ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా ఇండియా, తమ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ యొక్క ప్రారంభ ధర రూ. 1.16 లక్షలు (ఎక్స్‌షోరూమ్). భారత మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ మోటారుసైకిల్ కొత్త టెక్నాలజీల హోస్ట్ మరియు రెట్రో-రోడ్‌స్టర్ డిజైన్‌ను కలిగి ఉంది.

ఈ కొత్త బైక్ యొక్క బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ బైక్ బుక్ చేసుకునే మొదటి 200 మంది కస్టమర్లకు కంపెనీ యమహా జి-షాక్ వాచ్‌ను కూడా అందించనుంది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అవి ఎఫ్‌జెడ్-ఎక్స్ స్టాండర్డ్ మరియు ఎఫ్‌జెడ్-ఎక్స్ బ్లూటూత్ వేరియంట్స్. వీటి ధరల విషయానికి వస్తే, యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 1.16 లక్షలు కాగా, ఎఫ్‌జెడ్-ఎక్స్ బ్లూటూత్ వేరియంట్ ధర రూ. 1.19 లక్షల వరకు ఉంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త బైక్ మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్టే కాపర్, మాట్టే బ్లాక్ మరియు మెటాలిక్ బ్లూ కలర్స్. ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా అధునాతన ఫీచర్స్ కూడా కలిగి ఉంది. ఇది యమహా బ్రాండ్ యొక్క అప్డేటెడ్ మోడల్.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్‌ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇది టియర్ ఐ ఆకారపు ఫ్యూయెల్ ట్యాంక్‌తో లేటెస్ట్ రిట్రో డిజైన్ కలిగి ఉంటుంది. కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ రోడ్‌స్టెర్ డిజైన్ కారణంగా ట్యాంకుకు ఫెయిరింగ్ లేదా ట్రిమ్ లేదు. అయితే దీనికి బదులుగా మధ్యలో బ్లాక్ అవుట్ స్ట్రిప్‌తో డ్యూయల్-టోన్ ఫ్యూయెల్ ట్యాంక్ కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

ఈ కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ రౌండ్ షేప్ హెడ్‌ల్యాంప్‌లు, బ్లాక్ అవుట్ ఫెండర్లు, ఎగ్జాస్ట్, రిబ్బెడ్ సింగిల్-పీస్ సీట్, రియర్ గ్రాబ్ రైల్, టైర్ హగ్గర్, సింగిల్ పాడ్ ఇన్‌స్టంట్ క్లస్టర్‌తో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లు వంటి వాటిని కూడా కలిగి ఉంటుంది. ఇందులో ఉన్న క్లస్టర్ దాని స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకోబడింది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

ఇప్పుడు కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్‌ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ ద్వారా 'యమహా కనెక్ట్ ఎక్స్' బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంది. దీని ద్వారా బ్యాటరీ స్టేటస్ మరియు ఎస్ఎమ్ఎస్ సందేశాలు మరియు ఇన్‌కమింగ్ కాల్ వంటి వాటిని కూడా అందిస్తుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

ఈ బైక్ లో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్ కలిగిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌, ఎల్ఈడి టైల్ లాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యాప్ ద్వారా బైక్ లొకేషన్, ఫ్యూయెల్ స్టేటస్,సైడ్-స్టాండ్ ఇంజిన్ కట్-ఆఫ్, సింగిల్-ఛానల్ ఏబిఎస్ మరియు బ్లాక్ ప్యాట్రన్ టైర్లను కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ లో ఉన్న 149 సిసి ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్, 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12.2 బిహెచ్‌పి మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ యొక్క సస్పెన్షన్ సెటప్ విషయానికొస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్‌తో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ కలిగి ఉంటుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 282 మిమీ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపు 220 మిమీ డిస్క్ బ్రేక్ ఉంటుంది. దీనితో పాటు సింగిల్-ఛానల్ ఎబిఎస్‌ను కూడా ఇందులో ఉంటుంది.

ఎట్టకేలకు భారత్‌లో అడుగుపెట్టిన కొత్త యమహా FZ-X: ధర & వివరాలు

యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,020 మిమీ, వెడల్పు 785 మిమీ మరియు ఎత్తు 1,115 మిమీ వరకు ఉంటుంది. ఈ యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్‌ యొక్క వీల్ బేస్ 1,330 మిమీ వరకు ఉంటుంది.

యమహా కంపెనీ యొక్క కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ అనేది భారత మార్కెట్లో బ్రాండ్ నుండి వచ్చిన స్పెషల్ ఆఫర్. ఈ బైక్ చాలా సింపుల్ డిజైన్ కలిగి ఉంది. కొత్త ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్ భారతదేశంలో కవాసకి డబ్ల్యూ 175 బైక్‌కి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha FZ-X Launched In India. Read in Telugu.
Story first published: Friday, June 18, 2021, 12:43 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X