రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్25 మోటోజిపి బైక్ వచ్చేసింది

భారత మార్కెట్లో యమహా తన ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2021 జూలై నాటికి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయదలచిన కస్టమర్లు 2,000 రూపాయల టోకెన్ అమౌంట్ తో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

యమహా ఇండియా నుండి వచ్చిన ఈ బైక్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మోటోజిపి వేరియంట్‌లో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్‌ చేసింది. మీరు ఇందులో గమనించవచ్చు. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్‌ లోని ఫ్యూయెల్ ట్యాంక్ పై కంపెనీ ENEOS అనే లోగో ఏర్పాటు చేసింది. ఈ బైక్‌ చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ లోని ఫీచర్స్ దాదాపుగా యమహా ఎఫ్‌జెడ్ 25 స్టాండర్డ్‌ బైక్ లో కనిపించే అన్ని ఫీచర్లు ఉన్నాయి.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

ఎఫ్‌జెడ్25 మోటోజిపిలో నెగటివ్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్‌లోని ఎల్‌ఈడీ హెడ్‌లైట్, కౌల్ అండర్ కౌల్ మరియు సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్‌ను ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో అందించడం జరిగింది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

యమహా కంపెనీ తన ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్ లోని ఇంజిన్ స్పెసిఫికేషన్లో కూడా మార్పులు చేయలేదని ఇక్కడ గమనించవచ్చు. ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడిన 249 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.5 బిహెచ్‌పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. మొత్తానికి ఇది మంచి పనితీరుకి అందిస్తూ వాహాదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

దేశీయ మార్కెట్లో యమహా ఇండియా తన లైనప్‌లో ఉన్న రెండు బైక్‌ల ధరలను పెంచినట్లు తెలిపింది. ఇందులో యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3 మరియు యమహా ఎంటి-15 ఉన్నాయి. ధరల పెరుగుదల తరువాత యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 ధర రూ. 1.54 లక్షలకు చేరింది. ఆటే ఈ బైక్ ధర మునుపటి కంటే రూ. 2,500 ఎక్కువ.

రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్ 25 మోటోజిపి బైక్ వచ్చేసింది

అదేవిధంగా యమహా ఎంటీ-15 యొక్క రెండు వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ. 5 వేలకు పెంచింది. ధరల పెరుగుదల ఈ బైక్ యొక్క అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు. ధరల పెరుగుదల అమ్మకాలపై ఎలాటి ప్రభావం చూపిందో తెలుసుకోవడానికి కొత్త కాలం వేచి చూడాలి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZ25 MotoGP Edition Launched In India. Read in Telugu.
Story first published: Wednesday, July 21, 2021, 9:36 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X