'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

జపనీస్ టూవీలర్ బ్రాండ్ యమహా భారత మార్కెట్లో 'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ కోసం రిజిస్టర్ చేసుకుంది. యమహా ట్రేసర్ పేరుతో కంపెనీ భారత మార్కెట్లో ఓ సరికొత్త హై-పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయవచ్చని తెలుస్తోంది. ఇది 700సీసీ ఇంజన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

యమహా నుండి పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ కోసం ఎదురుచూస్తున్న మోటార్‌సైకిలిస్టులకు ఇది ఖచ్చితంగా శుభవార్తనే చెప్పాలి. యమహా ట్రేసర్ ఒక స్పోర్ట్-టూరింగ్ మోటార్‌సైకిల్‌గా ఉంటుంది. కంపెనీ ఇప్పటికే ఈ తరహా మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. త్వరలోనే, ఇది భారత మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది.

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

భారతదేశంలో ఇటీవలి కాలంలో పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లకు గిరాకీ బాగా పెరుగుతుండటాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో, ఈ జపనీస్ టూవీలర్ బ్రాండ్ కూడా భారతదేశంలో పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లపై ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు ఇటీవల ధృవీకరించింది. భారత మార్కెట్లో 150 సిసికి పైగా ఇంజన్ సామర్థ్యం కలిగిన ప్రీమియం మోటార్‌సైకిళ్ల తయారీపై దృష్టి సారించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

MOST READ:బంపర్ ఆఫర్ ప్రకటించిన కియా మోటార్స్; కారు నచ్చకపోతే 30 రోజుల్లో రిటర్న్ చేయవచ్చు

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

ఇందులో భాగంగానే, యమహా తమ సరికొత్త 2021 వైజెడ్ఎఫ్-ఆర్7 మోడల్‌ను ఆవిష్కరించింది. తాజాగా, ఎఫ్‌జెడ్-ఎక్స్ కోసం ట్రేడ్మార్క్‌ను కూడా నమోదు చేసింది, ఇది ఎఫ్‌జెడ్-ఎస్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న నియో-రెట్రో మోటార్‌సైకిల్ అవుతుంది. వీటితో పాటుగా కంపెనీ ఇప్పుడు కొత్తగా ట్రేసర్ అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది.

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

వాస్తవానికి యమహా ట్రేసర్ అనే పేరును 2017లోనే ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేసుకుంది. కానీ, ఈ పేరుకి గడచిన ఫిబ్రవరి నెలలో ఆమోదం లభించింది. అయితే, ఈ ట్రేసర్ బ్రాండ్ పేరుతో కంపెనీ 700సిసి లేదా 900సిసి బైక్‌ను విడుదల చేస్తుందా అనే విషయంపై స్పష్టత లేదు. ఏదేమైనప్పటికీ, ఈ బ్రాండ్ నుండి పెద్ద సామర్థ్యం గల మోటార్‌సైకిల్ వస్తుందనేది మంచి విషయం.

MOST READ:ప్రజల కోసం తన కారును అంబులెన్సుగా మార్చిన కాంగ్రెస్ నాయకుడు, ఎవరో తెలుసా?

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

యమహా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లలో ట్రేసర్ 700 మరియు ట్రేసర్ 900 మోడళ్లను విక్రయిస్తోంది. ఇవి రెండూ వేర్వేరు విభాగాలలో అందుబాటులో ఉండి, కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయి. వీటి ఫ్రంట్ ఫాసియాను యమహా ఎమ్‌టి సిరీస్ మోడళ్ల నుండి ప్రేరణ పొంది డిజైన్ చేసినట్లుగా ఉంటుంది.

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

పెద్ద రేడియేటర్ కవర్స్‌తో ఇది అడ్వెంచర్ మోటార్‌సైకిల్ యొక్క వైఖరిని కలిగి ఉంటుంది. దీని ఏరోడైనమిక్స్‌ను సుదూర ప్రయాణాలలో సౌకర్యంగా ఉండేలా డిజైన్ చేశారు. ఉత్తమ రైడర్ సీట్ పొజిషన్, మెరుగైన హ్యాండ్లింగ్ మరియు అధునాతన రైడర్ అసిస్ట్ ఫీచర్లతో ఈ బైక్ లభిస్తుంది.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

యమహా ట్రేసర్ 700 బైక్‌లో 689సిసి, పారలల్-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 73.77 బిహెచ్‌పి శక్తిని మరియు 68 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ట్రేసర్ 900 బైక్‌లోని ఇన్-లైన్ త్రీ-సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 113.42 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి మరియు 87.5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

యమహా ఈ ట్రేసర్ మోటార్‌సైకిళ్లను భారతదేశంలో లాంచ్ చేస్తే, యమహా ట్రేసర్ 700 రాబోయే అప్రిలియా టుయోనో 660 తో పోటీపడుతుంది. అలాగే, యమహా ట్రేసర్ 900 భారతదేశంలో లాంచ్ అయితే ఇది బిఎమ్‌డబ్ల్యూ ఎఫ్ 900 ఎక్స్‌ఆర్ మరియు ట్రయంప్ టైగర్ 850 స్పోర్ట్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

MOST READ:నదిలో చిక్కుకున్న మహీంద్రా థార్.. బయటకు లాగిన మిత్సుబిషి పజెరో[వీడియో]

'ట్రేసర్' అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసిన యమహా, కొత్త బైక్ రాబోతుందా?

భారతదేశంలో యమహా ట్రేసర్ ప్రారంభం గురించి మరిన్ని వివరాలు రాబోయే నెలల్లో తెలుస్తాయి. యమహా తమ వైజెడ్ఎఫ్-ఆర్7 మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసే అంశాన్ని పరిశీలిస్తున్నందున, ఈ రెండు మోటార్‌సైకిళ్ళు కూడా ఒకే ప్లాట్‌ఫాంపై ఆధారపడి ఉంటాయని మరియు ఒకేరకమైన ఇంజన్‌ను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Trademarks 'Tracer' Name In India; Will It Be A 700cc Touring Bike? Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X