త్వరపడండి.. యమహా స్కూటర్ల కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్స్
ప్రముఖ వాహన తయారీదారు 'యమహా' భారతీయ మార్కెట్లో తన వినియోగదారుల కోసం ఒక అదిరిపోయే ఆఫర్ తీసుకువచ్చింది. కంపెనీ రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని కస్టమర్లను ఆకర్షించడానికి ఈ ఆఫర్స్ అందిస్తోంది. కావున ఇప్పుడు యమహా స్కూటర్ కొనేవారికి ఇది ఒక బంపర్ ఆఫర్ అనే చెప్పాలి.

యమహా కంపెనీ ఆగస్టు నెలలో యమహా ఫాసినో 125 మరియు రే జెడ్ఆర్ శ్రేణి స్కూటర్‌లపై దాదాపు రూ. 20,000 ఆఫర్ అందిస్తోంది. దీనితోపాటు ఏకంగా లక్ష రూపాయల బహుమతి గెలుచుకునే గొప్ప అవకాశాన్ని కూడా కంపెనీ ఇప్పుడు అందిస్తోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

యమహా కంపెనీ ఆగష్టు నెలలో తన ఫాసినో 125, ఫాసినో 125 హైబ్రిడ్, రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్లపై ఈ ఆఫర్లను అందిస్తోంది. కంపెనీ తన అన్ని స్కూటర్ మోడళ్లపై రూ. 2,999 ఖచితమై బహుమతికి అందిస్తుందని పేర్కొంది.
ఇది మాత్రమే కాకుండా, స్కూటర్ కొనుగోలుపై, కస్టమర్‌కు స్క్రాచ్ కార్డ్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ స్క్రాచ్ కార్డ్ ద్వారా మీరు రూ. 35,000 నుండి రూ .1,00,000 వరకు బంపర్ గిఫ్ట్ గెలుచుకోవచ్చు. దీనితో పాటుగా కంపెనీ స్కూటర్‌లపై రూ .20,000 అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.

యమహా తన పాపులర్ స్కూటర్ అయిన కొత్త ఫాసినో 125 యొక్క హైబ్రిడ్ మోడల్‌ను గత నెలలో దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్ హై పెర్ఫార్మెన్స్ హైబ్రిడ్ ఇంజిన్ టెక్నాలజీతో తీసుకురాబడింది. ఫాసినో 125 రెండు వేయియంట్లలో తీసుకురాబడింది. ఇందులో ఒకటి డ్రమ్ వేరియంట్ కాగా మరొకటి డిస్క్ వేరియంట్.

దేశీయ మార్కెట్లో కొత్త యమహా ఫాసినో 125 స్కూటర్ యొక్క డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ ప్రకారం రూ .70,000 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ. 76,530 వరకు ఉంటుంది. ఈ రెండు వేరియంట్లు అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి.

కొత్త యమహా ఫాసినో 125 స్కూటర్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు 9 కలర్స్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఫాసినో 125 కొత్త స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్ వంటి వాటిని పొందుతుంది. ఈ స్కూటర్ యొక్క టెయిల్ లైట్ డిజైన్ మునుపటి కంటే సన్నగా ఉంటుంది. స్కూటర్ రెండు వైపులా సైడ్ ప్యానెల్స్‌పై ఫాసినో లోగో 3 డిలో ఇవ్వబడింది.

స్కూటర్ యొక్క బలాన్ని మరింత మెరుగుపరచడానికి, కంపెనీ మెటల్ ఫ్రంట్ ఆప్రాన్ మరియు మడ్‌గార్డ్ వంటి వాటిని కూడా అమర్చింది. ఇవి మాత్రమే కాకుండా ఈ స్కూటర్ 110 మిమీ వెడల్పు గల వెనుక టైర్‌ను పొందుతుంది, ఇది మునుపటి కంటే ఎక్కువ రోడ్ గ్రిప్‌ను అందిస్తుంది.

ఈ కొత్త స్కూటర్ లో ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా లేటెస్ట్ ఫీచర్స్ అయిన 'యమహా కనెక్ట్' కనెక్టివిటీ ఫీచర్ వంటి కొత్త ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా పొందుతుంది. ఈ ఫీచర్‌తో, స్కూటర్‌ను బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయవచ్చు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్ స్కూటర్‌లో ఇవ్వబడింది. కావున స్టాండ్ తెరిచినప్పుడు స్కూటర్ స్టార్ట్ అవ్వదు. ఈ ఫీచర్ ఈ స్కూటర్ లో చాలా అద్భుతంగా ఉంది.

యమహా తన ఫాసినో 125 స్కూటర్ యొక్క ఇంజిన్‌లో పెద్ద మార్పులు జరిగాయి. కొత్త స్కూటర్‌లో బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజిన్ ఉంది, ఇది స్కూటర్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన బ్యాటరీ నుండి శక్తిని పొందుతుంది. అవసరమైనప్పుడు ఈ ఇంజిన్ మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుందని కంపెనీ పేర్కొంది. హైబ్రిడ్ ఇంజిన్ కఠినమైన భూభాగాలలో లేదా ఎక్కేటప్పుడు బ్యాటరీ సహాయంతో మరింత శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

యమహా ఫాసినో 125 సిసి సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ హైబ్రిడ్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8.2 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కొత్త స్కూటర్‌లో స్మార్ట్ మోటార్ జనరేటర్ టెక్నాలజీ కూడా ఉపయోగించబడింది, దీని కారణంగా స్కూటర్ సౌండ్ చేయకుండా ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్ ఇప్పుడు భారతీయ మార్కెట్లో విడుదలవుతున్న దాదాపు అన్ని స్కూటర్లు మరియు బైకులలో అందుబాటులో ఉంది.

ఈ స్కూటర్ 21 లీటర్ల పెద్ద సీటు స్టోరేజ్ స్పేస్ కలిగి ఉంది. కావున ఇందులో పెద్ద సైజు హెల్మెట్‌ని కూడా సులభంగా ఉంచుకోవచ్చు. సులభంగా ఉంచవచ్చు. యుఎస్‌బి ఛార్జింగ్ సౌకర్యం కూడా అండర్ సీట్లో అందుబాటులో ఉంటుంది. కొత్త యమహా ఫాసినో కంపెనీ యొక్క అన్ని అధికారిక డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో, కొత్త ఫాసినో 125 స్కూటర్ సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు హోండా యాక్టివా 125 వాటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.


Click it and Unblock the Notifications








