రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో విక్రయిస్తున్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ యమహా ఎమ్‌టి-15 ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. యమహా ఎమ్‌టి-15 నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్‌లోని అన్ని కలర్ ఆప్షన్ల ధరలను రూ.1,000 మేర పెంచుతున్నట్లు ప్రకటించింది.

రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

యమహా ఎమ్‌టి-15 ఈ (150సీసీ) విభాగంలో భారత మార్కెట్లో విక్రయించబడుతున్న మోటార్‌సైకిళ్ళలో లిక్విడ్-కూలింగ్ టెక్నాలజీ కలిగి ఉన్న ఏకైక స్ట్రీట్ మోటార్‌సైకిల్. అంతేకాదు ఇది ఈ విభాగంలోనే అత్యంత శక్తివంతమైన స్ట్రీట్ మోటార్‌సైకిల్ కూడా. యమహా ఎమ్‌టి-15 సరళమైన డిజైన్ మరియు విశిష్టమైన స్టైలింగ్‌ను కలిగి ఉంటుంది.

రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

యమహా ఎమ్‌టి-15 కేవలం ఒకే ఒక వేరియంట్‌లో నాలుగు ఆప్షన్లలో లభిస్తుంది. కలర్ ఆప్షన్‌ను బట్టి దీని ధరలు మారుతూ ఉంటాయి. అంతేకాకుండా, కంపెనీ కస్టమర్ల ఎంపిక మేరకు ఈ కలర్లలో కస్టమైజేషన్ ఆప్షన్‌ను అందిస్తోంది. దీని ఆధారంగా కస్టమర్లు తమ మోటార్‌సైకిల్‌కు అందుబాటులో ఉన్న తమకు నచ్చిన కలర్లను ఎంచుకోవచ్చు.

రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

యమహా ఇప్పుడు ఈ నాలుగు కలర్ ఆప్షన్ల ధరలను రూ.1,000 మేర పెంచింది. తాజా ధరల పెంపు తర్వాత మార్కెట్లో యమహా ఎమ్‌టి-15 మోటార్‌సైకిల్ యొక్క కొత్త ఎక్స్-షోరూమ్ ధరలు రూ.1.41 లక్షల నుండి 1.45 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్).

రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

వీటిలో డార్క్ మ్యాట్ బ్లూ మరియు మెటాలిక్ బ్లాక్ షేడ్స్ ధరలు రూ.1,40,900 గా ఉండగా, ఐస్ ఫ్లూ-వెర్మిలియన్ కలర్ ఆప్షన్ ధర రూ.1,41,900 మరియు కస్టమైజ్ ఆప్షన్ ధర రూ.1,44,900 గా ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). ధరల పెంపు మినహా ఈ మోటార్‌సైకిల్‌లో వేరే ఏ ఇతర మార్పులు లేవు.

రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

యమహా ఎమ్‌టి-15లో 155సిసి సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 18.4 బిహెచ్‌పి శక్తిని మరియు 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది స్లిప్పర్ అసిస్ట్ క్లచ్‌తో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

ఇందులోని కొన్ని మెకానికల్ ఫీచర్లను గమనిస్తే, సింగిల్-ఛానల్ ఏబిఎస్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్‌లు, పూర్తి డిజిటల్ ఎల్‌సిడి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మొదలైనవి ఉన్నాయి. యమహా ఎమ్‌టి-15 యొక్క డిజైన్‌ను కంపెనీ అందిస్తున్న పాపులర్ ఎమ్‌టి-09 సూపర్ బైక్ నుండి ప్రేరణ పొంది రూపొందించబడినది.

Yamaha MT15 New Price Old Price Difference
Dark Matte Blue ₹1,40,900 ₹1,39,900 ₹1,000
Metallic Black ₹1,40,900 ₹1,39,900 ₹1,000
Ice Fluo-vermillion ₹1,41,900 ₹1,40,900 ₹1,000
Customize ₹1,44,900 ₹1,43,900 ₹1,000
రూ.1,000 పెరిగిన యమహా ఎమ్‌టి-15 ధరలు: కొత్త ధరల జాబితా

యమహా ఎమ్‌టి-15 ను మూడు బాడీ పెయింట్ స్కీమ్స్ మరియు చక్రాల కోసం నాలుగు కలర్ స్కీమ్‌లను అందిస్తున్నారు. ఇది వినియోగదారులకు వారి ఎమ్‌టి-15 బైక్‌ను కస్టమైజ్ యువర్ వారియర్ (సివైడబ్ల్యు) ప్రోగ్రామ్ ద్వారా కొనుగోలు చేసేటప్పుడు ఎంచుకోవడానికి 14 రకాల ఆప్షన్లను అందిస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha MT-15 Prices Increased By Rs 1,000; New Price List. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X