండ్‌స్క్రీన్ సేఫ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

కంపెనీ తయారుచేయనున్న ఈ ఎలక్ట్రిక్ వాహనంలో పలు రకాల ప్రత్యేక సాంకేతిక సదుపాయాలను కల్పించనున్నట్లు కంపెనీ తెలిపింది. షియోమి తన వాహనాలను తయారు చేయడానికి గ్రేట్ వాల్ మోటార్స్ యొక్క ఆటోమోటివ్ ప్లాంట్‌ను ఉపయోగించుకుంటుంది, ఇక్కడ ఇది భారీ ఉత్పత్తిని ప్రారంభించబోతోంది.

ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి షియోమి ప్రవేశం భారీ ప్రభావాన్ని చూపుతుందని భావిస్తున్నారు. కంపెనీ సెల్‌ఫోన్లు మొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే తమ సత్తా చాటాయి. తక్కువ ధర గల ఎలక్ట్రిక్ వాహనాలను అమ్మడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కూడా గట్టి ఆధిపత్యం చెలాయించే అవకాశం ఉంది.
MOST READ:వాహనదారులకు గుడ్ న్యూస్.. మళ్ళీ పెరిగిన డ్రైవింగ్ లైసెన్స్ గడువు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే

షియోమి కేవలం సెల్ ఫోన్ మాత్రమే కాకుండా, స్మార్ట్ వాచ్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఎల్ఈడి టివి, ప్రొజెక్టర్, వాక్యూమ్ క్లీనర్, బ్లూటూత్ స్పీకర్, ఇంటర్ నెట్ రౌటర్, ఇయర్ ఫోన్, ఇయర్ బడ్, ఎల్ఇడి లైట్ బల్బుతో సహా పలు ఉత్పత్తులను విక్రయిస్తుంది. ఏది ఏమైనా కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదలచేసిన తర్వాత ఏ విధమైన ఆదరణ చూరగొంటుందో వేచి చూడాలి.