భారత్‌లో రెండు హైబ్రిడ్ స్కూటర్స్ లాంచ్ చేసిన Yamaha; ధర, ఫీచర్స్ & వివరాలు
ప్రముఖ బైక్ అండ్ స్కూటర్ తయారీ సంస్థ Yamaha (యమహా) దేశీయ మార్కెట్లో యమహా RayZR 125 FI Hybrid (రేజెడ్ఆర్ 125 ఎఫ్ఐ హైబ్రిడ్) మరియు Street Rally 125 FI Hybrid (స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ హైబ్రిడ్) అనే రెండు కొత్త స్కూటర్లు లాంచ్ చేసింది. భారతీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త స్కూటర్స్ కొత్త ఫ్యూయల్ ఇంజెక్టెడ్ హైబ్రిడ్ ఇంజిన్‌తో విడుదల చేసింది. ఈ కొత్త స్కూటర్స్ అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. ఈ కొత్త స్కూటర్స్ గురించి పూర్తి సమచారం ఇక్కడ తెలుసుకుందాం.

ఈ కొత్త యమహా స్కూటర్స్ యొక్క ధరల విషయానికి వస్తే, ఇందులోని RayZR 125 FI హైబ్రిడ్ డ్రమ్ వేరియంట్ ధర రూ. 76,830 కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ. 79,830(ఎక్స్-షోరూమ్). ఇక యమహా స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ విషయానికి వస్తే, దీని ధర రూ. 83,830 (ఎక్స్-షోరూమ్).

ఈ కొత్త స్కూటర్స్ కొత్త ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడిన హైబ్రిడ్ ఇంజిన్‌తో రావడం వల్ల, మునుపటి కంటే ఎక్కువ మైలేజీని అందిస్తాయి. ఈ రెండు స్కూటర్లలో 125 సీసీ లైట్ వెయిట్ హైబ్రిడ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అమర్చబడి ఉంటుంది, ఇది 8.2 బిహెచ్‌పి పవర్ మరియు 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ స్కూటర్లు స్మార్ట్ మోటార్ జనరేటర్ (SMG) సిస్టం కలిగి ఉంటాయి.

ఈ కొత్త స్కూటర్స్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, రెండు స్కూటర్లు సైలెంట్ స్టార్ట్, లేటెస్ట్ ఎల్ఈడి హెడ్‌లైట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 190 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ మరియు యమహా బ్లూటూత్ కనెక్టివిటీతో ఆటోమేటిక్ స్టార్ట్/స్టాప్ ఫంక్షన్‌ను కూడా పొందుతాయి. స్కూటర్ సైడ్ స్టాండ్ ఇంజిన్ కటాఫ్ స్విచ్‌ను కూడా పొందుతుంది.

ఈ రెండు కొత్త స్కూటర్లు కూడా పాస్ స్విచ్, ఎల్ఈడీ పొజిషన్ లైట్, పవర్ అసిస్ట్ ఇండికేటర్ మరియు సీట్ ఓపెనర్‌తో మల్టీ-ఫంక్షన్ కీని పొందుతాయి. గతంలో కంటే ఇప్పుడు స్కూటర్లకు విశాలమైన టైర్లు అమర్చబడి ఉన్నాయి. కావున ఇవి ఇప్పుడు 110 మిమీ వెడల్పు గల టైర్లను పొందుతుంది.

టైర్లు విశాలంగా ఉండటం వల్ల రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మంచి పట్టుని అందిస్తాయి. కావున రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ స్కూటర్స్ 21 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ పొందుతాయి. కావున వాహన వినియోగదారులు ఇక్కడ తమ వస్తువులను ఉంచుకోవచ్చు.

Yamaha RayZR 125 FI హైబ్రిడ్ మరియు స్ట్రీట్ ర్యాలీ 125 FI హైబ్రిడ్ రెండు స్కూటర్లు కూడా బ్లూటూత్ ఎనేబుల్ ఫీచర్లను పొందుతాయి. వీటిని యమహా కనెక్ట్-యాప్ ద్వారా ఉపయోగించవచ్చు. ఈ అప్లికేషన్, స్కూటర్ గురించి వివిధ రకాల సమాచారాన్ని రైడర్‌కు అందిస్తుంది. ఇందులో రైడింగ్ హిస్టరీ, లొకేషన్ మై వెహికల్, పార్కింగ్ రికార్డు మరియు వెహికల్ హజార్డ్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా రైడర్ కి చాలా ఉపయోగపడతాయి.

యమహా కంపెనీ దేశీయ మార్కెట్లోని యువ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని ఈ స్కూటర్లను తయారీచేసినట్లు తెలిపింది. ఈ కొత్త స్కూటర్స్ మంచి స్టైలింగ్, మంచి ఫీచర్స్ మరియు మంచి పనితీరుని అందిస్తాయి. కొత్త యమహా స్కూటర్లు ఇప్పుడు 4 కొత్త రంగులతో సహా మొత్తం 7 రంగులలో అందుబాటులో ఉన్నాయి.

ప్రస్తుతం భారతదేశంలో పండుగ సీజన్లు ప్రారంభమయ్యాయి. కావున ఈ సమయంలో కంపెనీ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడుయమహా ఫాసినో 125 మరియు రే జెడ్ఆర్ స్కూటర్ కొనుకోలుపై రూ. 20,000 ఆఫర్ తో దాదాపు ఒక లక్ష రూపాయలు బహుమతి గెలుచుకునే గొప్ప అవకాశాన్ని కంపెనీ అందిస్తోంది.

కంపెనీ ఇప్పుడు యమహా ఫాసినో 125, ఫాసినో 125 హైబ్రిడ్, రే జెడ్ఆర్ 125 మరియు రే జెడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ స్కూటర్లపై ఆఫర్లను అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ తన అన్ని స్కూటర్ మోడళ్లపై రూ. 2,999 ఖచ్చిత బహుమతిని అందిస్తుంది.దీనితో పాటు స్కూటర్ కొనుగోలుపై, కస్టమర్‌కు రూ .35,000 నుండి రూ .1,00,000 వరకు బంపర్ బహుమతులు గెలుచుకునే స్క్రాచ్ కార్డ్ ఇవ్వబడుతుంది.

స్కూటర్ కొనుగోలు చేసిన కస్టమర్లకు పైన చెప్పిన అన్ని ఆఫర్స్ తో పాటు రూ. 20,000 అడిషినల్ బెన్ఫీట్స్ కూడా అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ వల్ల ఎక్కువమంది కస్టమర్ యమహా స్కూటర్లను కొనుగోలు చేసే అవకాశం ఉంది. కావున దీని ద్వారా కంపెనీ అమ్మకాలు మెరుగుపడే ఆకాశం ఉందని భావిస్తున్నాము.


Click it and Unblock the Notifications








