కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా (Yamaha) ఇటీవల భారత మార్కెట్లో తమ కొత్త 2021 YZF-R15 ఎంట్రీ లెవల్ సూపర్‌స్పోర్ట్ మోటార్‌సైకిల్ ను మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయవి పణిలో కొత్త యమహా ఆర్15 ప్రారంభ ధర రూ. 1,67,800 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. కాగా, ఇప్పుడు ఈ కొత్త మోడల్ కోసం కంపెనీ అధికారిక యాక్ససరీలను కూడా వెల్లడి చేసింది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

కొత్త 2021 యమహా వైజీఎఫ్-ఆర్15 (2021 Yamaha YZF-R15) స్పోర్ట్స్ బైక్ మునుపటి కంటే మరింత స్పోర్టీగా మరియు స్టైలిష్ డిజైన్ తో అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ కొత్త R15 మోడల్ తో పాటుగా కంపెనీ ఇందులో మోటో జిపి ఎడిషన్ ను (Moto GP Edition) కూడా విడుదల చేసింది. భారత మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 1,79,800 (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

కొత్త యమహా ఆర్ 15 మూడు ప్రత్యేక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీటిలో మెటాలిక్ రెడ్, డార్క్ నైట్ మరియు రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్లు ఉన్నాయి. కొత్తగా ఈ బైక్‌ ను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ కస్టమైజ్ ఆప్షన్ లను కూడా పరిచయం చేసింది. ఇందుకోసం కంపెనీ అధికారిక ఉపకరణాల ప్యాక్‌ (Accessories Pack) ని కూడా ప్రకటించింది. ఈ యాక్ససరీస్ ధరలు రూ. 190 నుండి రూ. 1,650 మధ్యలో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

ఫ్రేమ్ స్లైడర్

కొత్త 2021 యమహా ఆర్15 కోసం అందిస్తున్న యాక్ససరీస్ లో ఫ్రేమ్ స్లైడర్ చాలా ప్రత్యేకమైన పరికరం. ఇది ప్రమాద సమయంలో బైక్ యొక్క ఫెయిరింగ్ కు నష్టం జరగకుండా కాపాడటంలో సహకరిస్తుంది. మీరు మీ కొత్త యమహా ఆర్15 లో ఫ్రేమ్ స్లైడర్‌ని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, దాని కోసం అదనంగా రూ. 1,650 చెల్లించాల్సి ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

క్లచ్-బ్రేక్ లివర్

ఈ కొత్త స్పోర్ట్స్ బైక్ కోసం కంపెనీ కస్టమైజ్డ్ క్లచ్ మరియు బ్రేక్ లివర్‌ లను కూడా ప్రవేశపెట్టింది. ఒకవేళ ఈ బైక్‌పై మీ చేతులు క్లచ్ లివర్‌ను అందుకోవటానికి కష్టంగా ఉన్నట్లయితే, మీరు కస్టమైజ్డ్ క్లచ్ లివర్‌ను కొనుగోలు చేయవచ్చు. చేతి మరియు వేళ్ల పట్టును బట్టి ఈ క్లచ్ లివర్‌ను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్లచ్-బ్రేక్ లివర్ రూ. 950 ధరలో అందుబాటులో ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

లివర్ గార్డ్

చాలా సందర్భాల్లో బైక్ క్రింద పడిపోవడం వలన దాని క్లచ్ లివర్ సులభంగా విరిగిపోతుంటుంది. కాబట్టి, దానిని రక్షించడానికి లివర్ గార్డ్‌లను ఉపయోగించుకోవచ్చు. కొత్త 2021 యమహా ఆర్15 యొక్క యాక్సెసరీస్ ప్యాక్‌లో ఉన్న లివర్ గార్డ్‌ను కంపెనీ రూ. 900 ధరతో విక్రయిస్తోంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

