డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ యమహా ఎమ్‌టి-15లో కంపెనీ ఓ కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్తగా రానున్న యమహా ఎమ్‌టి-15 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్ ఇకపై డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ ఫీచర్‌తో కూడా అందుబాటులోకి రానుంది.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

యమహా ఎమ్‌టి-15 డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్ కంపెనీ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే, కొత్తగా జోడించిన ఈ ఫీచర్ కారణంగా ఈ బైక్ ధరలను మరింత పెరిగే అవకాశం ఉంది. యమహా గడచిన వారంలో ఎమ్‌టి-15 బైక్‌లో అన్ని కలర్ ఆప్షన్ల ధరలను రూ.1,000 మేర పెంచిన సంగతి తెలిసినదే.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

యమహా ఎమ్‌టి-15 బైక్‌ను తొలిసారిగా 2019 లో భారత మార్కెట్లో విడుదల చేశారు. ఇది యమహా వైజెడ్ఎఫ్-ఆఱ్15 బైక్‌కి నేక్డ్/స్ట్రీట్ ఫైటర్ వెర్షన్‌గా ఉంటుంది. ఈ రెండు మోడళ్లను ఒకే ఛాస్సిస్ మరియు ఒకే ఇంజన్‌తో తయారు చేశారు. ఫలితంగా, వీటి పవర్ టార్క్ గణాంకాలు కూడా ఇంచు మించు ఒకేలా ఉంటాయి.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

డిజైన్ పరంగా మాత్రం ఈ రెండు మోడళ్లు పూర్తి భిన్నంగా కనిపిస్తాయి. యమహా ఎమ్‌టి-15లో స్ప్రాకెట్లు తక్కువగా ఉండి, రహదారిపై ప్రయాణించేందుకు సులువుగా ఉండేలా చేస్తుంది. యమహా ఆర్15 బైక్‌లో ఆఫర్ చేసిన డ్యూయల్-ఛానల్ యూనిట్‌కు బదులుగా యమహా ఎమ్‌టి-15లో సింగిల్-ఛానల్ ఏబిఎస్‌ను ఆఫర్ చేశారు.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

అలాగే, ఆర్15లో ఉపయోగించిన అల్యూమినియం అండర్‌స్లంగ్ యూనిట్‌కు బదులుగా ఎమ్‌టి-15లో స్టీల్ బాక్స్-టైప్ స్వింగార్మ్‌ను ఉపయోగించారు. ఈ మార్పుల కారణంగా, ఎమ్‌టి-15 ధర ఆర్15 ధర కంటే కాస్తంత తక్కువగా ఉంటుంది. కాగా, ఇప్పటి వరకూ సింగిల్ ఛానెల్ ఏబిఎస్‌తో వచ్చిన ఎమ్‌టి-15లో కంపెనీ ఇప్పుడు డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌ను పరిచయం చేసేందుకు సిద్ధమవుతోంది.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

యమహా ఎమ్‌టి-15 ఈ (150సీసీ) విభాగంలో భారత మార్కెట్లో విక్రయించబడుతున్న మోటార్‌సైకిళ్ళలో లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏకైక స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్. అంతేకాదు ఇది ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన స్ట్రీట్ మోటార్‌సైకిల్ కూడా. యమహా ఎమ్‌టి-15 సరళమైన డిజైన్ మరియు విశిష్టమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

కొత్తగా రానున్న డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్‌లో కేవలం బ్రేకింగ్ సిస్టమ్‌లో మార్పు మినహా వేరే ఏ మెకానికల్ మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

యమహా ఎమ్‌టి-15లో 155సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న యమహా ఎమ్‌టి-15 సింగిల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్లో ముందు వైపు మరియు వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అలాగే, సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటాయి.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

భారత మార్కెట్లో యమహా ఎమ్‌టి-15 డార్క్ మ్యాట్ బ్లూ, మెటాలిక్ బ్లాక్, ఐస్ ఫ్లూ వెర్మిలియన్ మరియు కస్టమైజ్ యువర్ వారియర్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. కంపెనీ ఈ నాలుగు కలర్ ఆప్షన్ల ధరలను రూ.1,000 మేర పెంచింది.

డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్

తాజా ధరల పెంపు తర్వాత మార్కెట్లో యమహా ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్ యొక్క కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.41 లక్షల నుండి 1.45 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). కొత్త వచ్చే డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్ వేరియంట్ ధర సింగిల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ ధర కంటే సుమారు రూ.2,000 ఎక్కువగా ఉండొచ్చని అంచనా.

Source: ZigWheels

Article Published On: Tuesday, April 13, 2021, 16:47 [IST]
English summary
Yamaha India To Launch MT-15 With Dual-Channel ABS, Details. Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+