యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా, భారత మార్కెట్లో మరో కొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ పేరుతో కంపెనీ ఓ కొత్త మోటార్‌సైకిల్‌ను ప్రవేశపెట్టనుంది. తాజాగా, ఈ మోటార్‌సైకిల్‌కి సంబంధించిన మొదటి స్పై చిత్రాలు ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

వచ్చే సెప్టెంబరు 2021 నాటికి యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ భారతదేశంలో విడుదల కావచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం యమహా తమ ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్‌ను భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. ఈ స్పై చిత్రాల్లో కనిపిస్తున్న యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ మోడల్ ఉత్పత్తికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

ఆన్‌లైన్‌లో లీకైన యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ స్పై చిత్రాలు ఈ సరికొత్త మోటార్‌సైకిల్‌కు సంబంధించిన కొన్ని డిజైన్ వివరాలను వెల్లడి చేస్తున్నాయి. ఈ బైక్‌లో పూర్తి ఎల్‌ఈడీ లైటింగ్‌తో కూడిన వృత్తాకారపు హెడ్‌ల్యాంప్ సెటప్ ఉంటుంది, దానికి ఇరువైపులా అల్యూమినియం బ్రాకెట్లతో అమర్చబడి ఉంటుంది.

MOST READ:వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

అలాగే, టర్న్ ఇండికేటర్లు చాలా ట్రెడిషనల్‌ డిజైన్‌తో కనిపిస్తాయి. అయితే, ఇవి కూడా ఎల్ఈడి లైట్లనే కలిగి ఉంటాయని అంచనా. ప్రస్తుతానికి దీని టెయిల్ డిజైన్‌కు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ, అక్కడ కూడా ఎల్ఈడి స్టాప్ లైట్లే ఉంటాయని తెలుస్తోంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

ఈ చిత్రంలో విశిష్టమైన ఫ్యూయెల్ ట్యాంక్ డిజైన్‌ను చూడొచ్చు. ట్యాంక్ దిగువ భాగంలో బూమరాంగ్ ఆకారపు రేడియేటర్ గార్డు కూడా ఉంది, ఇది ఎఫ్‌జెడ్ వి3 మోడల్‌లో కనిపించిన దాని కన్నా భిన్నంగా ఉంటుంది. ట్యాక్ పై భాగంలో ఫ్యూయెల్ క్యాప్ వద్ద కూడా ప్రత్యేకమైన ప్యానెల్ కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి మోటార్‌సైకిల్‌కు మంచి మజిక్యులర్ లుక్‌ని ఇవ్వనున్నాయి.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

అంతేకాకుండా, ఈ చిత్రంలో ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులను ఉపయోగించడాన్ని చూడొచ్చు. యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌లో డ్యూయల్ పర్పస్ టైర్లను ఆఫర్ చేయనున్నట్లు సమాచారం. ఇవి ఇటు సిటీ ప్రయాణానికి అటు ఆఫ్-రోడింగ్ అడ్వెంచర్‌కు అనుకూలంగా ఉండనున్నాయి.

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌లో 149సిసి, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ప్రస్తుతానికి దాని టార్క్ గణాంకాలకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. కాని ఇది 13.6 ఎన్ఎమ్ ఉండొచ్చని అంచనా.

MOST READ:మెర్సిడెస్ ఇక్యూటి ఎమ్‌పివి; చిన్న ఫ్యామిలీ కోసం చిన్న వ్యాన్

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

యమహా ఎఫ్‌జెడ్ వి3 మోడల్‌తో పోలిస్తే యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ పరిమాణంలో భిన్నంగా ఉంటుంది. ఇది (యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్) ఎఫ్‌జెడ్ వి3 కన్నా 35 మిమీ తక్కువ ఎత్తు, 5 మిమీ తక్కువ వెడల్పు మరియు 30 మిమీ ఎక్కువ పొడవును కలిగి ఉంటుంది. అయితే వీల్‌బేస్ మాత్రం 1330 మిమీగా ఉంటుంది.

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌లో సింగిల్ ఛానల్ ఏబిఎస్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లను ఆశించవచ్చు. ఈ బైక్‌ను 2021 లోనే విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఈ మోడల్ లాంచ్ డేట్‌కి సంబంధించిన ఖచ్చితమైన టైమ్‌లైన్‌ను ఇంకా నిర్ధారించలేదు.

MOST READ:కొత్త కారు కొన్న కన్నడ సీరియల్ యాక్టర్ భరత్ బోపన్న.. పూర్తి వివరాలు

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ ప్రొడక్షన్ రెడీ మోడల్: స్పై చిత్రాలు, వివరాలు

కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ దేశంలో డ్రైవింగ్ పరిస్థితులు మరియు వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా అనేక ఇండియా-స్పెక్ ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నారు. యమహా తన ఇతర మోటార్‌సైకిళ్లయిన ఎమ్‌టి15 మరియు ఆర్15 మోడళ్లలో కంపెనీ ఇదే తరహా వ్యూహాన్ని అనుసరించింది.

Source: Bikewale

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZ-X Production Ready Model Spied, Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X