భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

ఒకప్పుడు భారతదేశంలో మాక్సీ స్కూటర్లకు ఎలాంటి ప్రాధాన్యత ఉండేది కాదు. అందుకే, ఈ విభాగంలో మాక్సీ స్కూటర్లను విడుదల చేయాలంటే, టూవీలర్ కంపెనీలు ఒకటికి రెండుసార్లు ఆలోచించేవి. అయితే, ఇప్పుడు కొనుగోలుదారుల మైండ్‌సెట్ మారడం మరియు మార్కెట్ పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండటంతో టూవీలర్ కంపెనీలు తమ పెద్ద మాక్సీ స్కూటర్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

సాంప్రదాయ స్కూటర్లతో పోల్చుకుంటే, ఈ మాక్సీ స్కూటర్లు పరిమాణంలో కాస్తంత పెద్దగా ఉండి, మంచి స్పోర్టీ డిజైన్ ను కలిగి ఉంటాయి. ఈ ప్రీమియం స్కూటర్లు అవి ఆఫర్ చేసే ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లకు అనుగుణంగానే వాటి ధరలు కూడా ప్రీమియంగా ఉంటాయి. భారతదేశంలో తాజాగా మరో సరికొత్త మాక్సీ స్కూటర్ విడుదలైంది. ఆ వివరాలేంటో తెలుకుందాం రండి..!

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా మోటార్ ఇండియా (Yamaha Motor India) తమ సరికొత్త మాక్సీ స్కూటర్ 'ఏరోక్స్ 155' (Aerox 155) ను నేడు మార్కెట్లో విడుదల చేసింది. భారత మార్కెట్లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ రెండు వేరియంట్లలో లభ్యం కానుంది. ఇందులోని ప్రారంభ బేస్ వేరియంట్ ధర రూ. 1.29 లక్షలు కాగా, స్పెషల్ ఎడిషన్ మోటో జిపి ఎడిషన్ ధర రూ. 1.30 లక్షలు (రెండు ధరలు ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

యమహా అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ ఆర్15 (R15) మాదిరిగానే ఈ ఏరోక్స్ 155 (Aerox 155) స్కూటర్ కూడా అదే టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. అంతేకాదు ఇందులోని ఇంజన్ మరియు ప్లాట్‌ఫామ్ ను కూడా యమహా ఆర్15 మోడల్ తో పంచుకుంటుంది. కాబట్టి, ఈ మాక్సీ స్కూటర్ మెరుగైన స్పోర్టీ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

ఈ ప్రీమియం స్కూటర్ లో లభించే కొన్ని ముఖ్య ఫీచర్‌ లను గమనిస్తే, ఇందులో సింగిల్ ఛానల్ ఏబిఎస్, 14 ఇంచ్ వీల్స్, 140 మిమీ రియర్ టైర్, బ్లూటూత్ ఎనేబుల్డ్ యమహా మోటార్‌సైకిల్ కనెక్ట్ యాప్, 5.8 ఇంచ్ ఎల్‌సిడి క్లస్టర్, ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు ఎల్‌ఇడి టెయిల్ లైట్, 24.5 లీటర్ అండర్-సీట్ స్టోరేజ్ మరియు ఎక్స్‌టర్నల్ ఫ్యూయెల్ లిడ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

కొత్త ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ లో స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్, ఆటోమేటిక్ స్టార్ట్ / స్టాప్ సిస్టమ్, స్పీడోమీటర్, ఆర్‌పిఎమ్, వివిఏ ఇండికేటర్ మరియు వై-కనెక్ట్ యాప్ ఫోన్ నోటిఫికేషన్స్, మెయింటినెన్స్ రిమైండర్, స్కూటర్ ను చివరిగా పార్క్ చేసిన ప్రదేశం, ఇంధన వినియోగాన్ని ప్రదర్శించే ఎమ్ఐడి యూనిట్‌తో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు యూఎస్‌బి చార్జర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

ఇక ఇందులోని ఇంజన్ విషయానికి వస్తే, యమహా ఆర్15 బైక్‌లో ఉపయోగించిన అదే 155 సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్టెడ్ డిఓహెచ్‌సి ఇంజన్‌ నే ఈ కొత్త ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ లోనూ ఉపయోగించారు. కాకపోతే, ఇది ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ కోసం వేరియబుల్ వాల్వ్ అక్యుమ్యులేషన్ (వివిఏ) టెక్నాలజీని కలిగి ఉంటుంది.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

ఈ ఇంజన్ గరిష్టంగా 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 15.36 బిహెచ్‌పి పవర్ ను మరియు 6500 ఆర్‌పిఎమ్ వద్ద 13.9 ఎన్ ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటి గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. ఈ స్కూటర్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే శక్తి, లేటెస్ట్ యమహా ఆర్15 వి7 4.0 మోడల్ ఉత్పత్తి చేసే శక్తి కంటే 4 బిహెచ్‌పి తక్కువగా ఉంటుంది.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

యమహా ఏరోక్స్ 155 (Yamaha Aerox 155) మాక్సీ స్కూటర్ ఈ విభాగంలో ఆప్రిలియా ఎస్ఎక్స్ఆర్ 160 (Aprilia SXR 160) తో పోటీపడుతుంది. ఈ కొత్త యమహా స్కూటర్ ఆప్రిలియా స్కూటర్ కన్నా (10.9 బిహెచ్‌పి పవర్) శక్తివంతమైనది. యమహా Aerox 155 అనేది ఇండియన్ మార్కెట్లో 150-160 సీసీ ప్రీమియం స్కూటర్ స్పేస్‌లోకి ప్రవేశించిన బ్రాండ్ యొక్క మొదటి ఉత్పత్తి అవుతుంది.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

యమహా ఏరోక్స్ 155 మాక్సీ స్కూటర్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో, ప్రత్యేకించి ఆగ్నేయాసియా దేశాలలో మంచి ఆదరణ పొందింది మరియు ఐరోపాలో 1997 నుండి Aerox నేమ్‌ప్లేట్ కింద ఇది అందుబాటులో ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌ లో ఈ స్కూటర్ వివిధ రకాల ఇంజన్ సామర్థ్యాలలో రిటైల్ చేయబడుతోంది.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

ఈ స్కూటర్ కొలతలను గమనిస్తే, ఇది 1,980 మిమీ పొడవు, 700 మిమీ వెడల్పు, 1,150 మిమీ ఎత్తు మరియు 1,350 మిమీ వీల్‌బేస్ ను కలిగి ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏరోక్స్ 155 స్కూటర్ వీల్‌బేస్ ఆర్15 వి 3.0 బైక్ కన్నా 25 మిమీ ఎక్కువగా ఉంటుంది. ఈ స్కూటర్ మొత్తం బరువు 276 కిలోలుగా ఉంటుంది.

భారత్‌లో Yamaha Aerox 155 మాక్సీ స్కూటర్ విడుదల; ధరెంతో తెలుసా..?

ఈ స్కూటర్ డిజైన్ ను గమనిస్తే, ముందు భాగంలో డ్యూయల్-పాడ్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ వింగ్ ఆకారంలో ఉండే ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, షార్ప్ బాడీ వర్క్, చిన్న విండ్‌స్క్రీన్, స్పోర్టీ బాడీ గ్రాఫిక్స్, స్టబ్బీ ఎగ్జాస్ట్ సిస్టమ్, పెద్ద ఫుట్‌బోర్డ్, 790 మిమీ సీట్ హైట్ మరియు 5.5 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha motor india launches its first maxi scooter aerox 155 in india price details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X