భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

భారతదేశంలో రోజురోజకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. వాహన కొనుగోలుదారులు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భాగంగానే ఇప్పటికే చాలా మంది వాహన తయారీదారులు భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నారు.

ఇందులో భాగంగానే యమహా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడానికి శ్రీకారం చుట్టింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ద్విచక్ర వాహన సంస్థలలో ఒకటైన యమహా త్వరలో దేశీయ మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇటీవల కాలంలో కంపెనీ దేశీయ మార్కెట్లో మరియు ప్రపంచ మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ విడుదల చేయడానికి సన్నద్ధమవుతోందని యమహా ఇండియా సీనియర్ సేల్స్ ఆఫీసర్ రవీందర్ సింగ్ కార్ అండ్ బైక్ మ్యాగజైన్‌కు చెప్పారు.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

భారతదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ మరియు ప్రభుత్వ ప్రోత్సాహాలైన సబ్సిడీలు అన్ని కూడా మంచి అమ్మకాలకు ఉపయోగపడతాయని, అంతే కాకుండా ఛార్జింగ్ సదుపాయాలు కూడా రోజురోజుకి అందుబాటులోకి వస్తున్నాయని ఆయన అన్నారు.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

భారతదేశంలో ఇటీవల ప్రారంభించిన పాసినో 125 హైబ్రిడ్ స్కూటర్స్, మా కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్లోకి ప్రవేశించడానికి మొదటి అడుగు, అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కంపెనీ భారతదేశానికి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అందించడానికి కృషి చేస్తోంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

గత రెండు సంవత్సరాలుగా కంపెనీ తైవాన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించబడుతున్నాయి. కావున ఎలక్ట్రిక్ వాహనాలకు కావలసిన టెక్నాలజీ మాకు అందుబాటులో ఉంది. యమహా కంపెనీ తన ఈ-01 ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కాన్సెప్ట్ మోడల్‌ను టోక్యో మోటార్ షోలో ఇదివరకే ఆవిష్కరించింది

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

యమహా తైవాన్‌కు చెందిన కోకోరో సహకారంతో ఇసి-05 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా విడుదల చేసింది. ఈ స్కూటర్ గంటకు 90 కి.మీ వేగంతో ప్రయాణించగలదు. ఈ స్కూటర్ పూర్తి చార్జితో దాదాపు 100 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా యమహా భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

భారత్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్‌ లాంచ్ చేయనున్న యమహా; వివరాలు

భారత మార్కెట్లో యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలైన తర్వాత, దేశీయ మార్కెట్లో ఇప్పటికే ఉన్న టివిఎస్ ఐ-క్యూబ్, ఏథర్ 450 ఎక్స్ మరియు బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది. అయితే యమహా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు విడుదల చేస్తుంది అనే దానిపై అధికారిక సమాచారం అయితే అందుబాటులో లేదు.

Source: Carandbike

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Plans To Launch Electric Scooter In India. Read in Telugu.
Story first published: Friday, June 25, 2021, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X