Just In
- 11 hrs ago వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- 12 hrs ago వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- 13 hrs ago 2024 Jeep Wrangler Facelift Review జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ పర్ఫామెన్స్ ఫుల్ రివ్యూ
Don't Miss
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- News ఘోర ప్రమాదం: లారీని ఢీకొనడంతో చిన్నారి సహా ఆరుగురు మృతి
- Movies బాయ్ ఫ్రెండ్‌తో శృతి హాసన్ బ్రేకప్? ఆ విషయంలో సమంతను ఫాలో అయిన బ్యూటీ!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రైడింగ్‌కి సిద్ధమవ్వండి.. యమహా ఎఫ్‌జెడ్25 మోటోజిపి బైక్ వచ్చేసింది
భారత మార్కెట్లో యమహా తన ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ ధర రూ. 1.36 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ 2021 జూలై నాటికి ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ కొనుగోలు చేయదలచిన కస్టమర్లు 2,000 రూపాయల టోకెన్ అమౌంట్ తో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చు.
యమహా ఇండియా నుండి వచ్చిన ఈ బైక్ పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మోటోజిపి వేరియంట్లో కొన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ చేసింది. మీరు ఇందులో గమనించవచ్చు. ఇది చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది.
ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్ లోని ఫ్యూయెల్ ట్యాంక్ పై కంపెనీ ENEOS అనే లోగో ఏర్పాటు చేసింది. ఈ బైక్ చూడటానికి ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా మంచి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఈ కొత్త బైక్ లోని ఫీచర్స్ దాదాపుగా యమహా ఎఫ్‌జెడ్ 25 స్టాండర్డ్ బైక్ లో కనిపించే అన్ని ఫీచర్లు ఉన్నాయి.
ఎఫ్‌జెడ్25 మోటోజిపిలో నెగటివ్ ఎల్సిడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అందుబాటులో ఉంటుంది. అంతే కాకూండా ఈ బైక్‌లోని ఎల్ఈడీ హెడ్‌లైట్, కౌల్ అండర్ కౌల్ మరియు సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్ ఫంక్షన్‌ను ఎల్ఈడీ డీఆర్ఎల్లతో అందించడం జరిగింది.
యమహా కంపెనీ తన ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్ లోని ఇంజిన్ స్పెసిఫికేషన్లో కూడా మార్పులు చేయలేదని ఇక్కడ గమనించవచ్చు. ఎఫ్‌జెడ్25 మోటోజిపి ఎడిషన్ బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడిన 249 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది.
ఈ ఇంజన్ 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.5 బిహెచ్పి పవర్ మరియు 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 20.1 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి. మొత్తానికి ఇది మంచి పనితీరుకి అందిస్తూ వాహాదారునికి చాలా అనుకూలంగా ఉంటుంది.
దేశీయ మార్కెట్లో యమహా ఇండియా తన లైనప్‌లో ఉన్న రెండు బైక్‌ల ధరలను పెంచినట్లు తెలిపింది. ఇందులో యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 వి3 మరియు యమహా ఎంటి-15 ఉన్నాయి. ధరల పెరుగుదల తరువాత యమహా వైజెడ్ఎఫ్-ఆర్15 ధర రూ. 1.54 లక్షలకు చేరింది. ఆటే ఈ బైక్ ధర మునుపటి కంటే రూ. 2,500 ఎక్కువ.
అదేవిధంగా యమహా ఎంటీ-15 యొక్క రెండు వేరియంట్ల ధరలను గరిష్టంగా రూ. 5 వేలకు పెంచింది. ధరల పెరుగుదల ఈ బైక్ యొక్క అమ్మకాలపై ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చు. ధరల పెరుగుదల అమ్మకాలపై ఎలాటి ప్రభావం చూపిందో తెలుసుకోవడానికి కొత్త కాలం వేచి చూడాలి.