సీట్ కవర్

ఈ బైక్‌తో లభించే స్టాక్ సీటును ఎండ మరియు వర్షం నుండి కాపాడుకోవటానికి కంపెనీ ఓ ప్రత్యేకమైన సీట్ కవర్ ను కూడా అఫీషియల్ యాక్ససరీగా అందిస్తోంది. అన్ని రకాల వాతావరణంలోనూ సీటును సురక్షితంగా ఉంచడంలో ఈ నాణ్యమైన సీట్ కవర్ ఉపయోగపడుతుంది. ఈ సీట్ కవర్ విశిష్టమైన స్టిచింగ్‌ని కలిగి ఉండి, బైక్‌కు మరింత ప్రీమియం అప్పీల్‌ను ఇస్తుంది. ఈ సీటు కవర్ ధర రూ. 490 గా ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

ట్యాంక్ ప్యాడ్

యమహా ఆర్15 రైడింగ్ పొజిషన్ కారణంగా, దీని ఫ్యూయల్ ట్యాంక్ పై రైడర్ బెల్ట్ లేదా మెటల్ ఆబ్జెక్ట్స్ కారణంగా గీతలు పడే అవకాశా ఉంటుంది. కాబట్టి, ఫ్యూయెల్ ట్యాంక్ పై గీతలు పడకుండా కాపాడటానికి, కంపెనీ ఈ ట్యాంక్ ప్యాడ్‌ను రూ. 190 ధరతో విక్రయిస్తోంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

USB ఛార్జర్

టూవీలర్లలో USB ఛార్జర్ అనేది ఇప్పుడు చాలా ముఖ్యమైన ఫీచర్ గా మారిపోయింది. రైడింగ్ చేస్తున్నప్పుడు మీ ఫోన్ బ్యాటరీ తగ్గిపోతే, మీరు ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కంపెనీ తమ కొత్త ఆర్15 కోసం USB ఛార్జర్‌ని యాక్ససరీ రూపంలో అందిస్తోంది. ఈ USB ఛార్జర్ ధర రూ. 750 గా ఉంటుంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

స్కిడ్ ప్లేట్

గుంతలు మరియు పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఉండే రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు ఇంజన్ నుండి బయటకు వచ్చే ఎగ్జాస్ట్ పైపు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, దీనిని ప్రొటెక్ట్ చేయడానికి కంపెనీ స్కిడ్ ప్లేట్ యాక్ససరీని కూడా అందిస్తోంది. దీని వలన బైక్ క్రింది భాగం దెబ్బతినకుండా ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ. 550 గా ఉంది.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

ఇక కొత్త Yamaha R15 V4.0 బైక్‌లో లభించే ప్రధాన ఫీచర్లను గమనిస్తే, కంపెనీ ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ ఫీచర్‌ను అందిస్తోంది. దీని సాయంతో రైడర్ ఎస్ఎమ్ఎస్, ఇ-మెయిల్, కాల్ అలెర్ట్, ఫోన్ బ్యాటరీ స్థాయి, మెయింటినెన్స్ రిమైండర్, ఇంధన వినియోగ ట్రాకర్ వంటి అనేక రకాల నోటిఫికేషన్ లను రిమోట్‌గా తెలుసుకోవచ్చు.

కొత్త 2021 Yamaha R15 స్పోర్ట్స్ బైక్స్ కోసం అఫీషియల్ యాక్ససరీస్; ప్రారంభ ధర రూ.190

ఈ బైక్ ఇంజన్ వివరాలను గమనిస్తే, ఇందులో 155 సిసి ఎస్ఓహెచ్‌సి ఎఫ్ఐ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 10,000 ఆర్‌పిఎమ్ వద్ద 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 7,500 ఆర్‌పిఎమ్ వద్ద 14.2 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ కాన్స్టాంట్ మెష్ గేర్‌బాక్స్ మరియు వెట్ మల్టీ-డిస్క్ క్లచ్‌తో లభిస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha india reveals official accessories for new r15 price starts at rs 190 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X