Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) భారతీయ మార్కెట్లో కొత్త మాక్సీ స్కూటర్ 'ఏరోక్స్ 155' (Aerox 155) ను ఇప్పటికే అధికారికంగా విడుదల చేసింది. ఈ స్కూటర్ రెండు కలర్ ఆప్సన్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే కంపెనీ ఈ స్కూటర్ ని ఇప్పుడు మెటాలిక్ బ్లాక్ కలర్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. కావున ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ ఇప్పుడు మూడు కలర్ ఆప్సన్స్ లో కూడా అందుబాటులోకి వచ్చింది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులోని బేస్ వేరియంట్ ధర రూ. 1.29 లక్షలు కాగా, స్పెషల్ ఎడిషన్ మోటో జిపి ఎడిషన్ ధర రూ. 1.30 లక్షలు వరకు ఉంటుంది. ఈ స్కూటర్ ఇప్పటికే ఇండోనేషియా, థాయ్‌లాండ్ మరియు ఫిలిప్పీన్స్ వంటి అనేక ఆగ్నేయాసియా మార్కెట్‌లలో విక్రయించబడుతోంది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

యమహా ఏరోక్స్ 155 అనేది దేశంలోనే మొట్టమొదటి 155 సిసి స్కూటర్. ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ నే ఈ కొత్త ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ లోనూ ఉపయోగించారు. కాకపోతే, ఇది ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కోసం వేరియబుల్ వాల్వ్ అక్యుమ్యులేషన్ (వివిఏ) టెక్నాలజీని కలిగి ఉంటుంది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 15.36 బిహెచ్‌పి పవర్ ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటి గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి, లేటెస్ట్ యమహా ఆర్15 వి7 4.0 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 4 బిహెచ్‌పి తక్కువగా ఉంటుంది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

యమహా ఏరోక్స్ 155 యువ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. కావున ఇది ఆధునిక డిజైన్ మరోయు పరికరాలను పొందుతుంది. ఈ స్కూటర్‌లో LED హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్‌తో పాటు LED DRL లైట్ మరియు టర్న్ ఇండికేటర్ కూడా LED లో ఇవ్వబడ్డాయి.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

ఈ కొత్త స్కూటర్ 25 లీటర్ల అండర్ సీట్ స్టోరేజీని పొందుతుంది, కావున ఇందులో రెండు స్టాండర్డ్ సైజు హెల్మెట్‌లను సులభంగా ఉంచుకోవచ్చు. అంతే కాకుండా ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కోసం డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఆపరేషన్, ఛార్జింగ్ సాకెట్ మరియు సింగిల్ ఛానల్ ABS కూడా పొందుతుంది. ఈ స్కూటర్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనికి రెండు వైపులా 14 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

స్కూటర్‌ను యమహా వై-కనెక్ట్ అప్లికేషన్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ స్కూటర్ మైలేజ్, రైడింగ్ హిస్టరీ, పార్కింగ్ లొకేషన్, బ్యాటరీ లెవెల్ మరియు మెయింటెనెన్స్ అలర్ట్‌లతో సహా వివిధ నోటిఫికేషన్‌లను అందిస్తుంది. స్కూటర్‌లో 5.5 లీటర్ కెపాసిటీ గల ఇంధన ట్యాంక్ ఇవ్వబడింది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

యమహా ఏరోక్స్ 155 స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 1,980 మిమీ, వెడల్పు 700 మిమీ మరియు ఎత్తు 1,150 మిమీ వరకు ఉంటుంది, ఈ స్కూటర్ యొక్క వీల్ బేస్ 1350 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది ఇతర స్కూటర్లకంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) మాక్సీ స్కూటర్ ఈ విభాగంలో ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 (Aprilia SXR 160) తో పోటీపడుతుంది. ఈ కొత్త యమహా స్కూటర్ ఆప్రిలియా స్కూటర్ కన్నా (10.9 బిహెచ్‌పి పవర్) శక్తివంతమైనది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

ఇదిలా ఉండగా యమహా కంపెనీ భారతీయ మార్కెట్లో తమ ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ యమహా ఆర్15 లో నాల్గవ తరం మోడల్ ని మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2021 Yamaha YZF-R15 V4 తో పాటుగా కంపెనీ ఇందులో YZF-R15M స్పోర్టీయర్ వేరియంట్ ను కూడా విడుదల చేసింది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

యమహా యొక్క ఈ కొత్త బైక్స్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉండి, అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటమే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Yamaha Aerox 155 ఇప్పుడు మరో కొత్త కలర్‌లో.. మరింత అదుర్స్ కదా..!!

కొత్త 2021 Yamaha YZF-R15 సిరీస్ మోటార్‌సైకిళ్లలో లేటెస్ట్ 155 సిసి, 4-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఎస్ఓహెచ్‌సి, 4-వాల్వ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 పిస్ శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 ఎన్ఎమ్ టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha aerox 155 maxi scooter now available in metallic black colour details
Story first published: Monday, December 6, 2021, 16:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X