యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో కొన్ని కొత్త మోడళ్లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, యమహా తమ పాపులప్ మిడిల్-వెయిట్ మోటార్‌సైకిల్, వైజెడ్ఎఫ్-ఆర్3 మోడల్‌లో కొత్తగా బిఎస్6 వెర్షన్‌ను విడుదల చేయనుంది.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

భారతదేశంలో ఉద్గార నిబంధనలు కఠినతరం చేసినప్పటి నుండి యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 మోటార్‌సైకిల్‌లో కంపెనీ ఇంకా బిఎస్6 వెర్షన్‌ను ప్రవేశపెట్టలేదు. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ మోటార్‌సైకిల్‌‌ను భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఇటీవల లీకైన స్పై చిత్రాలను గమనిస్తే, యమహా ఆర్15 వి4 కవర్లతో దీనిని పరీక్షిస్తోంది.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

ఈ స్పై చిత్రాలను గమనిస్తే, మునుపటి వెర్షన్‌తో పోల్చినప్పుడు ఈ కొత్త బిఎస్6 వెర్షన్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 కొంచెం వెడల్పుగా తెలుస్తోంది. ఈ టెస్టింగ్ వాహనంలోని హెడ్‌లైట్ వైజెడ్ఎఫ్-ఆర్7 మోడల్‌లో కనిపించినట్లుగా ఉంటుంది.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

ఈ బైక్ వెనుక భాగంలో పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏవీ లేవు. క్రింత బిఎస్4 ఆర్3 బైక్‌లోని డిజైన్ అలానే కొనసాగించినట్లు అనిపిస్తుంది. టెస్టింగ్‌లో ఈ యమహా బైక్‌పై డ్రైవర్ కూర్చున్న తీరును చూసినప్పుడు, దీని రైడింగ్ పొజిషన్‌ను మరింత అగ్రెసివ్‌గా డిజైన్ చేయబడిందని తెలుస్తోంది.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 మోడల్‌లో స్వల్ప కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మాత్రమే కాకుండా, కొన్ని యాంత్రికపరమైన మార్పులు కూడా ఉన్నాయి. ఇందులో డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ మరియు 6-యాక్సిస్ ఐఎమ్‌యూ సెన్సార్ వంటి మార్పులు ఇందులో చేయబడ్డాయి.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

యమహా ఆర్7 బైక్‌లో కనిపించే ట్రాక్షన్ కంట్రోల్ లేదా పవర్ మోడ్స్ వంటి ఫీచర్లు ఈ కొత్త ఆర్3లో ఉండకపోవచ్చు. ఇంజన్ పరంగా కూడా ఇందులో బిఎస్6 అప్‌గ్రేడ్ మినహా వేరే ఏ ఇతర మార్పు ఉండబోదని తెలుస్తోంది. బిఎస్4 మోడల్‌లో ఉపయోగించిన ఇంజన్‌నే బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయనున్నారు.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

కొత్త 2021 యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 బైక్‌లో 321 సిసి, లిక్విడ్-కూల్డ్, పారలల్-ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉంటుంది. గతంలోని బిఎస్4 వెర్షన్ గరిష్టంగా 10,750 ఆర్‌పిఎమ్ వద్ద 41 బిహెచ్‌పి శక్తిని మరియు 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 29 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

మునుపటి యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 మోడల్‌ను డైమండ్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇది మంచి బ్యాలెన్స్‌ను ఆఫర్ చేస్తుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపు 298 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్‌ను బ్రేక్ ఉంటాయి. ఇవి రెండూ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్‌ను సపోర్ట్ చేస్తాయి. ఈ ఏడాది ఆరంభంలో, యమహా తమ అప్‌డేటెడ్ 2021 ఆర్3 బైక్‌ను కొత్త కలర్ ఆప్షన్లతో జపాన్ మార్కెట్లో విడుదల చేసింది.

యమహా నుండి త్వరలో కొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్3 బిఎస్6 మోడల్ రాబోతోంది!

కొత్త యమహా వైజెడ్ఎఫ్-ఆర్3 పెయింట్స్‌తో పాటుగా ఇందులో పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా జోడించారు. అయితే, భారత మార్కెట్లో విడుదల కాబోయే ఆర్3 ఫేస్‌లిఫ్ట్‌లో ఈ ఫీచర్ ఉండకపోవచ్చు. ఇది ఈ విభాగంలో టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్ 310, కెటిఎమ్ ఆర్‌సి 390 వంటి మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha To Launch 2021 BS6 YZF R3 In India Soon, Details. Read in Telugu.
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X